BigTV English

Pooja Hegde: హీరోయిన్స్ కి ఇచ్చే క్యారెక్టర్స్ పై పూజా అసహనం.. ముందే తెలియదా అంటూ

Pooja Hegde: హీరోయిన్స్ కి ఇచ్చే క్యారెక్టర్స్ పై పూజా అసహనం.. ముందే తెలియదా అంటూ

Pooja Hegde: టాలీవుడ్ బుట్ట బొమ్మకి ప్రస్తుతం టాలీవుడ్ లో అవకాశాలు కరువైపోయాయి.ఈ హీరోయిన్ ఎప్పుడైతే బాలీవుడ్ కి వెళ్ళిపోయిందో అప్పటి నుండి టాలీవుడ్ ఇండస్ట్రీ ఈమెను అంతగా పట్టించుకోవడం లేదు.ఈ విషయం పక్కన పెడితే ప్రస్తుతం పూజా హెగ్డే.. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(Suriya ) నటిస్తున్న ‘రెట్రో’ మూవీలో హీరోయిన్ గా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.ఇక మే 1న రెట్రో మూవీ విడుదల కాబోతుండడంతో ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుపుతున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పూజా హెగ్డే దర్శకనిర్మాతలపై సంచలన వ్యాఖ్యలు చేసింది.హీరోయిన్లను కేవలం వాటికే పరిమితం చేస్తారంటూ పూజా హెగ్డే చేసిన కామెంట్లు నెట్టింట్లో వైరల్ గా మారాయి.మరి ఇంతకీ దర్శకనిర్మాతల గురించి పూజా హెగ్డే ఏం మాట్లాడిందో ఇప్పుడు చూద్దాం.


Kangana Ranaut: బాలీవుడ్ అవార్డ్స్ పై కంగనా కామెంట్.. అతడు పంపిన చీరే ప్రత్యేకం అంటూ..!

హీరోయిన్లను ఆ పాత్రలకే పరిమితం చేస్తున్నారు – పూజా హెగ్డే


పూజా హెగ్డే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “చాలామంది దర్శక నిర్మాతలు హీరోయిన్లను ఎప్పటికీ ఒకేలాంటి పాత్రల్లో తీసుకుంటున్నారు. హీరోలను వేరుగా చూపిస్తున్నారు.కానీ హీరోయిన్లను ఒకే తరహా పాత్రల కోసం తీసుకుంటున్నారు. ఒక హీరోయిన్ ఒక సినిమా కోసం తీసుకుంటే, అసలు ఆ సినిమాకి ఆ హీరోయిన్ సెట్ అవుతుందా ?లేదా? అని ఆడిషన్ నిర్వహించకుండానే.. ఒక కథ అనుకున్నప్పుడు ఆ హీరోయిన్ సెట్ అవుతుందిలే అని మనసులో అనుకొని ఆ సినిమా కోసం తీసుకుంటున్నారు. అయితే చాలా ఇండస్ట్రీలలో ఇదే పద్ధతి కొనసాగుతుంది. కానీ కొన్ని ఇండస్ట్రీలలో ఇలా జరగదు.నన్ను రీసెంట్ గా ఓ తమిళ సినిమా కోసం హీరోయిన్ గా ఫిక్స్ చేశారు. కానీ ఆ డైరెక్టర్ మొదట ఆ సినిమాకి నేను సెట్ అవుతానో లేదో అని ఆడిషన్ చేసారు.అయితే ఆ సినిమాలో నటించే హీరో ఏజ్ ఎక్కువగా ఉండడంతో ఏజ్ డిఫరెన్స్ వస్తుంది అనే ఉద్దేశంతో నేను ఆ హీరో పక్కన సెట్ అవ్వనని భావించి, నన్ను ఆ సినిమా నుండి తొలగించి,నాకంటే పెద్ద హీరోయిన్ ని ఆ సినిమాలో తీసుకున్నారు. అయితే దర్శక నిర్మాతలు సినిమా కోసం హీరోయిన్లను తీసుకున్నాక పాత్రకు కరెక్ట్ గా సెట్ అవ్వలేదని తీసివేసే బదులు.. ఆ పాత్ర కోసం హీరోయిన్ ని తీసుకునే ముందే ఆడిషన్ చేస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం” అంటూ దర్శక నిర్మాతలపై షాకింగ్ కామెంట్లు చేసింది పూజా హెగ్డే. అలాగే సినిమా తీసేముందు ఆడిషన్ చేయడం ఉత్తమం అంటూ కూడా పూజా హెగ్డే చెప్పుకొచ్చింది.

పూజా హెగ్డే కెరియర్..

ఒక పూజా హెగ్డే కెరియర్ విషయానికి వస్తే.. ‘ఒక లైలా కోసం’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె.. అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్ స్టార్ హీరోలు అందరి సరసన నటించి మెప్పించింది. ఇప్పుడు తెలుగులో అవకాశాల కోసం ఎదురుచూస్తోందని చెప్పవచ్చు. మరి ఇప్పటికైనా కోలీవుడ్ సినిమా సక్సెస్ అయితే తెలుగులో అవకాశాలు వస్తాయో లేదో చూడాలి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×