Peddi First Shot : రామ్ చరణ్ – బుచ్చిబాబు కాంబోలో ఓ మూవీ వస్తుంది. దానికి పెద్ది అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. దీన్ని రామ్ చరణ్ బర్త్ డే రోజు (మార్చి 26)న రివీల్ చేశారు. నిజానికి ఆ బర్త్ డే రోజు గ్లింప్స్ ను రిలీజ్ చేస్తారనే ప్రచారం సాగింది. అయితే కొన్ని కారణాల వల్ల అది జరగలేదు. కానీ, శ్రీ రామ నవమి సందర్భంగా రిలీజ్ చేయబోతున్నారు. అయితే… ఈ గ్లింప్స్‌లో ఓ షాట్ ఉంటుందని, దాని కోసం 1000 సార్లు ఆ గ్లింప్స్‌ను చూస్తారని నిర్మాత ఓ సందర్భంలో అన్నాడు. అలాగే ఆ గ్లింప్స్ చూసిన వాళ్లు చాలా మంది ఆ షాట్ గురించి మాట్లాడుతున్నారు. అంతలా… ఆ షాట్‌లో ఏం ఉంది..? బుచ్చిబాబు ఏం డిజైన్ చేశాడు..? అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌గా ఉంది.
బుచ్చిబాబు.. ఈయనకు డైరెక్టర్‌గా ఎక్స్‌పీరియన్స్ అంటే ఒకటి అంటే ఒకే ఒక్క మూవీ. ఆ మూవీ 100 కోట్లు కొట్టింది. అది పక్కన పెడితే… టాలీవుడ్ లెక్కల మాస్టర్, జీనియస్ డైరెక్టర్ అని పేరున్న సుకుమార్ దగ్గర చాలా ఎళ్ల పాటు అసిస్టెంట్‌గా పని చేశాడు. ఇప్పుడు ఆ ఎక్స్‌పిరయన్స్ చూసే సినిమా అవకాశాలు వస్తున్నాయని చెప్పొచ్చు. ఇప్పుడు రామ్ చరణ్ తో చేస్తున్న పెద్ది మూవీ కూడా అలానే వచ్చిందని అనుకోవచ్చు.
అలాగే, చాలా సందర్భాల్లో బుచ్చిబాబు గురించి ఆయన గురువు సుకుమార్ చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా… రామ్ చరణ్ హీరోగా వచ్చిన రంగస్థలం మూవీ షూటింగ్ టైంలో బుచ్చిబాబు ఇన్వొల్వెమెంట్ ఎంత ఉందో కూడా చెప్పాడు. దీంతో ఇప్పుడు పెద్ది మూవీని బుచ్చిబాబు ఓ విజన్‌తో చేస్తున్నాడని మెగా ఫ్యాన్స్ ఇప్పటికే ఓ క్లారిటీకి వచ్చారు.
ఇప్పుడు పెద్ది మూవీ నుంచి రాబోయే ఫస్ట్ గ్లింప్స్ తో బుచ్చిబాబు పనిపై ఉన్న నమ్మకం మరింత పెరిగే ఛాన్స్ ఉంది. నిజానికి ఈ గ్లింప్స్ రావడం ఏంటో గానీ, రాక ముందే కావాల్సినంత బజ్ అయితే క్రియేట్ అయింది.
రేపే పెద్ది ఫస్ట్ షాట్…
ఈ గ్లింప్స్‌ను పెద్ది ఫస్ట్ షాట్ అనే పేరుతో రిలీజ్ చేస్తున్నారు. రామ్ చరణ్ బర్త్ డేకు రావాల్సిన ఈ గ్లింప్స్ రేపు శ్రీ రామ నవమి సందర్భంగా రిలీజ్ చేయబోతున్నారు. ఈ గ్లింప్స్ కోసం ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఈ గ్లింప్స్ పై ఇంతటి హైప్ క్రియేట్ అయిన ఆ ఒక్క షాట్ కోసం ఫ్యాన్స్ ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు.
రెహమాన్ మ్యూజిక్
అలాగే… ఈ గ్లింప్స్ కు రెహమాన్ అందించిన మ్యూజిక్ కూడా నెక్ట్స్ లెవెల్ ఉంటుందని అంటున్నారు. నిజానికి రామ్ చరణ్ బర్త్ డే రోజు రిలీజ్ కావాల్సిన ఈ గ్లింప్స్ వాయిదా పడటానికి కారణం కూడా రెహమానే అని టాక్ వచ్చింది. ఆ గ్లింప్స్ రెహమాన్ మ్యూజిక్ ఇవ్వడం లేట్ అవ్వడంతో… వాయిదా పడిందని తెలుస్తుంది. ఏది ఏమైనా.. గ్లింప్స్ కొద్ది రోజులు లేట్ అయినా… ఇప్పుడు మ్యూజక్ సూపర్ గా వచ్చిందని అంటున్నారు.