E-Paper
Advertisement

చలికాలంలో ఆరోగ్యంతో పాటు చర్మ సౌందర్యం కోసం మునగాకు సూప్.. తయారీ విధానం ఇదే!

చలికాలంలో ఆరోగ్యంతో పాటు చర్మ సౌందర్యం కోసం మునగాకు సూప్.. తయారీ విధానం ఇదే!
Advertisement

Moringa Soup: చలికాలం మొదలైందంటే చాలు.. చల్లగాలుల దెబ్బకు మన చర్మం పొడిబారి, ముఖంలో కళ తప్పుతుంది. ముఖ్యంగా బుగ్గలపై ఉండే సహజమైన ఎరుపుదనం మాయమై, చర్మం నిర్జీవంగా కనిపిస్తుంది. ఈ సమస్యను తగ్గించుకోవడానికి చాలామంది వేలకు వేలు ఖర్చు పెట్టి ఖరీదైన క్రీములు, లోషన్లు వాడుతుంటారు. కానీ బయట పూసే క్రీముల కంటే, లోపలి నుంచి మన శరీరానికి పోషణ అందించడమే అసలైన పరిష్కారం. ఈ చలికాలంలో మీ ఆరోగ్యాన్ని కాపాడుతూనే, ముఖానికి సహజమైన మెరుపునిచ్చే అద్భుతమైన డ్రింక్ మునగాకు సూప్. రాత్రి భోజనానికి ముందు ఒక కప్పు వేడివేడి మునగాకు సూప్ తాగడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి.

మునగాకుతో ఆరోగ్యం, అందం:

మన ఇంటి పెరట్లో దొరికే మునగాకులో విటమిన్లు, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తాన్ని శుద్ధి చేసి, రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. దీనివల్ల ముఖానికి సహజమైన మెరుపు రావడమే కాకుండా, బుగ్గలు సహజంగానే గులాబీ రంగులోకి మారుతాయి.

సూప్ తయారీకి కావాల్సిన పదార్థాలు:

Advertisement

ఈ సూప్ కోసం ఒక కప్పు తాజా మునగాకు, సన్నగా తరిగిన నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు, తురిమిన చిన్న అల్లం ముక్క, సూప్ చిక్కదనం కోసం ఒక చిన్న ఉల్లిపాయ లేదా క్యారెట్ ముక్కలు తీసుకోవాలి. వీటితో పాటు అర టీస్పూన్ మిరియాల పొడి, ఒక టీస్పూన్ వెన్న లేదా దేశీ నెయ్యి, కొద్దిగా కార్న్ ఫ్లోర్ లేదా ఓట్స్ పొడి, రుచికి సరిపడా ఉప్పు, నల్ల ఉప్పు సిద్ధం చేసుకోవాలి.

Also Read: బరువు తగ్గాలన్నా, కండలు పెంచుకోవాలన్నా పూర్తి గుడ్డు తినాలా? తెల్లసొన మాత్రమే సరిపోతుందా?

చిక్కదనం కోసం చిట్కాలు:

Advertisement

సూప్ కోసం ఎప్పుడూ లేత, తాజా మునగాకులనే వాడాలి. అప్పుడే వాటిలోని పోషకాలు నేరుగా చర్మానికి అందుతాయి. అలాగే ఆకులను తక్కువ మంటపై కనీసం పది నిమిషాలు ఉడికిస్తే.. అందులోని సారమంతా నీటిలోకి దిగుతుంది.

తయారు చేసే పద్ధతి:

ఒక గిన్నెలో రెండు గ్లాసుల నీళ్లు పోసి మునగాకు, తరిగిన ఉల్లిపాయ, క్యారెట్, అల్లం, వెల్లుల్లి వేసి 10 నిమిషాల పాటు మీడియం మంటపై ఉడికించాలి. ఆకులు మెత్తబడ్డాక స్టవ్ ఆపి, మిశ్రమం చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని వడకట్టి రసాన్ని వేరు చేయాలి. ఇప్పుడు పాన్‌లో కొద్దిగా వెన్న వేడి చేసి, వడకట్టిన సూప్ పోయాలి. చిక్కదనం కోసం నీళ్లలో కలిపిన కార్న్ ఫ్లోర్ మిశ్రమాన్ని జతచేయాలి. చివరగా మిరియాల పొడి, ఉప్పు, నల్ల ఉప్పు వేసి బాగా మరిగించాలి. అంతే.. ఎంతో ఆరోగ్యకరమైన వేడివేడి మునగాకు సూప్ రెడీ. చలికాలపు సాయంత్రం డిన్నర్‌కు ముందు దీనిని తాగితే ఆరోగ్యంతో పాటు చక్కటి గ్లో మీ సొంతమవుతుంది.

Also Read: ఆదివారం లంచ్‌కు అదిరిపోయే రెసిపీ.. గోధుమ పిండితో యమ్మీ యమ్మీ మసాలా కుల్చా!

Tags

Related News

బరువు తగ్గాలన్నా, కండలు పెంచుకోవాలన్నా పూర్తి గుడ్డు తినాలా? తెల్లసొన మాత్రమే సరిపోతుందా?

ఆదివారం లంచ్‌కు అదిరిపోయే రెసిపీ.. గోధుమ పిండితో యమ్మీ యమ్మీ మసాలా కుల్చా!

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో జన్మించిన అబ్బాయి అల్లుడిగా దొరికితే అత్తమామలకు అదృష్టం పట్టినట్లే

విదుర నీతి.. ఈ 4 చోట్ల డబ్బు ఖర్చు చేస్తే సంపద మొత్తం హరించుకుపోతుంది

కొండ మీద నుంచి జారిపడిన యువకుడు.. 6 రోజులు ఎండలో కాలిపోతూ ఆకలి తట్టుకోలేక ఎలా బయటపడ్డాడంటే

చిన్నపిల్లల్లో మధుమేహం.. తల్లిదండ్రులు ఈ లక్షణాలు అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు

పాతదే మళ్లీ ఫ్యాషన్.. Vintage Cultureకి ఫిదా అవుతున్న Gen Z!

Big Stories

Advertisement
×