E-Paper
Advertisement

జుట్టు ఎక్కువగా రాలుతోందా..ఈ విటమిన్ లోపంతో బట్టతల ముప్పు!

జుట్టు ఎక్కువగా రాలుతోందా..ఈ విటమిన్ లోపంతో బట్టతల ముప్పు!
Advertisement

Sudden hair fall reasons: జుట్టు రాలడం మొదలవగానే మనందరం చేసే..మొదటి పని షాంపూ మార్చడం లేదా కొత్త హెయిర్ ఆయిల్ ట్రై చేయడం. రీల్స్, సోషల్ మీడియాలో చూసి.. రకరకాల ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటాం. కానీ బయట నుంచి మనం రాసే ఆయిల్స్, షాంపూలు జుట్టు పైభాగాన్ని మాత్రమే క్లీన్ చేస్తాయి లేదా కాస్త సాఫ్ట్‌గా ఉంచుతాయి. జుట్టు ఆరోగ్యంగా పెరగాలంటే.. కుదుళ్లకు లోపలి నుంచి పోషణ అందాలి. మన డైట్‌లో.. పోషకాలు తగ్గితే, ఎంత ఖరీదైన షాంపూ వాడినా హెయిర్ ఫాల్ కంట్రోల్ అవడం కష్టమే.

విటమిన్ లోపం వల్ల బట్టతల:

హెయిర్ గ్రోత్ విషయంలో విటమిన్ D, విటమిన్ B12 (అలాగే బయోటిన్, ఐరన్) చాలా కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా విటమిన్ D లోపం ఉన్నప్పుడు కొత్త జుట్టు కుదుళ్లు ఏర్పడటం తగ్గిపోయి, ఉన్న జుట్టు కూడా ఎక్కువగా రాలిపోతుంది. ఆఫీస్ వర్క్, ఇండోర్ లైఫ్‌ స్టైల్ వల్ల ఎండ తగలకపోవడం ఈ రోజుల్లో విటమిన్ D లోపానికి పెద్ద కారణంగా మారింది. అలాగే విటమిన్ B12 లోపిస్తే రక్తప్రసరణ, ఆక్సిజన్ సరఫరా సరిగ్గా లేక జుట్టు పలుచబడి, కాలక్రమేణా బట్టతల లక్షణాలు కనిపించే అవకాశం ఉంటుంది.

లైఫ్‌స్టైల్,స్ట్రెస్ :

Advertisement

ప్రస్తుతం నిద్ర లేమి, అధిక స్ట్రెస్, జంక్ ఫుడ్ అలవాట్లు హెయిర్ హెల్త్.. మీద డైరెక్ట్ ఎఫెక్ట్ చూపిస్తున్నాయి.స్ట్రెస్ ఎక్కువగా ఉన్నప్పుడు శరీరంలో.. హార్మోన్ల మార్పులు జరిగి, జుట్టు రాలే వేగం పెరుగుతుంది. దానికి తోడు.. సరైన టైమ్‌కి భోజనం చేయక పోవడం, ప్రోటీన్, విటమిన్స్ తక్కువగా తీసుకోవడం వల్ల కుదుళ్లు వీక్ అవుతాయి. జుట్టు రాలడానికి ఒక్క కారణం అనే కంటే.. లోపలి పోషక లోపం ప్లస్ బయటి లైఫ్‌ స్టైల్ కలిసి సమస్యను పెద్దది చేస్తాయి.

డైట్‌లో ఎలాంటి మార్పులు చేసుకోవాలి?

