E-Paper
Advertisement

కాంగ్రెస్‌లో ప్రజాస్వామ్యం ఎక్కువైంది.. ఆ ఇద్దరు ఎమ్మెల్యేల వ్యాఖ్యలపై అధిష్టానం సీరియస్ ఫోకస్!

కాంగ్రెస్‌లో ప్రజాస్వామ్యం ఎక్కువైంది.. ఆ ఇద్దరు ఎమ్మెల్యేల వ్యాఖ్యలపై అధిష్టానం సీరియస్ ఫోకస్!
Advertisement

Mahesh Kumar Goud: తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఎటు చూసినా సొంత పార్టీ నేతల వ్యాఖ్యలు, ప్రతిపక్షాల విమర్శల చుట్టే చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో నిజామాబాద్ పర్యటనకు వెళ్లిన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. పలు కీలక అంశాలపై స్పష్టతనిచ్చారు. పార్టీ అంతర్గత వ్యవహారాల నుంచి జల వివాదాలు, కేటీఆర్ విమర్శల వరకు ఆయన తనదైన శైలిలో సమాధానమిచ్చారు.

పార్టీలో ప్రజాస్వామ్యం కాస్త ఎక్కువైంది!

Advertisement

ఇటీవల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీలో కాస్త కలకలం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై మహేష్ గౌడ్ స్పందిస్తూ.. కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం కాస్త ఎక్కువైందని చమత్కరించారు. అయితే, వారి వ్యాఖ్యలను ఏఐసీసీ పరిశీలిస్తోందన్నారు. క్రమశిక్షణ విషయంలో అధిష్టానం సరైన సమయంలో తగిన నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. గతంలో కొండా సురేఖ విషయంలోనూ మొదటిసారే చర్యలు తీసుకోలేదు. రెండు మూడు సార్లు పరిస్థితిని గమనించిన తర్వాతే అధిష్టానం స్పందించిందని గుర్తు చేశారు.

నీటి వాటాలో ఒక్క బొట్టు కూడా వదులుకోం

Advertisement

ఏపీ జల దోపిడీ ఆరోపణలు, నీటి పంపకాలపై వస్తున్న విమర్శలకు మహేష్ కుమార్ సీరియస్ అయ్యారు. తెలంగాణ నీటి వాటా విషయంలో ఒక్క బొట్టును కూడా వదులుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. జలాల విషయంలో ఎవరితోనూ రాజీ పడాల్సిన అవసరం తమకు లేదన్నారు. తెలంగాణ ప్రజలకు నమ్మకద్రోహం చేసే పని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నటికీ చేయదని భరోసా ఇచ్చారు.

కేటీఆర్ ఆరోపణలకు స్ట్రాంగ్ కౌంటర్

కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి మూటలు పంపుతున్నారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేస్తున్న ఆరోపణలపై మహేష్ గౌడ్ తీవ్రంగా మండిపడ్డారు. ఫార్ములా-ఈ కారు రేసు, కాళేశ్వరం ప్రాజెక్టు, భూ కుంభకోణాల్లో అడ్డంగా దొరికిన అవినీతిపరులు కూడా తమపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ఢిల్లీకి మూటలు పంపాల్సిన అవసరం తమకు లేదని.. రాహుల్ గాంధీ ఎంతో సంపన్న కుటుంబంలో పుట్టారని అన్నారు. రాహుల్ గాంధీపై విమర్శలు చేసే ముందు ఆయన కుటుంబ త్యాగాల చరిత్రను ఒకసారి తెలుసుకోవాలని కేటీఆర్‌కు హితవు పలికారు.

Also Read: బిర్యానీ ప్రియులకు షాక్.. మాదాపూర్ బావర్చి, మెహఫిల్ సహా పలు రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ కొరడా!

Tags

Related News

బిర్యానీ ప్రియులకు షాక్.. మాదాపూర్ బావర్చి, మెహఫిల్ సహా పలు రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ కొరడా!

తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్.. ఇంటింటికీ రూ.300లకే టీ-ఫైబర్ ఇంటర్‌నెట్!

తెలంగాణ పట్టణాలకు మహర్దశ.. రూ.20 వేల కోట్లతో సీఎం రేవంత్ భారీ ప్లాన్!

హైదరాబాద్‌ సిటీలో ఆ ప్రాంతాలకు బిగ్ అలర్ట్.. రాత్రి నుండి 24 గంటలు నీటి సరఫరా బంద్

హెచ్‌సీయూలో ఫుడ్ పాయిజన్.. 30 మందికి పైగా విద్యార్థులకు అస్వస్థత

ప్రగతినగర్ వాసులకు గుడ్ న్యూస్.. అంబీర్ చెరువు పనులు షురూ!

సాగర్‌ వివాదంలో అసలు దోషులెవరు? అధికారులదా.. ప్రభుత్వానిదా?

Big Stories

Advertisement
×