Fenugreek Seeds For Hair: ఈ రోజుల్లో జుట్టు రాలడం అన్ని వయస్సుల వారికి ఒక ప్రధాన సమస్యగా మారింది. మారుతున్న ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, కాలుష్యం, రసాయనాలతో తయారు చేసిన హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ ఇందుకు ప్రధాన కారణాలు. మీరు కూడా ఇలాంటి జుట్టు సంబంధిత సమస్యతో బాధపడుతుంటే.. హోం రెమెడీస్ మీకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.
జుట్టు పెరగడానికి మెంతులు చాలా బాగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా కొబ్బరి నూనెలో మెంతులు కలిపి వాడటం వల్ల కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. ఇది జుట్టు రాలడాన్ని ఆపడమే కాకుండా జుట్టును బలంగా.. మందంగా, సేలా చేస్తుంది.
కొబ్బరి నూనె, మెంతులు ఎందుకు ప్రత్యేకమైనవి ?
కొబ్బరి నూనె జుట్టు పెరుగుదలకు చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతే కాకుండా దీనిలో ఉండే కొవ్వు ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్లు తలకు పోషణనిచ్చి జుట్టు రాలడాన్ని నివారిస్తాయి. మరోవైపు.. మెంతి గింజలలో జుట్టు పెరుగుదలను ప్రోత్సహించే ప్రోటీన్, ఐరన్, విటమిన్లు ఉంటాయి.
మెంతుల్లో ఉండే నికోటినిక్ ఆమ్లం తలలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా ఇది జుట్టు మూలాలను బలపరుస్తుంది. ఈ రెండు పదార్థాలను కలిపి ఆయిల్ తయారు చేసినప్పుడు.. అది సహజమైన హెయిర్ టానిక్‌గా పనిచేస్తుంది. అంతే కాకుండా ఇది అనేక జుట్టు సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.
హెయిర్ ఆయిల్ ఎలా తయారు చేయాలి ?
ఈ హోం రెమెడీ తయారు చేయడం చాలా సులభం. ఒక పాన్‌లో ఒక కప్పు కొబ్బరి నూనె తీసుకుని, అందులో రెండు చెంచాల మెంతులు వేయండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని 10 నుండి 15 నిమిషాలు తక్కువ మంట మీద ఉడికించాలి. నూనె బాగా మరిగించకూడదని గుర్తుంచుకోండి. మెంతులు లేత గోధుమ రంగులోకి మారి క్రిస్పీగా మారాలి.
నూనె నుండి కాస్త సువాసన రావడం ప్రారంభించినప్పుడు.. గ్యాస్ ఆపివేసి, నూనెను చల్లారనివ్వండి. తరువాత దానిని ఫిల్టర్ చేసి గాజు సీసాలో నింపండి. మీరు ఈ నూనెను 2-3 వారాల పాటు నిల్వ చేసి కూడా ఉపయోగించవచ్చు.
Also Read: ఆవ నూనెలో ఈ ఒక్కటి కలిపి వాడితే.. జుట్టు వద్దన్నా పెరుగుతుంది తెలుసా ?
నూనె ఎలా రాయాలి ? దాని ప్రయోజనాలు ఏమిటి ?
ఈ నూనెను అప్లై చేయడానికి రాత్రి సమయం చాలా ఉత్తమం. పడుకునే ముందు.. నూనెను కొద్దిగా వేడి చేసి మీ వేళ్ల సహాయంతో తలకు సున్నితంగా మసాజ్ చేయండి. మసాజ్ చేస్తున్నప్పుడు.. నూనె కుదుళ్లకు చేరేలా చూసుకోండి. ఇది తలలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా ఇది జుట్టుకు పోషణ అందించి నేరుగా జుట్టు మూలాలకు చేరుతుంది.
రాత్రంతా ఈ నూనెను అలాగే ఉంచి.. ఉదయం షాంపూతో వాష్ చేయండి. ఈ నూనెను వారానికి రెండు నుండి మూడు సార్లు ఉపయోగించడం ద్వారా మీరు మంచి ఫలితాలను పొందుతారు. ఈ నూనెను వాడటం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. అంతే కాకుండా ఇది జుట్టు పెరుగుదలకు ఉపయోగపడుతుంది. చుండ్రు సమస్యను కూడా తొలగిస్తుంది. అంతే కాకుండా తలపై చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.