Face Acne Reasons: ముఖంపై మొటిమలు ఒక సాధారణ చర్మ సమస్య. అన్ని వయస్సుల వారు ఈ సమస్యను ఎదుర్కుంటూనే ఉంటారు. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. కానీ కొన్ని రకాల టిప్స్ పాటించడం ద్వారా ఈజీగా ఈ సమస్య నుండి బయట పడవచ్చు. మరి ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
1. హార్మోన్ల మార్పులు:
మొటిమలకు అతి సాధారణ కారణం హార్మోన్ల అసమతుల్యత. యుక్తవయస్సులో.. శరీరంలో ఆండ్రోజెన్ హార్మోన్ల స్థాయిలు పెరగడం వల్ల సెబాషియస్ గ్రంథులు అధికంగా సెబమ్ ఉత్పత్తి చేస్తాయి. ఈ అధిక సెబమ్ చర్మ రంధ్రాలను అడ్డుకుంటుంది. దీనివల్ల మొటిమలు ఏర్పడతాయి. యుక్తవయస్సు మాత్రమే కాకుండా.. పీరియడ్స్, గర్భం, గర్భనిరోధక మాత్రల వాడకం, లేదా పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) వంటి పరిస్థితులు కూడా హార్మోన్ల మార్పులను కలిగిస్తాయి. ఇవి మొటిమలకు దారితీస్తాయి.
2. అధిక నూనె ఉత్పత్తి:
చర్మంలోని సెబాషియస్ గ్రంథులు అధిక నూనెను ఉత్పత్తి చేసినప్పుడు, ఆ నూనె మృత కణాలతో కలిసి రంధ్రాలను మూసుకుపోతుంది. ఈ పరిస్థితి బ్యాక్టీరియా పెరుగుదలకు అనుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది. అంతే కాకుండా దీనివల్ల వాపు, మొటిమల వంటివి కూడా ఏర్పడతాయి. ఆయిల్ స్కిన్ ఉన్నవారిలో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంటుంది.
3. బ్యాక్టీరియా సంక్రమణ:
చర్మంపై సహజంగా ఉండే బ్యాక్టీరియా, చర్మ రంధ్రాలలో పెరిగినప్పుడు మొటిమలను కలిగిస్తుంది. ఈ బ్యాక్టీరియా సెబమ్‌ను ఆహారంగా ఉపయోగించుకుని చర్మంపై వాపును కలిగిస్తుంది. ఇది ముఖంపై ఎరుపు, నొప్పి లేదా చీముతో కూడిన మొటిమలకు దారితీస్తుంది.
4. మృత కణాలు:
చర్మం నిరంతరం కొత్త కణాలను ఉత్పత్తి చేస్తుంది. అంతే కాకుండా పాత కణాలు కూడా చనిపోతాయి. ఈ మృత కణాలు సరిగ్గా తొలగించబడకపోతే.. అవి సెబమ్‌తో కలిసి చర్మ రంధ్రాలను అడ్డుకుంటాయి. ఇది బ్లాక్‌హెడ్స్, వైట్‌హెడ్స్ లేదా వివిధ రకాల మొటిమలకు కారణమవుతుంది.
5. ఆహారపు అలవాట్లు:
కొన్ని రకాల ఆహార పదార్థాలు మొటిమల సమస్యను తీవ్రతరం చేస్తాయి. అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాలు, పాల ఉత్పత్తులు హార్మోన్ల స్థాయిలను ప్రభావితం చేసి మొటిమలకు దారితీస్తాయి. అధిక కొవ్వు లేదా నూనెతో కూడిన ఆహారాలు కూడా కొందరిలో చర్మ సమస్యలను పెంచుతాయి.
6. ఒత్తిడి:
ఒత్తిడి నేరుగా మొటిమలకు కారణం కాకపోయినా.. అది హార్మోన్ల అసమతుల్యతను ప్రేరేపిస్తుంది. సెబమ్ ఉత్పత్తిని పెంచుతుంది. ఒత్తిడి సమయంలో కార్టిసాల్ హార్మోన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఇది చర్మంలో నూనె ఉత్పత్తిని పెంచి మొటిమలను తీవ్రతరం చేస్తుంది.
Also Read: ఈ ఆయిల్ వాడితే.. 30 రోజుల్లోనే పొడవాటి జుట్టు మీ సొంతం
7. జన్యుపరమైన కారణాలు:
మొటిమల సమస్య కొంత మందిలో జన్యుపరంగా కూడా వస్తుంది. తల్లిదండ్రులు లేదా కుటుంబ సభ్యులకు మొటిమల సమస్య ఉంటే.. ఆ మీకు కూడా ఈ సమస్య వచ్చే అవకాశం ఎక్కువ.
8. పర్యావరణ కారకాలు:
కాలుష్యం, తేమ, ధూళి, లేదా అధిక చెమట వంటి పర్యావరణ కారకాలు కూడా మొటిమలకు కారణమవుతాయి. కాలుష్యం చర్మ రంధ్రాలలో ధూళిని చేర్చుతుంది. అంతే కాకుండా అధిక తేమ చర్మంపై బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.