E-Paper
Advertisement

ప్రధాని మోదీతో ముగిసిన సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. తెలంగాణకు రూ.30 వేల కోట్ల సాయంపై కీలక చర్చ!

ప్రధాని మోదీతో ముగిసిన సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. తెలంగాణకు రూ.30 వేల కోట్ల సాయంపై కీలక చర్చ!
Advertisement

Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వాకిటి శ్రీహరిలతో కలిసి ప్రధానిని కలిసిన సీఎం.. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలు, పెండింగ్ ప్రాజెక్టులపై సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్ర ప్రయోజనాలే ప్రధాన అజెండాగా ఈ భేటీ సాగింది.

కరవు సాయం, సాగునీటి ప్రాజెక్టులపై వినతి

Advertisement

ఎల్‌నినో ప్రభావంతో తెలంగాణలో నెలకొన్న కరవు పరిస్థితులను ఎదుర్కొనేందుకు రాష్ట్రానికి రూ.30 వేల కోట్ల ఆర్థిక సాయం అందించాలని సీఎం రేవంత్ ప్రధానిని కోరినట్లు సమాచారం. అలాగే వ్యవసాయ రంగానికి అదనంగా 1,500 మెగావాట్ల విద్యుత్, రైతులకు సరిపడా ఎరువులను కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. వీబీజీ రాంజీ పథకం కింద అదనంగా 50 రోజుల ఉపాధి కల్పించాలని కోరారు. వీటితో పాటు తుమ్మిడిహెట్టి, సమ్మక్క-సారక్క, సీతమ్మ సాగర్, పాలమూరు-రంగారెడ్డి సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని సహకరించాలని వినతిపత్రం అందించారు.

మెట్రో రెండో దశ, ఇందిరమ్మ ఇళ్లకు నిధులు..

Advertisement

రాష్ట్రంలో పేదల కోసం నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లకు అదనపు నిధులు కేటాయించడంతో పాటు, ప్రతిష్టాత్మక హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణకు కేంద్ర సహకారం అందించాలని సీఎం కోరారు. త్వరలో జరగనున్న తెలంగాణ గ్లోబల్ సమ్మిట్, ఖేలో ఇండియా ప్రారంభోత్సవ వేడుకలకు హాజరుకావాలని ప్రధాని మోదీని ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ఆహ్వానించారు.

ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలు చెప్పాం: మంత్రి ఉత్తమ్

ప్రధానితో భేటీ అనంతరం సహచర మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సాగునీటి అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లామని, వాటి పరిష్కారానికి కేంద్ర సహకారం కోరామని ఆయన తెలిపారు. అలాగే ఈ నెల 22వ తేదీ వరకు తెలంగాణలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహించనున్నామని, ఈ క్రీడల ప్రారంభోత్సవానికి రావాలని ప్రధానిని ఆహ్వానించినట్లు మంత్రి ఉత్తమ్ వివరించారు.

Also Read: బ్లాక్ మెయిల్ కోసమే హైడ్రా.. ఆ భూమి మునిగితే ముక్కు నేలకు రాస్తా: ఈటల సవాల్

Tags

Related News

మూడు నెలల్లో సోనియా గాంధీ ఆత్మకథ పుస్తకం తెలుగు వెర్షన్!

బ్లాక్ మెయిల్ కోసమే హైడ్రా.. ఆ భూమి మునిగితే ముక్కు నేలకు రాస్తా: ఈటల సవాల్

తెలంగాణలో పాలసీ పెరాలసిస్ లేదు.. పెట్టుబడిదారులకు సీఎం రేవంత్ రెడ్డి బిగ్ ఆఫర్!

ప్రేమ కాటుకు బలైన సుస్మిత.. మృతదేహానికి చెట్టుతో పెళ్లి.. అసలేం జరిగిందంటే?

పెళ్లి పేరుతో అత్యాచారం.. ముంబై మహిళ ఫిర్యాదు, హైదరాబాద్‌లో కేసు నమోదు

ఘోర రోడ్డు ప్రమాదాలు.. స్పాట్‌లో ఐదుగురు మృతి, వికారాబాద్-తిరుపతి ఏరియాల్లో

కార్తీకమాసం ఎఫెక్ట్.. దిగొస్తున్న చికెన్ ధరలు, భగ్గుమన్న కూరగాయల ధరలు

Big Stories

Advertisement
×