BigTV English

Weight Loss: 30 రోజుల్లోనే.. బరువు తగ్గడం ఎలానో తెలుసా ?

Weight Loss: 30 రోజుల్లోనే.. బరువు తగ్గడం ఎలానో తెలుసా ?

Weight Loss: బరువు పెరగడం ఈ రోజుల్లో అతిపెద్ద సమస్యగా మారింది. ప్రతి రెండవ వ్యక్తి ఊబకాయంతో బాధపడుతున్నాడు. నడుము, పొట్ట ,కాళ్ళపై అధిక కొవ్వు మన అందాన్ని పాడు చేయడమే కాకుండా ఫ్యాటీ లివర్ , కొలెస్ట్రాల్, రక్తపోటు , మధుమేహం వంటి సమస్యల ప్రమాదాన్ని కూడా కలిగిస్తుంది . అందుకే.. ముందుగానే పెరుగుతున్న బరువును నియంత్రించడం చాలా ముఖ్యం. దీని కోసం మీరు కొన్ని సులభమైన పద్ధతులను పాటించాలి. మీరు కూడా మీ అధిక బరువుతో ఇబ్బంది పడుతూ , కేవలం ఒక నెలలోనే దానిని తగ్గించుకోవాలనుకుంటే ఈ పద్ధతులను పాటించండి.


నిమ్మకాయ, అల్లం కలిపిన నీరు:
ఉదయం నిద్రలేచిన వెంటనే టీ, కాఫీ తాగడం మానేయండి. కొంతమంది లివర్ డీటాక్స్ కోసం బ్లాక్ కాఫీ తీసుకుంటారు. కానీ కాఫీని ఎక్కువగా తీసుకోవడం వల్ల అధిక పరిమాణంలో కార్టిసాల్ హార్మోన్ స్థాయి పెరుగుతుంది. ఇది ఒత్తిడి, నిద్రలేమి వంటి సమస్యలను కలిగిస్తుంది. దీనికి బదులుగా, ఉదయం నిమ్మకాయ నీరు, గ్రీన్ టీ, పుదీనా టీ, హెర్బల్ టీ లేదా క్యారెట్-బీట్‌రూట్ రసం తాగండి. ఇవి బరువు తగ్గడంతో పాటు ఇతర ప్రయోజనాలను కూడా అందిస్తాయి.

వ్యాయామం:
ప్రతిరోజూ కనీసం అరగంట వ్యాయామం కోసం కేటాయించండి. దీనితో పాటు మీరు వాకింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్, డ్యాన్స్, వెయిట్ లిఫ్టింగ్ వంటి ఏదైనా వ్యాయామం చేయవచ్చు. ఇది తక్కువ సమయంలోనే ఎక్కువ కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడుతుంది.


బరువు తగ్గడానికి తక్కువ తినడం :
ఎంత ఆరోగ్యకరమైన ఆహారం తిన్నా, అతిగా తినడం వల్ల బరువు పెరుగుతుంది. అందుకే.. మీరు ఎక్కువ ఆహారం తినకుండా జాగ్రత్తపడండి. అన్నీ తినండి కానీ పరిమాణం తక్కువగా ఉండేలా చూసుకోండి. చిన్న ప్లేట్ తీసుకొని అందులోనే తక్కువ ఆహారం తినండి . ఆహారాన్ని పూర్తి చేయడానికి ఎక్కువ సమయం పట్టేలా నెమ్మదిగా తినండి.

కూల్ డ్రింక్‌కు దూరంగా ఉండండి ?

చిప్స్, కుకీలు, కూల్ డ్రింక్స్, పేస్ట్రీలు, కేకులు, సోడా , ప్రాసెస్ చేసిన ఆహారాలు రుచికరంగా ఉంటాయి. కానీ వాటి పోషక విలువలు చాలా తక్కువగా ఉంటాయి. వీటిలో కేలరీలు చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే మీ బరువు ఎంత త్వరగా పెరుగుతుందో మీరు గమనించలేరు. కాబట్టి.. బరువు తగ్గాలనుకుంటే.. వీటిని పూర్తిగా ఆపేయడం మంచిది. బదులుగా, జ్యూస్, నిమ్మరసం తాగండి. ఇంట్లో తయారుచేసిన ఆహారాన్ని మాత్రమే తీసుకోండి.

ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం:
బరువు తగ్గడానికి, తృణధాన్యాలు, పండ్లు , కూరగాయలు వంటి ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోండి. వీటిని తినడం వల్ల ఆకలి తగ్గుతుంది. ఇది బరువు తగ్గడానికి దారితీస్తుంది. కానీ దీంతో పాటు.. కండరాల నిర్మాణం కోసం గుడ్లు, పప్పులు, చికెన్, పాలు, పెరుగు, టోఫు, సోయా మొదలైన వాటిని తీసుకోండి.

ఎక్కువ సేపు కూర్చోవడం:
బరువు పెరగడానికి గల ప్రధాన కారణాలలో ఒకటి ఎక్కువసేపు కూర్చోవడం. ఆఫీసులో ఎనిమిది గంటలు కూర్చుని పనిచేయడం వల్ల స్థూలకాయం పెరగడమే కాకుండా ఇతర సమస్యలు కూడా వస్తాయి. అందుకే మధ్యలో లేవడం ముఖ్యం. ఎక్కువగా నిలబడటం కేలరీలను బర్న్ చేయడానికి సహాయపడుతుంది.

Also Read: మైగ్రేన్‌ను తగ్గించే.. బెస్ట్ టిప్స్ ఇవే !

ఎక్కువ నీరు త్రాగండి :
తరచుగా నీళ్లు తాగుతూ ఉండండి. కడుపు శుభ్రంగా ఉండటానికి , జీవక్రియను పెంచడానికి రోజంతా కనీసం 8-10 గ్లాసుల నీరు త్రాగటం అవసరం. కాబట్టి.. మీరు కూడా కేవలం నెలలోనే బరువు తగ్గాలని, పూర్తిగా ఫిట్ ఆరోగ్యకరమైన శరీరాన్ని పొందాలనుకుంటే.. ఖచ్చితంగా ఈ ఏడు పద్ధతులను ఒకసారి ప్రయత్నించండి.

Related News

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Big Stories

×