Namrata Shirodkar Sister: కరోనా మళ్లీ కలవరపెడుతోంది. 2020, 2021ల కాలపు భయాందోళనలు చెరిగిపోతున్నాయనుకున్న వేళ, ఆ వైరస్ మళ్లీ పునరాగమనం చేస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. హాంకాంగ్, సింగపూర్, చైనా, థాయిలాండ్ వంటి దేశాల్లో కోవిడ్ కేసులు భారీగా నమోదవుతుండటంతో, భారత్‌లోనూ కేసుల సంఖ్య పెరుగుతుండడం తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది.
ఈ పరిణామాల నేపథ్యంలో, ఐపీఎల్ 2025 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ ప్లేయర్ ట్రావిస్ హెడ్ కరోనా పాజిటివ్‌గా తేలడంతో సీజన్‌కు దూరమవుతున్నట్టు నివేదికలు వచ్చాయి. ఇక, టాలీవుడ్ హీరో మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ సోదరి శిల్పా శిరోద్కర్ కూడా కరోనా వైరస్ బారిన పడ్డారు. బాలీవుడ్ నటిగా గుర్తింపు పొందిన శిల్పా శిరోద్కర్ కూడా వైరస్ బారిన పడడంతో బాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
శిల్పా శిరోద్కర్ సందేశం ఇదే..
ప్రజలారా.. నాకు కోవిడ్ పాజిటివ్ అని తేలింది. సురక్షితంగా ఉండండి, మీరు మాస్క్‌లు ధరించండి అంటూ శిల్పా శిరోద్కర్ ట్వీట్ చేశారు. పలువురు హిందీ ప్రేక్షకులను అలరించిన శిల్పా ఇటీవలే బిగ్ బాస్ 18 ద్వారా మళ్లీ పాపులర్ అయ్యారు. షో తర్వాత అనేక యాడ్స్, ఫోటోషూట్లు, వెబ్‌ప్రాజెక్టులతో బిజీగా ఉన్న శిల్పా ఈ వైరస్ బారిన పడటం సినీ పరిశ్రమలో కంగారుకు దారితీసింది.
వ్యాక్సినేషన్ రికార్డ్ ఈమెదే..
కోవిడ్-19 వ్యాక్సినేషన్ పొందిన మొట్టమొదటి భారతీయ చిత్ర పరిశ్రమ నటిగా శిల్పా శిరోద్కర్ నిలిచారు. కానీ ప్రస్తుతం మళ్లీ కోవిడ్ లక్షణాలు బయటపడుతున్న వేళ, ఈమెకు కోవిడ్ లక్షణాలు కనిపించడం వింతగా బాలీవుడ్ చిత్ర పరిశ్రమ అంటోంది.
హిందీ టెలివిజన్ పరిశ్రమ ఇప్పటికే అలెర్ట్ అయింది. షూటింగ్ సెట్లు, స్టూడియోల్లో మళ్లీ మాస్కులు, థర్మల్ స్క్రీనింగ్, శానిటైజేషన్ వంటివి తప్పనిసరి చేయాలని నిర్ణయం తీసుకుంటున్నారు. ఎందుకంటే ఈ రంగం మళ్ళీ ఒకసారి ఆగిపోతే దాని ప్రభావం వందల మందిపై పడుతుందని చెప్పవచ్చు.
Also Read: AP Govt New Scheme: ఏపీలో మరో స్కీమ్.. మహిళలకు ఇక ఆ భారం లేనట్లే!
పెరుగుతున్న కేసులు..
ఆసియా ఖండంలోని అనేక దేశాల్లో ప్రస్తుతం కోవిడ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. సింగపూర్లో రోజువారీ కేసులు రెండు వేల దాటాయి. చైనాలోని పెద్ద నగరాల్లో కొన్ని ప్రాంతాల్లో మళ్లీ లాక్‌డౌన్ దిశగా చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. థాయిలాండ్, హాంకాంగ్ ఆస్పత్రుల్లో కరోనా దెబ్బకు బెడ్లు నిండిపోతున్నాయన్న సమాచారం వస్తోంది. దీనితో భారత్ లో ముందస్తు జాగ్రత్తలు పాటించకపోతే ఇబ్బందులు తప్పవని వైద్యులు సూచిస్తున్నారు.
కొత్త వేరియంట్‌లపై ఎన్నో అనుమానాలు..
ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న వైరస్ స్ట్రెయిన్ గురించి పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. కానీ ఇది ఓమిక్రాన్ అనుబంధ వేరియంట్లలో ఒకటిగా భావిస్తున్నారు. ఈ స్ట్రెయిన్ ఎక్కువ వేగంగా వ్యాపిస్తోందన్న అభిప్రాయం ఉన్నా, తీవ్రమైన లక్షణాలు తక్కువగానే ఉన్నట్టు వైద్య నిపుణుల అభిప్రాయం.
మళ్లీ మాస్క్‌లు, శానిటైజర్‌లు అవసరమే..
ప్రభుత్వాలు ఇంకా అధికారికంగా ఆంక్షలు విధించకపోయినా, ప్రజలుగా మళ్లీ జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయం వచ్చిందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌లు ధరించడం, హ్యాండ్ శానిటైజర్ వినియోగం, హైజిన్ పాటించడం కీలకంగా మారాయి.