E-Paper
Advertisement

టీమిండియాలాగా చీటింగ్ చేయ‌లేదు.. రూల్స్ ప్రకార‌మే అంధుల ఆసియా క‌ప్ గెలిచాం

టీమిండియాలాగా చీటింగ్ చేయ‌లేదు.. రూల్స్ ప్రకార‌మే అంధుల ఆసియా క‌ప్ గెలిచాం
Advertisement

Tanveer Ahmed On Controversial Asia Cup Win: బ్లైండ్ ఆసియా కప్ 2026 టోర్నమెంట్ (Blind Asia Cup 2026 Tournament) విజేతగా పాకిస్తాన్ జట్టును ప్రకటించడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. అయితే ఈ అంశంపై పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ తన్వీర్ అహ్మద్ (Tanveer Ahmed) సంచలన వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా లాగా తామేం చీటింగ్ చేసి గెలవలేదని… రూల్స్ ప్రకారమే పాకిస్తాన్ అంధుల క్రికెట్ జ‌ట్టు ఆసియా కప్ విజేతగా నిలిచిందని ప్రకటించాడు. బ్లైండ్ ఆసియా కప్ 2026 టోర్నమెంట్ ప్రారంభం నుంచి పాకిస్తాన్ జట్టు అద్భుతంగా రాణించి ఓటమి లేకుండా దూసుకు వెళ్లిందని గుర్తు చేశాడు.

ఈ క్రమంలోనే మెరుగైన రన్ రేట్ సాధించిన బ్లైండ్ పాకిస్తాన్ క్రికెట్ జట్టు… ఫైనల్ లో వర్షం పడడంతో విజేతగా నిలిచిందని వెల్లడించాడు. మ్యాచ్ రిఫరీలు బాగా ఆలోచించి ఈ నిర్ణయాన్ని తీసుకున్నారని వెల్లడించాడు. అంతేకానీ దౌర్జన్యంగా ట్రోఫీ లాగేసుకోలేదని హితువు పలికాడు. ఈ విషయంలో టీమిండియా బ్లైండ్ క్రికెట్ జట్టు అనవసరంగా రాద్ధాంతం చేస్తుందని ఫైర్ అయ్యాడు. పాకిస్తాన్ ను విలన్ చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాడు త‌న్వీర్ అహ్మ‌ద్.

వర్షం పడకపోయినా టీమిండియా బ్లైండ్ జట్టును చిత్తుగా ఓడించే వాళ్ళం

Advertisement

బ్లైండ్ ఆసియా కప్ 2026 టోర్నమెంట్ (Blind Asia Cup 2026 Tournament) ఫైనల్ సందర్భంగా వర్షం పడకపోయినా టీమిండియా జట్టును తమ పాకిస్తాన్ చిత్తుగా ఓడించేదని తన్వీర్ అహ్మద్ సంచలన ప్రకటన చేశాడు. గ్రూప్ స్టేజీలో ఇప్పటికే టీమిండియా జట్టును తమ పాక్ ఓడించిందని గుర్తు చేశాడు. ఫైనల్ సందర్భంగా వర్షం పడక మ్యాచ్ జరిగినా అదే పరిస్థితి రిపీట్ అయ్యేదని వ్యాఖ్యానించాడు. బ్లైండ్ టీమిండియా కంటే తమ పాకిస్తాన్ జట్టు చాలా బలమైనదని వ్యాఖ్యానించాడు. అందుకే ఫైన‌ల్ లో వ‌ర్షం ప‌డ‌క‌పోయినా, గెలిచేవాళ్ల‌మ‌ని తెలిపాడు.

Fatima Sana Ahead Of Babar Azam? Ex-Pakistan Selector’s Explosive Verdict Sparks Debate : ఫాతిమా ప్రవాహంలో స్మృతి, హర్మన్ కొట్టుకుపోతారు..WPL వేలంలో సనా రూ.10 కోట్లు పలకడం పక్కా!

బంతి పడకుండానే పాకిస్తాన్ కు ట్రోఫీ… టీమిండియా వాకౌట్

Advertisement

బ్లైండ్ ఆసియా కప్ 2026 టోర్నమెంట్ ఫైనల్ బంతి పడకుండానే ముగిసింది. బంగ్లాదేశ్ లోని ఢాకా వేదికగా ఈ ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా, పాకిస్తాన్ బ్లైండ్ జట్లు తలపడాలి. కానీ, ఉదయం నుంచి సాయంత్రం వరకు వర్షం పడటంతో మ్యాచ్ రద్దు చేస్తున్నట్టు మ్యాచ్ రిఫరీలు ప్రకటించారు. రిజర్వ్ డే లేకపోవడంతో రన్ రేట్ ఆధారంగా పాకిస్తాన్ జట్టును చాంపియ‌న్ గా ప్రకటించారు. దీంతో అవార్డు ప్ర‌ధానోత్స‌వ కార్య‌క్ర‌మాన్ని టీమిండియా వాకౌట్ చేసింది. ట్రోఫీ విజేత‌గా రెండు జ‌ట్ల‌ను ప్ర‌క‌టించ‌కుండా పాకిస్తాన్ కు ఏక ప‌క్షంగా టైటిల్ ఇచ్చార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తోంది.

Months After Mustafizur Rahman Controversy, 7 Bangladesh Players Register For IPL 2027 Auctionఐపీఎల్‌లోకి బంగ్లాదేశ్ క్రికెటర్లు రీ-ఎంట్రీ…బీసీసీఐ పెద్దలను తరిమికొట్టాలంటూ ట్రోలింగ్ ? 

Related News

పొర‌పాటున ధోని జెర్సీపై ఆటోగ్రాఫ్…డ్రెస్సింగ్ రూంలో కూర్చొని గంభీర్ ర‌చ్చ‌

SRH ఓన‌ర్ కావ్య పాప పెళ్లి…వాళ్లంద‌రికీ ఖ‌రీదైన‌ గోల్డ్ రింగులు!

10 కిలోలు త‌గ్గితేనే టీమిండియాలోకి తీసుకుంటామ‌ని గంభీర్ టార్చ‌ర్ పెట్టాడు!

ఇండియాను ఎగ‌తాళి చేస్తూ పాకిస్తాన్ అంధుల క్రికెట‌ర్ల సెల‌బ్రేష‌న్స్‌..హరీస్ రౌఫ్ ను మించిపోయేలా

కంటిచూపు లేకపోయినా ఫైనల్‌లో టీమిండియాను ఓడించారు.. ఒక్కొక్కరికి కోటి రూపాయలు ఇవ్వాల్సిందే

బలహీన నేపాల్‌ను ఓడించి సంబర పడిపోకండి.. నవంబర్ 22న నరకం చూపిస్తాం

అంధుల ఆసియా కప్ ఫైనల్‌లో WBCC ఛీటింగ్…టైటిల్ విజేతగా పాకిస్తాన్, బాయ్‌కాట్ చేసిన టీమిండియా

Big Stories

Advertisement
×