BigTV English

Bird Flu Symptoms: చికెన్ తినాలంటే బర్డ్ ఫ్లూ భయం.. అసలు ఈ వైరస్ లక్షణాలు ఎలా ఉంటాయి..?

Bird Flu Symptoms: చికెన్ తినాలంటే బర్డ్ ఫ్లూ భయం.. అసలు ఈ వైరస్ లక్షణాలు ఎలా ఉంటాయి..?

Bird Flu Symptoms: గత కొన్ని నెలలుగా తెలుగు రాష్ట్రాలను బర్డ్ ఫ్లూ భయం వణికిస్తోంది. చాలా చోట్ల బర్డ్ ఫ్లూ సోకిన కోళ్లు కుప్పలు తెప్పలుగా చనిపోతున్నాయి. ఈ వైరస్ సోకిన కోళ్లను తింటే మనుషులకు కూడా బర్డ్ ఫ్లూ వచ్చే ప్రమాదం ఉందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు హెచ్చరించారు. దీంతో చికెన్ తింటే బర్డ్ ఫ్లూ వస్తుందనే భయంతో చాలా మంది తినడమే మానేశారు. అయితే ఈ వైరస్ మనుషులకు ఎలా సోకుతుంది..? దీని వల్ల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుందనేది తప్పకుండా తెలుసుకోవాలి.


వైరస్ ఎలా సోకుంతుంది?
బర్డ్ ఫ్లూని ఏవియన్ ఇన్‌ఫ్లుయెంజా అని కూడా పిలుస్తారు. ఇది H5N1 వంటి వైరస్ ద్వారా వ్యాప్తి చెందుతుందట. ఇప్పటికే వైరస్ బారిన పడ్డ పక్షుల మాంసం లేదా వాటి గుడ్లను తినడం వల్ల ఈ వైరస్ సోకే ప్రమాదం ఉందని డాక్టర్లు చెబుతున్నారు.

కొన్ని సందర్భాల్లో అయితే వైరస్ ఉన్న పక్షికి దగ్గర్లో ఉంటే కూడా మనుషులకు బర్డ్ ఫ్లూ సోకే ప్రమాదం ఉందట. పక్షి మలం, గాలి ద్వారా వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు అధికంగా ఉంటాయట.


బర్డ్ ఫ్లూ లక్షణాలు:
జలుబు చేసినప్పుడు సాధారణమే కదా అని చాలా మంది లైట్ తీసుకుంటారు. అయితే జలుబు కూడా బర్డ్ ఫ్లూ లక్షణమే అని వైద్య నిపుణులు చెబుతున్నారు. బర్డ్ ఫ్లూతో ఇబ్బంది పడుతున్న వారిలో తలనొప్పి, జ్వరం, దగ్గు, వేడి, శరీరంలో నొప్పులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడడం వంటి లక్షణాలు కనిపిస్తాయని అంటున్నారు.

ALSO READ: రష్యాలరో కరోనా తరహా వైరస్

ఇప్పటికే లంగ్ ఇన్‌ఫెక్షన్ వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారిపై బర్డ్ ఫ్లూ ప్రభావం అధికంగా ఉండే ఛాన్స్ ఉందని డాక్టర్లు చెబుతున్నారు. అంతేకాకుండా చిన్న పిల్లలు, వృద్ధులకు కూడా బర్డ్ ఫ్లూ కారణంగా శ్వాస సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉందట. మరి కొన్ని సందర్భాల్లో అయితే బర్డ్ ఫ్లూ తీవ్రమైన చెడు ప్రభావం చూపడం వల్ల శరీరలోనూ వైకల్యం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.

వైరస్ రావొద్దంటే..
బర్డ్ ఫ్లూ వైరస్ సోకకుండా ఉండాలంటే కొన్ని రకాల జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాల్సిన అవసరం ఉందని డాక్టర్లు సూచిస్తున్నారు. కోళ్ల ఫారాల్లో పని చేస్తున్నవారు తరచుగా చేతులు శుభ్రం చేసుకోవాలి.

దగ్గర్లో ఉన్న కోళ్లు లేదా ఇతర పక్షులలో బర్డ్ ఫ్లూ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం మంచిది. వీలైనంత వరకు చికెన్ తినకపోవడమే మంచిది. ఒకవేళ తినాల్సి వస్తే మాంసాన్ని ఎక్కువ సమయం ఉడికించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం ఉత్తమం.

Tags

Related News

Weight Loss: ఈ యోగాసనాలతో.. 10 రోజుల్లోనే వెయిట్ లాస్

Sugar: చక్కెర తినడం 30 రోజులు ఆపేస్తే.. ఏం జరుగుతుందో తెలుసా ?

Hair Care Tips: వర్షంలో జుట్టు తడిస్తే..… వెంటనే ఇలా చేయండి?

Paneer Effects: దే…వుడా.. పన్నీరు తింటే ప్రమాదమా?

Hair Growth Tips: ఈ టిప్స్ పాటిస్తే.. వారం రోజుల్లోనే ఒత్తైన జుట్టు !

Gut Health: గట్ హెల్త్ కోసం.. ఎలాంటి ఆహారం తినాలి ?

Big Stories

×