 
					Saudi Crime: జార్ఖండ్‌కు చెందిన ఒక వ్యక్తి ఇటీవల సౌదీలో ఓ ఎన్‌కౌంటర్లో మృతి చెందిన సంగతి తెలిసిందే. స్థానిక పోలీసులు, లోకల్ క్రిమినల్ గ్యాంగ్ మధ్య జరిగిన ఎన్‌కౌంటర్లో పొరపాటున బుల్లెట్ తగలడంతో ఆ వ్యక్తి గాయపడ్డాడు. ఆసుపత్రిలో వారం పాటు చికిత్స అందించినా ప్రయోజనం లేకుండా పోయింది. జార్ఖండ్ లోని గిరిద్ జిల్లాలోని ధూద్ పానియా గ్రామానికి చెందిన విజయ్ కుమార్ మహతో(27) ఉపాధి కోసం గతేడాది సౌధీ అరేబియాకు వెళ్లాడని, అక్కడి హ్యూంధాయి ఇంజినీరింగ్ కంపెనీలో పనిలో చేరాడని కుటుంబ సభ్యులు వెల్లడించారు.
మెహతో కజిన్ రామ్ ప్రసాద్ మాట్లాడుతూ.. “ఆక్టోబర్ 15న విజయ్ తన పని ప్రదేశంలో నడుస్తూ ఉండగా, పోలీసులు, క్రిమినల్స్ కు జరిగిన గన్ ఫైరింగ్ లో ఇరుకున్నాడు. పొరపాటునా బుల్లెట్ విజయ్ కు తగిలింది. వెంటనే పోలీసులు విజయ్ ను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆక్టోబర్ 24న విజయ్ మరిణించినట్లు మాకు సమాచారం అందింది. చనిపోయే ముందు, అతను తన భార్యకు కొర్త భాషలో ఒక వాయిస్ నోట్ కూడా పంపాడు. అందులో తనకు వేరొకరి కోసం ఉద్దేశించిన బుల్లెట్ తగిలిందని, సహాయం కోసం వేడుకుంటున్నానని చెప్పాడు” అని రామ్ ప్రసాద్ అన్నారు. విజయ్ కు భార్య, 5 మరియు 3 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు చిన్న కుమారులు, తల్లిదండ్రులు ఉన్నారు.
Read Also: Mumbai Hostage: 5 రోజుల ప్లానింగ్, 3 గంటల భయం, ఒక్క బుల్లెట్‌కు హతం.. ఇది కిడ్నాపర్ కథ!
రియాద్‌లోని భారత రాయబార కార్యాలయం నుండి జార్ఖండ్ ప్రభుత్వానికి అందిన అధికారిక సమాచారం ప్రకారం, ఈ సంఘటన జెడ్డా ప్రాంతంలో జరిగింది. ఇది జెడ్డాలోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా (CGI) అధికార పరిధిలోకి వస్తుంది. ఈ మరణాన్ని అనుమానాస్పదంగా పరిగణిస్తున్నామని, దర్యాప్తు పూర్తయ్యే వరకు, పోలీసు క్లియరెన్స్ సర్టిఫికేట్ జారీ అయ్యే వరకు మహతో మృతదేహం మక్కాలోని జుముమ్‌లోని పబ్లిక్ ప్రాసిక్యూషన్ కార్యాలయం ఆధీనంలో ఉంటుందని CGI తెలిపింది.
కంపెనీ పరిహారం చెల్లించడానికి అంగీకరించే వరకు మృతదేహాన్ని తిరిగి తీసుకురావడానికి అంగీకరించమని మహతో కుటుంబ సభ్యులు తెలిపారు. “కంపెనీ బాధ్యత వహించాలి. పరిహారం గురించి మాకు లిఖితపూర్వక హామీ లభించే వరకు మేము మృతదేహాన్ని స్వీకరించము” అని రామ్ ప్రసాద్ స్పష్టం చేశారు.