 
					OTT Movie : సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ లవర్స్ ను ఇష్టపడే వాళ్లకు ఒక అదిరిపోయే సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా ఒక హాలిడే ట్రిప్ లో రెండు జంటల మధ్య తిరుగుతుంది. రొమాన్స్, థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో ఈ స్టోరీ ఆడియన్స్ కి పిచ్చెక్కిస్తుంది. ఒక్క సారి చూడటం స్టార్ట్ చేశాక, ఇక చూపు తిప్పుకోవడం ఉండదు. అంత ఎంగేజింగ్ గా ఈ కథ ఉంటుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో ఉంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..
‘స్పీక్ నో ఈవిల్’ (Speak No Evil) అనేది 2024లో విడుదలైన అమెరికన్ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ సినిమా. బ్లూమ్‌హౌస్ ప్రొడక్షన్స్, యూనివర్సల్ పిక్చర్స్ బ్యానర్‌లో డైరెక్టర్ జేమ్స్ వాట్కిన్స్ దీనిని రూపొందించారు. ఈ సినిమా 2024 సెప్టెంబర్ 13న థియేటర్లలో రిలీజ్ అవ్వగా, $15 మిలియన్ బడ్జెట్‌తో వరల్డ్‌వైడ్ $78 మిలియన్ లు కలెక్ట్ చేసింది. 2024 అక్టోబర్ 31 పీకాక్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. 1 గంట 50 నిమిషాల రన్ టైమ్ తో ఐయండిబిలో 6.8/10 రేటింగ్ పొందింది.
అమెరికా నుండి బెన్, లూయిస్, వాళ్ల కూతురు ఆగ్నెస్ ఇటలీలో హాలిడే ట్రిప్ కి వస్తారు. అక్కడ బ్రిటిష్ ఫ్యామిలీ అయినటువంటి ప్యాడీ , ఐస్లింగ్, వాళ్ల మూగ కొడుకు ఆంట్ తో వీళ్ళకు పరిచయం అవుతుంది. ప్యాడీ చాలా సరదాగా, వాళ్ళకి ఆతిథ్యం ఇస్తాడు. హాలిడే అందరూ కలసి ఎంజాయ్ చేస్తారు. ఇక ఈ ట్రిప్ ముగిసిన తర్వాత ప్యాడీ వాళ్లను తమ ఇంగ్లండ్ విలేజ్ లో ఉండే ఫామ్‌హౌస్‌కు వీకెండ్‌కి ఆహ్వానిస్తాడు. మొదట మొహమాట పడినా, ఆ తరువాత బెన్ ఫ్యామిలీ సంతోషంగా వెళ్తుంది. అక్కడికి వెళ్ళాక మొదట అంతా బాగుంటుంది. డిన్నర్, డాన్స్ లతో ఎంజాయ్ చేస్తారు. ఆ తరువాత ప్యాడీ మాటల్లో తేడా వస్తుంది. అతని ప్రవర్తన కూడా అసభ్యంగా ఉంటుంది. లూయిస్‌కు ఇది ఇబ్బందిగా అనిపిస్తుంది.
Read Also : ఓటీటీలోకి ‘ది అప్రెంటిస్’… డోనాల్డ్ ట్రంప్ వివాదాస్పద బయోపిక్ ను ఏ ఓటీటీలో చూడాలంటే?
కానీ బెన్ మనం అతిథులం కదా సర్దుకోవాలి అని మౌనంగా ఉంటాడు. ఒక రాత్రి ఆంట్ ఏడుస్తూ ఆగ్నెస్ గదికి వచ్చి, తన నాలుక లేదని సైగతో చూపిస్తాడు. లూయిస్ భయపడుతుంది. ఆ రోజు రాత్రి సెల్లార్ లో ప్యాడీ అసలు రహస్యం తెలిసిపోతుంది. వాళ్ళు సైకో కిల్లర్స్. ఇప్పుడు వున్న మూగ పిల్లాడు వాళ్ళ కొడుకు కాదు. గతంలో జంటను ఇలాగే ఇంటికి ఆహ్వానించి చంపేసి ఉంటారు. నిజం బయటికి పోకూడదని, ఒక ఫ్యామిలీలా చెలామణి కావడానికి ఆపిల్లాడి నాలుకను కత్తరించి ఉంటారు. ఇది తెలిసి మరుసటి రోజు బెన్ ఫ్యామిలీ వెళ్లిపోవాలనుకుంటుంది. కానీ భయంకరమైన ఛేజ్, ఫైట్ జరుగుతుంది. చివరికి బెన్ ఫ్యామిలీ బతికి బయటపడుతుందా ? ప్యాడీ చేతిలో బలైపోతుందా ? అనేది ఈ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ సినిమాని చూసి తెలుసుకోండి.