E-Paper
Advertisement

నోటి పూత తగ్గట్లేదా? ఇది క్యాన్సర్ లక్షణమా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే..

నోటి పూత తగ్గట్లేదా? ఇది క్యాన్సర్ లక్షణమా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే..
Advertisement

Mouth Ulcer: నోటి పూత (నోటి పుండ్లు) అనేది చాలామందిలో కనిపించే ఒక సాధారణ సమస్య. వేడి చేయడం, అనుకోకుండా నాలుక లేదా బుగ్గ కొరుక్కోవడం, కారం ఎక్కువగా తినడం లేదా ఒత్తిడి వల్ల ఇవి వస్తుంటాయి. సాధారణంగా ఇవి వారం లేదా పది రోజుల్లో అవే తగ్గిపోతాయి. కానీ కొన్ని వారాలు గడిచినా పుండు తగ్గకుండా అలాగే ఉంటే మాత్రం కొంచెం జాగ్రత్త పడాల్సిందే.

నోటి పుండ్లు ఎందుకు వస్తాయి?

మన శరీరంలో విటమిన్ బి12, ఐరన్ లేదా ఫోలిక్ యాసిడ్ లోపం ఉన్నప్పుడు నోటి పూత పదే పదే వేధిస్తుంది. దీనికి తోడు కడుపులో సమస్యలు, కొన్ని రకాల మందుల వాడకం వల్ల కూడా ఇవి రావచ్చు. కొన్నిసార్లు మనం వాడే పంటి సెట్ సరిగ్గా లేకపోయినా లేదా పన్ను పదునుగా ఉండి బుగ్గకు తగులుతున్నా ఆ ఘర్షణ వల్ల పుండు మానకుండా అలాగే ఉండిపోతుంది.

ఎప్పుడు వైద్యులను కలవాలి?

Advertisement

నోట్లో వచ్చిన పుండు రెండు మూడు వారాల కంటే ఎక్కువ కాలం ఉన్నా, రోజురోజుకూ దాని పరిమాణం పెరుగుతున్నా తేలికగా తీసుకోకూడదు. అలాగే పుండుపై ముట్టుకుంటే గట్టిగా అనిపించడం, చిన్నగా తాకినా రక్తం రావడం లాంటి మార్పులు గమనిస్తే వెంటనే డాక్టర్‌ను కలవడం మంచిది. కేవలం మెడికల్ షాప్‌లో దొరికే జెల్స్ రాస్తూ కాలాన్ని వృధా చేయకూడదు.

Also Read: మైగ్రేన్ కేవలం హార్మోన్ల వల్లే రాదు.. ఆ 4 తప్పులు కూడా కారణమే!

గమనించాల్సిన సంకేతాలు..

Advertisement

పుండుతో పాటు నోటి లోపల తెల్లటి లేదా ఎర్రటి మచ్చలు ఏర్పడటం, ఆహారం మింగడంలో ఇబ్బంది ఉండటం, మెడ భాగంలో బిళ్లలు కట్టడం లేదా గడ్డల్లా రావడం వంటి లక్షణాలు ఉంటే ఆలస్యం చేయకూడదు. మాటలో బొంగురుతనం, నోట్లో తిమ్మిరిగా అనిపించడం కూడా గమనించాల్సిన విషయాలే. ఇవన్నీ కచ్చితంగా క్యాన్సర్ లక్షణాలు కాకపోయినా.. వైద్య పరీక్షలు చేయించుకోవడం అవసరం.

ఈ అలవాట్లు ఉంటే జాగ్రత్త..

సిగరెట్, గుట్కా, ఖైనీ, తంబాకు నమలడం, మద్యం సేవించడం వంటి అలవాట్లు ఉన్నవారికి నోటి సమస్యలు వచ్చే ప్రమాదం చాలా ఎక్కువ. అయితే ఈ అలవాట్లు లేనివారికి అసలు క్యాన్సర్ రాదని చెప్పలేం. కాబట్టి.. అలవాట్లతో సంబంధం లేకుండా నోట్లో పుండు తగ్గకుండా ఉంటే పరీక్షించుకోవాలి.

భయపడొద్దు కానీ నిర్లక్ష్యం చేయొద్దు..

నోటి పూత రాగానే భయపడిపోవాల్సిన అవసరం లేదు. కానీ అది కొన్ని వారాల పాటు తగ్గకుండా వేధిస్తుంటే మాత్రం సరైన సమయంలో డాక్టర్‌కు చూపించుకోవడమే తెలివైన పని. ముందస్తుగా గుర్తిస్తే ఎలాంటి ఆరోగ్య సమస్యనైనా సులభంగా నయం చేసుకోవచ్చు.

Also Read: పార్లర్‌కి వెళ్లే పనిలేదు.. ఇంట్లోనే స్కిన్ మెరిసిపోయే 7 మ్యాజికల్ గ్యాడ్జెట్స్ ఇవే!

Tags

Related News

వర్షాకాలంలో డేట్ వెళ్లడానికి ఇబ్బందిగా ఉందా? ఇంట్లోనే రొమాంటిక్ డేటింగ్ ఇలా ప్లాన్ చేయండి

ఒక్కసారి మొదలిపెడితే ఆపరు.. ఈ తేదీల్లో పుట్టినవారు గంటల తరబడి మాట్లాడుతుంటారు

మైగ్రేన్ కేవలం హార్మోన్ల వల్లే రాదు.. ఆ 4 తప్పులు కూడా కారణమే!

పర్ఫెక్ట్ రైస్.. అన్నం వండినప్పుడు అంటుపోకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా చేస్తే సరి

పిల్లలు మీతో ఏదీ దాచుకోకుండా చెప్పాలంటే ముందుగా ఈ 5 అలవాట్లు మార్చుకోండి

వేప నీటితో స్నానం చేస్తే.. మతిపోయే లాభాలు!

అవసరం తీరాక మర్చిపోతారు.. ఈ రాశులలో జన్మించిన వారు స్వార్థపరులు

Big Stories

Advertisement
×