Best Horror Movies on OTT : ఓటిటి లో హారర్ థ్రిల్లర్ సినిమాలను ఆదరించే అభిమానుల సంఖ్య చాలా ఎక్కువగానే ఉంటుంది. స్త్రీ 2,ముంజ్య వంటి చిత్రాల తర్వాత ఈ లీగ్ సినిమాలకు డిమాండ్ బాగా పెరిగింది. ఈ నేపద్యంలో డిజిటల్ మీడియాలో స్ట్రీమింగ్ అవుతున్న టాప్ 5 హర్రర్ సినిమాల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలన్ని భయంకరమైన కథలతో స్ట్రీమింగ్ అవుతున్నాయి.హాలీవుడ్ సినిమాలలో ఉన్నంత హారర్ ఇండియన్ సినిమాలో లేదనేది ఒక అపోహ మాత్రమే. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలు చూడాలంటే హనుమాన్ చాలీసాను తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఇందులో దయ్యాలు భయపెట్టే విధానం మీకు గూస్‌బంప్స్ తెప్పిస్తుంది.
భిన్నా(Bhinna)
సౌత్ సినిమా ఇండస్ట్రి ఇప్పుడు హర్రర్ జానర్ లో కూడా గొప్ప చిత్రాలను అందిస్తోంది.హర్రర్ జానర్ లో కన్నడ హర్రర్ థ్రిల్లర్ సినిమా ‘భిన్నా’ ను ఒక అద్భుతమైన మూవీగా చెప్పుకోవచ్చు. ఈ మూవీలో ఒక అమ్మాయి ఒక దెయ్యం కథను చదువుతూ వుంటుంది. ఈ క్రమంలోనే కథలో చనిపోయిన వ్యక్తులు తిరిగి జీవం పోసుకోవడం ప్రారంభిస్తారు. జీవం పోసుకున్న ఆత్మలు చేసే ఆరాచకాలతో మూవీ స్టోరీ నడుస్తుంది. ఈ చిత్రం OTT ప్లాట్‌ఫామ్ (Zee5)లో స్ట్రీమింగ్ అవుతోంది.
భూతకాలం (Bhutakaalam)
ఇద్దరు తల్లీకొడుకులు ఓ ఇంట్లో సంతోషంగా జీవిస్తుంటారు. కొన్ని రోజుల తరువాత వీరి జీవితంలోకి మూడవ వ్యక్తి ప్రవేశిస్తాడు. ఆ మూడవ వ్యక్తి మరెవరో కాదు ఒక భయంకరమైన దెయ్యం.ఆ దెయ్యం వలన ఆ ఫ్యామిలీ ఏమౌతుందో తెలిస్తే వెన్నులో వణుకు పుడుతుంది. మలయాళ సినిమా ఇండస్ట్రి నుంచి వచ్చిన ఒక అద్భుతమైన మూవీ ఈ భూతకాలం. ఈ మూవీ OTT ప్లాట్‌ఫామ్ (Sony Liv)లో అందుబాటులో ఉంది.ఈ సినిమాలో భయంకరమైన సన్నివేశాలు చాలా ఉన్నాయి.
డెమోంటే కాలనీ (demonte colony)
నలుగురు స్నేహితుల కథను ‘డెమోంటే కాలనీ’ చిత్రంలో చూపించారు. ఒకరోజు నలుగురు స్నేహితులు హాంటెడ్ ప్యాలెస్‌కి వెళతారు. అయితే ఆ ప్యాలెస్‌కి వెళ్ళిన ఈ నలుగురు స్నేహితులు మళ్ళీ కొద్ది రోజుల తరువాత తిరిగి వస్తారు. అయితే ఆసమయంలో వారిలో ఒకరు చనిపోతారు. ఆ తరువాత వారిలో ఒకరి శరీరం లోకి ఒక ఆత్మ ప్రవేశిస్తుంది. ఆ ఆత్మవల్ల ఆ నలుగురి జీవితాలు మారిపోతాయి. అది ఎలా జరుగుతుందో తెలుసుకోవాలంటే యూట్యూబ్ (youtube)లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీని తప్పకుండా చూడండి. `
అమీస్ (amees)
అమీస్ సినిమా కూడా ప్రమాదకరమైన హారర్ థ్రిల్లర్ మూవీ. ఒక టీచర్, స్టూడెంట్‌ల మధ్య జరిగే లవ్ స్టోరీ ఈ సినిమాలో చూపించారు. కానీ ఈ టీచర్‌కి ఒక ప్రత్యేకమైన మాంసము తినే అలవాటు ఉంటుంది. ఆ ప్రత్యేకమయిన మాంసము ఏమిటంటే అది మానవ మాంసము.అది చూసి స్టూడెంట్ భయంతో వణికి పోతాడు. ఈ చిత్రాన్ని OTT ప్లాట్‌ఫామ్ (Sony Liv) లో చూడవచ్చు.
404 : ఎర్రర్ (404 Error)
కళాశాలలోని ఓ గది చాలా ఏళ్లుగా మూతపడి ఉంటుంది. అక్కడే నివసిస్తున్న ఒక విద్యార్థి చాలా కాలం క్రితం ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడు. ఒక కొత్త అబ్బాయి ఆ కళాశాలలోని మూత పడిన గదిలోనే చదువుకుంటూ ఉంటాడు.అయితే ఆ తర్వాత ఆ గదిలో దెయ్యం ఆ అబ్బాయిని ఏం చేసిందో తెలిస్తే భయంతో చామతలు పట్టాల్సిందే.ఈ మూవీ యూట్యూబ్ (youtube)లో స్ట్రీమింగ్ అవుతోంది