జుట్టు రాలడాన్ని.. నేచురల్‌గా ఆపాలంటే.. ముందుగా ప్లేట్‌లో ఉండే ఫుడ్‌ని మార్చాలి. ప్రోటీన్ కోసం గుడ్లు, పప్పులు, గింజలు,చేపలు లేదా చికెన్ వంటివి డైట్‌లో.. చేర్చుకోవాలి. విటమిన్ D కోసం ఉదయం పూట కాస్త ఎండలో నిలబడటం మంచిది. అవసరమైతే డాక్టర్ సలహాతో.. బ్లడ్ టెస్ట్ చేయించుకుని సప్లిమెంట్స్ గురించి తెలుసుకోవచ్చు. ఆకు కూరలు, క్యారెట్, నట్స్, సీడ్స్, పండ్లు రెగ్యులర్‌గా తీసుకుంటే..జుట్టుకు అవసరమైన విటమిన్స్, మినరల్స్ అందుతాయి.

Advertisement

Also Read: చదువుకోవాలంటే బోర్.. ఈ తేదీల్లో పుట్టిన పిల్లలకు అల్లరి, ఆటపాటలంటేనే ఇష్టం

హెయిర్ కేర్‌:

పోషకాహారంతో పాటు కొన్ని చిట్కాలు కూడా పాటిస్తే.. జుట్టు రాలడం తగ్గుతుంది. తడి జుట్టును గట్టిగా తుడవటం లేదా వెంటనే దువ్వడం చేయకూడదు. స్కాల్ప్‌ని  సున్నితంగా మసాజ్ చేయాలి. హీట్ స్టైలింగ్ టూల్స్, కెమికల్స్ ఎక్కువగా ఉండే ప్రొడక్ట్స్‌ని వీలైనంత తగ్గించడం మంచిది. నీళ్లు తగినంత తాగడం, కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోవడం కూడా జుట్టు ఆరోగ్యానికి ఎంతో అవసరం.

ఇలా..15 రోజులుగా జుట్టు విపరీతంగా రాలిపోతూనే ఉంటే, లేదా తలపై ఖాళీ ప్యాచెస్ కనిపిస్తే నిర్లక్ష్యం చేయకూడదు. డెర్మటాలజిస్ట్‌ని కలిసి అసలు కారణం ఏంటో తెలుసుకోవడం బెస్ట్. విటమిన్ లోపమా, థైరాయిడ్ లేదా హార్మోన్ సమస్యలా అనేది టెస్ట్ ద్వారా క్లారిటీ వస్తుంది. సకాలంలో ..సరైన ట్రీట్‌మెంట్ తీసుకుంటే ..జుట్టు రాలడాన్ని ఆపి, తిరిగి ఆరోగ్యంగా ఉండేలా.. చూసుకోవచ్చు. షాంపూల మీద మాత్రమే ఆధారపడకుండా.. లోపలి ఆరోగ్యాన్ని కూడా కేర్ చేస్తే హెయిర్ ఫాల్‌కి చెక్ పెట్టొచ్చు!

Related News

పనీర్ కర్రీ చేసేటప్పుడు ఈ ఒక్క పొడి వేసి చూడండి.. వీధి చివరి దాకా ఘుమఘుమలే!

కారం కారంగా, నోట్లో నీళ్లూరించే ఉల్లికారం కోడిగుడ్డు వేపుడు.. ప్లేట్లో ఒక్క ముద్ద కూడా మిగలదు!

ఆదివారం ఇల్లు మొత్తం ఘుమఘుమలాడిపోవాలంటే.. ఈ టేస్టీ కాజు చికెన్ ఫ్రై చేసుకోవాల్సిందే!

నానబెట్టే పని లేకుండా ఇన్‌స్టంట్ రాగి అట్టు..ఇలా చేస్తే అదిరిపోయే రుచి

మటన్ కీమా మసాలా..వీకెండ్ స్పెషల్‌కి పర్ఫెక్ట్ రెసిపీ!

ఉదయం ఆఫీసుకు రెడీ అయ్యేందుకు టైమ్ సరిపోవడం లేదా? వర్కింగ్ ఉమెన్స్ కోసం టిప్స్

కరకరలాడే అలసంద వడలు..సాయంత్రం స్నాక్‌కి పర్ఫెక్ట్!

Big Stories

Advertisement
×