AgniPariksha 2: ఒకప్పుడు ఉదయభాను హోస్ట్ గా సామాన్య ప్రజలలోకి నేరుగా వెళ్లి చేసిన షో సాహసం చేయరా డింభకా. ఈ షో భారీ పాపులారిటీ సంపాదించుకున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా అక్కడ ప్రాణాలను పణంగా పెట్టి చేసే స్టంట్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసేది. ముఖ్యంగా ఆ షోలో ఎంతోమంది టాలెంట్ బయటపడ్డ విషయం తెలిసిందే. నిజానికి ఆ షో పెట్టినప్పుడు చాలా విమర్శలు కూడా వచ్చాయి. ఇలాంటి షోలు ప్రజల ప్రాణాల మీదకొస్తాయంటూ ఎంతోమంది విమర్శలు గుప్పించారు. కానీ ఆ షో వల్ల ఎంతోమంది తమ టాలెంటును నిరూపించుకున్నారని చెప్పవచ్చు.
అయితే ఇప్పుడు అదే సామాన్యులు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లడానికి అగ్ని పరీక్షా సీజన్ 2లో జడ్జెస్ కంటెస్టెంట్స్ కి ఇస్తున్న టాస్కులు చూస్తూ ఉంటే..చూసే ఆడియన్స్ కి సాహసం చేయరా డింభకా షో గుర్తోస్తోందనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. అప్పట్లో రియల్ స్టంట్ తో అందరిని ఆశ్చర్యపరిచేవారు. అయితే అవన్నీ వారు ప్రాక్టీస్ చేసి చేసినవి. కానీ ఇప్పుడు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేని వారితో ఇలాంటి స్టంట్స్ చేయించి కంటెస్టెంట్లను చంపేస్తారా ఏంటి అంటూ ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
also read:అగ్నిపరీక్షలో జరిగేది ఇదే.. అసలు నిజం బయటపెట్టిన లేడీ కంటెస్టెంట్!
సెప్టెంబర్ మొదటి వారంలో బిగ్ బాస్ సీజన్ 10 ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో కామన్ మ్యాన్ క్యాటగిరి నుండి 6 మందిని హౌస్ లోకి పంపించడానికి అగ్నిపరీక్ష షో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఫైనల్ గా 15 మందిని ఎంపిక చేశారు. అయితే ఆ 15 మందిలో హౌస్ లోకి అడుగుపెట్టే ఆ ఆరుగురి కోసం ఇక్కడ జడ్జెస్ గా ఉన్న బిందు మాధవి (Bindhu madhavi), నవదీప్(Navdeep ), అభిజిత్(Abhijeeth) లు ఇస్తున్న టాస్కులు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. నరాలు కట్ అయ్యే ఉత్కంఠతో ఈ టాస్కులు అందర్నీ భయాందోళనలకు గురిచేస్తున్నాయి. జియో హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ అగ్ని పరీక్ష సీజన్ 2 లేటెస్ట్ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోను నిర్వాహకులు విడుదల చేయగా ఆ ప్రోమో పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
డేర్ ఆర్ డై టాస్క్ లో భాగంగా.. నోరు కారం చేసుకోండి అంటూ అక్కడ ఉన్న కంటెస్టెంట్ కి పచ్చిమిర్చి ఇచ్చారు హోస్ట్ శ్రీ ముఖి. ఆమె మాట్లాడుతూ..మీరు తిన్న పచ్చిమిర్చి స్పై లెవెల్ 5000 యూనిట్స్.. నా చేతిలో ఉన్నది హై బర్డ్ చిల్లీ.. దీని స్పైస్ లెవెల్ 50,000 యూనిట్స్. ఇప్పుడు చూపించబోయేది అసలైన సినిమా.. గోస్ట్ పెప్పర్ చిల్లీ.. దీని స్పైస్ లెవెల్ 8 నుంచి 10 లక్షల యూనిట్స్. ఈ డేర్ ఎవరు చేయబోతున్నారు? అంటూ శ్రీముఖి అడగగా అందులో కొంతమంది ముందుకు వచ్చారు. అది తిన్న తర్వాత బౌల్ లో ఉన్న 25 బెలూన్స్ ని పగలగొట్టేలా ఊదాలి అంటూ టాస్క్ నిర్వహించింది హోస్ట్ శ్రీముఖి.
సాధారణంగా మిర్చి అంటేనే కారం.. పైగా గోస్ట్ మిర్చీ ఇచ్చి వారితో తినిపించి బెలూన్స్ పగలగొట్టించేలా చేస్తున్న తీరు అందర్నీ భయానికి గురిచేసింది. ముఖ్యంగా నీళ్లు కూడా ఇవ్వకుండా పెట్టిన ఈ టాస్క్ కంటెస్టెంట్స్ పడ్డ కష్టం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. అలాగే అలవాటు లేని ఐస్ బాత్ టాస్క్ కూడా నిర్వహించారు. ఇలా క్లిష్టమైన టాస్క్ లతో కంటెస్టెంట్స్ ను చంపేస్తారా ఏంటి అంటూ నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. మరికొంతమంది ఇలాంటి టాస్కులు బిగ్ బాస్ హౌస్ లో కూడా నిర్వహిస్తారు.. వీటిని తట్టుకుంటేనే కదా హౌస్ లో వారు అన్ని రోజులు నెగ్గగలిగేది అంటూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఏది ఏమైనా లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో మాత్రం కాస్త టెర్రిఫిక్ గా ఉంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.