E-Paper
Advertisement

పార్లర్‌కి వెళ్లే పనిలేదు.. ఇంట్లోనే స్కిన్ మెరిసిపోయే 7 మ్యాజికల్ గ్యాడ్జెట్స్ ఇవే!

పార్లర్‌కి వెళ్లే పనిలేదు.. ఇంట్లోనే స్కిన్ మెరిసిపోయే 7 మ్యాజికల్ గ్యాడ్జెట్స్ ఇవే!
Advertisement

Best Beauty Gadgets: వర్షాకాలం ముగిసాక తేమ, జిడ్డు వల్ల చర్మం కాంతిహీనంగా మారడం సహజమే. అయితే ఇంట్లోనే కొద్దిపాటి సంరక్షణతో మన ముఖాన్ని మళ్లీ ఫ్రెష్‌గా, కాంతివంతంగా మార్చుకోవచ్చు. దీనికోసం మనకు ఉపయోగపడే కొన్ని అద్భుతమైన బ్యూటీ గ్యాడ్జెట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం రండి..

ఫేషియల్ స్టీమర్..

స్టీమర్ అందించే గోరువెచ్చని ఆవిరి చర్మ రంధ్రాల్లో పేరుకుపోయిన మురికిని, జిడ్డును సులువుగా తొలగిస్తుంది. ముఖం కడుక్కోవడానికి ముందు ఆవిరి పడితే చర్మం శుభ్రపడటమే కాకుండా.. ఆ తర్వాత వాడే స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ చర్మంలోకి బాగా ఇంగుతాయి.

ఫేషియల్ క్లీన్సింగ్ బ్రష్..

Advertisement

చేతులతో ముఖం కడుక్కోవడం కంటే ఈ బ్రష్ వాడటం వల్ల చెమట, సన్‌స్క్రీన్, జిడ్డు వదిలి ముఖం లోతుగా శుభ్రపడుతుంది. మృదువైన బ్రష్ ఎంచుకుని, చర్మంపై ఎక్కువ ఒత్తిడి పెట్టకుండా వాడాలి.

ఎల్ఈడీ ఫేస్ మాస్క్..

వర్షాకాలం తర్వాత చర్మానికి మంచి గ్లో తేవడానికి ఇది చక్కగా పనిచేస్తుంది. ఇందులో ఉండే రకరకాల లైట్ సెట్టింగ్స్ చర్మ సమస్యలను బట్టి సహాయపడతాయి. పరికరంపై ఇచ్చిన సూచనల ప్రకారమే దీనిని వాడటం మంచిది.

Advertisement

Also Read: Apple Watch Series 12లో కొత్త ప్రాసెసర్, ఎఐ ఫీచర్లు.. యాపిల్ లవర్స్‌కు పండగే!

ఐస్ రోలర్..

ఉదయం లేవగానే ముఖం ఉబ్బినట్లుగా అనిపిస్తే ఐస్ రోలర్ బెస్ట్ ఆప్షన్. దీని చల్లదనం అలసటను తగ్గించి చర్మానికి మంచి ఉపశమనాన్ని ఇస్తుంది. అయితే దీనిని ఒకేచోట ఎక్కువ సేపు ఉంచకుండా ముఖంపై మెల్లగా తిప్పాలి.

స్కాల్ప్ మసాజర్..

జుట్టు సంరక్షణకు ఇది ఎంతో మేలు చేస్తుంది. మృదువైన సిలికాన్ కొనలు ఉన్న ఈ మసాజర్ షాంపూను తల అంతటా సరిగ్గా వ్యాపించేలా చేస్తుంది. గోళ్లతో రక్కకుండా స్కాల్ప్‌ను శుభ్రం చేసుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది.

ఫేషియల్ హెయిర్ రిమూవర్..

పెదవులపై, గడ్డం వద్ద ఉండే అనవసరమైన వెంట్రుకలను త్వరగా తొలగించుకోవడానికి ఈ పరికరం అనువుగా ఉంటుంది. ఎక్కడికైనా వెళ్లినప్పుడు దీనిని వెంట తీసుకెళ్లడానికి సులువుగా ఉండి, నీళ్లు అవసరం లేకుండా పనిచేస్తుంది.

బ్లాక్‌హెడ్ వ్యాక్యూమ్..

చర్మ రంధ్రాల్లోని జిడ్డును, బ్లాక్‌హెడ్స్‌ను బయటకు తీయడానికి ఇది సహాయపడుతుంది. ఎప్పుడూ తక్కువ సెక్షన్ సెట్టింగ్‌తోనే మొదలుపెట్టి, ముఖంపై ఒకేచోట కాకుండా మెల్లగా జరుపుతూ వాడాలి. ఈ గ్యాడ్జెట్లను సరైన పద్ధతిలో వాడితే.. చర్మం మళ్లీ సహజమైన మెరుపులోకి మారిపోతుంది.

Also Read: ఇదెక్కడి మాస్ డిస్కౌంట్ మావా.. Samsung Galaxy S26 Plusపై రూ.30,500 తగ్గింపు!

Tags

Related News

యూట్యూబ్‌లో ఏ వీడియో క్వాలిటీకి ఎంత డేటా ఖర్చవుతుందో తెలుసా?

ఐఫోన్ బ్యాటరీని బ్యాక్‌గ్రౌండ్‌లో తినేస్తున్నది ఇదే.. ఈ ఒక్క సెట్టింగ్ మార్చండి చాలు!

ఫోన్ అడిక్షన్ అనుకుంటున్నారా? ఉదయాన్నే ఫోన్ చూడటం వెనుక అసలు సైకాలజీ ఇదే!

పవర్ బ్యాంక్‌ వాడుతున్నారా? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు!

ఆపిల్ వాచ్..పాత లుక్కే అయినా పర్ఫార్మెన్స్‌లో అదుర్స్!

రూ.50 వేలలోపు బెస్ట్ స్మార్ట్ టీవీలు..అమెజాన్,ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఇవే బెస్ట్!

ప్రైమ్ డే సేల్ కంటే ముందే ఆఫర్లు.. ఈ 5 గాడ్జెట్స్‌పై అమెజాన్‌లో కళ్లు చెదిరే డిస్కౌంట్లు!

బ్లూటూత్ తరచూ డిస్‌కనెక్ట్ అవుతోందా?నిమిషాల్లో ఇలా సాల్వ్ చేసుకోండి!

Big Stories

Advertisement
×