E-Paper
Advertisement

మైగ్రేన్ కేవలం హార్మోన్ల వల్లే రాదు.. ఆ 4 తప్పులు కూడా కారణమే!

మైగ్రేన్ కేవలం హార్మోన్ల వల్లే రాదు.. ఆ 4 తప్పులు కూడా కారణమే!
Advertisement

Migraine: మైగ్రేన్ అనేది కేవలం సాధారణ తలనొప్పి కాదు. తీవ్రమైన నొప్పితో పాటు వాంతులు, వెలుతురు, శబ్దాలను తట్టుకోలేకపోవడం, విపరీతమైన నీరసం వంటి లక్షణాలు దైనందిన జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తాయి. ముఖ్యంగా పురుషులతో పోలిస్తే.. మహిళల్లో మైగ్రేన్ ప్రభావం, దాని తీరు చాలా భిన్నంగా ఉంటుంది. దీనికి గల కారణాలను ఫోర్టిస్ హాస్పిటల్ సీనియర్ న్యూరాలజిస్ట్ డాక్టర్ నేహా పండితా సోషల్ మీడియాలో ఓ వీడియో ద్వారా స్పష్టంగా వివరించారు.

హార్మోన్ల మార్పుల ప్రభావం..

మహిళల జీవితంలో పీరియడ్స్, గర్భధారణ, ప్రసవం, మెనోపాజ్ వంటి దశల్లో హార్మోన్లలో తీవ్ర మార్పులు చోటుచేసుకుంటాయి. ముఖ్యంగా ఋతుక్రమానికి ముందు ఈస్ట్రోజెన్ హార్మోన్ స్థాయిలు ఒక్కసారిగా పడిపోవడం వల్ల చాలామందిలో మైగ్రేన్ వస్తుంది. సాధారణ రోజుల్లో వచ్చే తలనొప్పితో పోలిస్తే, పీరియడ్స్ సమయంలో వచ్చే మైగ్రేన్ ఎక్కువ సమయం వేధిస్తుంది, తగ్గడం కూడా కాస్త కష్టంగా ఉంటుంది.

Advertisement

Also Read: పార్లర్‌కి వెళ్లే పనిలేదు.. ఇంట్లోనే స్కిన్ మెరిసిపోయే 7 మ్యాజికల్ గ్యాడ్జెట్స్ ఇవే!

జీవనశైలి, దైనందిన ఒత్తిడి..

కేవలం హార్మోన్లు మాత్రమే కాకుండా.. రోజూవారీ అలవాట్లు కూడా మైగ్రేన్‌ను ప్రేరేపిస్తాయి. వేళకు భోజనం చేయకపోవడం, తగినంత నీళ్లు తాగకపోవడం, సరిపడా నిద్ర లేకపోవడం, ఉద్యోగం, కుటుంబ బాధ్యతల వల్ల కలిగే ఒత్తిడి దీనికి ప్రధాన కారణాలు. ఇవన్నీ విడివిడిగా చిన్న విషయాలుగా అనిపించినా.. ఒక్కసారిగా కలవడం వల్ల మైగ్రేన్ దాడి చేసే అవకాశం పెరుగుతుంది.

వయస్సుతో వచ్చే మార్పులు..

Advertisement

వయస్సును బట్టి మైగ్రేన్ ప్రభావం మారుతుంటుంది. గర్భధారణ సమయంలో కొందరికి నొప్పి తగ్గితే, ప్రసవం తర్వాత నిద్రలేమి, శిశువు సంరక్షణ వల్ల మళ్లీ పెరగొచ్చు. మెనోపాజ్ సమయంలో హార్మోన్ల హెచ్చుతగ్గుల వల్ల ఇది మరింత అస్తవ్యస్తంగా మారుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ ఒక ‘హెడ్ఏక్ డైరీ’ నిర్వహించడం మంచిది. తలనొప్పి ఎప్పుడు వస్తుంది? ఆ సమయంలో నిద్ర, ఆహారం, పీరియడ్స్ తీరు ఎలా ఉన్నాయో.. నమోదు చేస్తే అసలు కారణాన్ని గుర్తించడం సులువవుతుంది.

నొప్పిని భరించడం సరికాదు..

తరచూ వచ్చే తలనొప్పులను నిర్లక్ష్యం చేయడం లేదా ప్రతిసారీ పెయిన్ కిల్లర్స్ వాడటం అసలు మంచిది కాదు. విపరీతమైన నొప్పి, చూపు మసకబారడం, మాట్లాడటంలో ఇబ్బంది వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. రోజువారీ పనులకు భంగం కలిగిస్తున్న నొప్పిని అలవాటుగా మార్చుకోకుండా, సరైన వైద్య సలహాతో మైగ్రేన్‌ను అదుపులో ఉంచుకోవడం ముఖ్యం.

Also Read: వంట పనిని సగం తగ్గించే 6 కిచెన్ సాధనాలు.. ప్రతీ ఇంట్లోనూ ఇవి ఉండాల్సిందే!

Tags

Related News

బెడ్‌పై పిల్లలు మూత్రం పోశారా? మరకలు, దుర్వాసన తొలగించే సులభమైన చిట్కాలు ఇవే

బిజీ మార్నింగ్‌లో కూడా హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ కావాలా? 10 నిమిషాల్లో రెడీ చేసే రెసిపీలు ఇవే

భార్యభర్తలు ఇద్దరూ బిజీ.. దాంపత్య జీవితం సంతోషంగా సాగడానికి టిప్స్

నిర్మలా సీతారామన్ ఇంటి లోపల ఇలా ఉంటుందా?

ఆఫీస్‌లో తెలియక చేసే ఈ 5 తప్పులు కెరీర్‌ను దెబ్బతీస్తాయి.. జాగ్రత్త!

ఉదయాన్నే పిల్లలకు ఈ టిఫిన్స్ తినిపిస్తే రోజంతా చురుగ్గా, ఆరోగ్యంగా ఉంటారు!

మటన్ చాప్స్ రోస్ట్ ఇలా చేయండి.. ఒక్కసారి తింటే మళ్లీ ఇదే కావాలంటారు!

చికెన్‌లో చింతపండు వేస్తే ఇంత టేస్టీగా ఉంటుందా? తప్పక ట్రై చేయండి!

Big Stories

Advertisement
×