Mood swings: చిన్న విషయానికే పట్టరాని కోపం. అప్పుడే ఆనందం.. మరుక్షణమే బరించలేనంత బాధ. ఈ రకంగా ఎవరైనా ప్రవర్తిస్తే దాన్ని మూడ్ స్వింగ్స్ అంటారు. అసలు ఈ మూడ్ స్వింగ్స్ కొంత వరకు ఉంటే పర్వాలేదు. కానీ, కొంత మంది వింత వింతగా నడుచుకుంటారు. చిన్న విషయానికే చాలా ఆనంద పడిపోతారు. అవసరం లేకపోయిన కోపంతో ఊగిపోతారు. ఏం జరగకపోయినా ఏడ్చేస్తారు.
ఇలాంటి ప్రవర్తనను చాలా మంది మూడ్ స్వింగ్స్ అనే అనుకుంటారు. కానీ, దీనికి మానసిక రుగ్మతలు కూడా కారణం కావొచ్చని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. బైపోలార్ డిజార్డర్ వల్ల కూడా మనుషుల ప్రవర్తనలో చాలా మార్పులు వస్తాయని అంటున్నారు. ఎవరైనా విపరీతమైన మూడ్ స్వింగ్స్ చూపిస్తే వెంటనే థెరపిస్ట్‌కు చూచిస్తే మంచిదని సూచిస్తున్నారు.
గుర్తించడమెలా..?
ఇప్పటికే బైపోలార్ డిజార్డర్‌తో ఇబ్బంది పడుతున్న వారి ప్రవర్తనలో చాలా మార్పులు వస్తాయట. మాకిన్ బైపోలార్ డిజార్డర్ కండీషన్‌లో ఉన్న వారు విపరీతమైన ఉత్సాహాన్ని చూపిస్తారట. వీరు అన్ని విషయాలకు ఎక్కువగానే రియాక్ట్ అవుతారట. ఈ సమస్య ఉన్న వారు చిన్న విషయానికి కూడా చిరాకు, కోపం వంటివి చూపిస్తారట.
ALSO READ: బర్డ్ ఫ్లూ లక్షణాలు ఎలా ఉంటాయి..?
డిప్రెసివ్ బైపోలార్ డిజార్డర్ కండిషన్‌లో ఉన్న వారిలో ఏకాగ్రత లోపిస్తుందట. అలాగే బాధ, డిప్రెషన్ ఎక్కువైపోతాయి. మానసిక ఒత్తిడి కారణంగా వీరిలో నిస్సహాయత పెరగుతుందట. దీని వల్ల కొన్ని సార్లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కూడా వస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. ఈ రకమైన డిజార్డర్‌తో ఇబ్బంది పడుతున్న వారిని థెరపిస్ట్ దగ్గరకు తీసుకెళ్తే మంచిది.
బైపోలార్ డిజార్డర్ అనేది వారసత్వంగా కూడా వచ్చే ఛాన్స్ ఉందని డాక్టర్లు చెబుతున్నారు. ఎవరైనా చిన్న విషయానికి కూడా ఎక్కువగా రియాక్ట్ అవ్వడం, ప్రవర్తనలో మార్పులు వస్తే వెంటనే సైకియాట్రిస్ట్‌ని కలవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. పేషెంట్ వైద్య చరిత్ర, మెంటల్ కండిషన్ వంటి వాటిని తెలుసుకొని ట్రీట్‌మెంట్ ఇస్తారు. విపరీతంగా మూడ్ స్వింగ్స్ ఉన్నవారికి మూడ్ స్టెబిలైజర్స్ ఇస్తారు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.