Aamir Khan:బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కండల వీరుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు అమీర్ ఖాన్ (Aamir Khan). బాలీవుడ్ ను మొదలుకొని టాలీవుడ్ వరకు పలు చిత్రాలలో హీరోగా నటించడమే కాకుండా గెస్ట్ అప్పియరెన్స్ ఇస్తూ కూడా ప్రేక్షకులను అలరిస్తున్నారు. అంతేకాదు బిగ్ బాస్ హిందీ సీజన్లకు హోస్ట్ గా కూడా వ్యవహరిస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హోస్ట్ గా మరింత బిజీగా మారిన ఈయన.. ఆదాయం కూడా అంతే స్థాయిలో ఉంది అని చెప్పాలి భారీ స్థాయిలో భూములపై పెట్టుబడులు పెట్టిన అమీర్ ఖాన్ .. అటు అద్దెల రూపంలో నెలకు భారీగా అందుకుంటున్నారని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. మరి అమీర్ ఖాన్ నెలకు అద్దెల రూపంలో ఎంత అందుకుంటున్నారు? ఆయన ఫ్లాట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి? అనే విషయాలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.
ఈ మేరకు బాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం అందుతున్న సమాచారాన్ని బట్టి చూస్తే అమీర్ ఖాన్ కి కేవలం అద్దెల ద్వారా అని ఏకంగా కోటి రూపాయల వరకు వస్తాయట. ముంబైలోని శాంతా క్రూజ్ సబర్బన్ ఏరియాలో సుమారుగా మూడు విలాసవంతమైన ప్రాపర్టీలు ఉన్నాయి. వీటి ద్వారా నెలకు 45 లక్షల రూపాయలు అద్దె వస్తుంది. అలాగే ఏడాదికి ఐదు శాతం పెంచే రూల్ కూడా అగ్రిమెంట్లో ఉండడం గమనార్హం. అంతేకాదు అదే ముంబైలోని అత్యంత ఖరీదైన ప్రాంతాలలో ఒకటైన పాలి హిల్ లో ఏకంగా నాలుగు అపార్ట్మెంట్లు కలిగి ఉన్నారని, వీటి ద్వారా నెలకు సుమారుగా రూ.30 లక్షల వరకు రెంట్ వస్తుందని సమాచారం.
ఈ రెంటల్ డిపాజిట్ కింద ఇప్పటికే కోటి 46 లక్షల రూపాయల వరకు తీసుకున్నారట అమీర్ ఖాన్. అంతేకాదు రియల్ ఎస్టేట్ వ్యాపారంపై ముందుచూపు ఉన్న అమీర్ ఖాన్ ముంబైలోని విర్గో కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ, విల్నో మోనా అపార్ట్మెంట్స్, మెరీనా అపార్ట్మెంట్, హిల్ వ్యూ లో కూడా అమీర్ ఖాన్ కి ఫ్లాట్లు ఉండగా.. వీటిని కూడా ఆయన అద్దెకి ఇచ్చారట. ఇలా కేవలం అద్దెల రూపంలోనే ఆయనకు సుమారుగా కోటి రూపాయల వరకు వస్తోందని సమాచారం. అయితే ఇవన్నీ ఆయన సొంత ఆస్తులే కావడం గమనార్హం
ALSO READ:కావ్య-అనిరుధ్ పెళ్లి.. ఉద్యోగులకు స్పెషల్ సర్ప్రైజ్?వీడియో వైరల్!
ఇకపోతే తాను ఉండే సొంత ఇల్లు, ప్రొడక్షన్ ఆఫీస్ తో పాటు మహారాష్ట్రలోని ప్రముఖ హిల్ స్టేషన్ పంచగనిలో మరో రెండు ఎకరాల పెద్ద ఫామ్ హౌస్ కూడా ఉందట. వీటి విలువ సుమారుగా రూ.10 కోట్లకి పైగా ఉంటుందని సమాచారం. ఇలా అమీర్ ఖాన్ తన ఆస్తి మొత్తాన్ని ఫ్లాట్స్ రూపంలో పెట్టుబడులు పెట్టి వాటి ద్వారా ఇప్పుడు మరింత ఆదాయాన్ని అందుకుంటున్నారు. ఏది ఏమైనా అమీర్ ఖాన్ ముందు చూపుకి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు.