BigTV English

Girl Friend Problem: నా గర్ల్‌ఫ్రెండ్‌కు అది అస్సలు తెలియదు.. ఆమెతో ప్రేమ ప్రయాణం ముందుకు సాగేలా లేదు!

Girl Friend Problem: నా గర్ల్‌ఫ్రెండ్‌కు అది అస్సలు తెలియదు.. ఆమెతో ప్రేమ ప్రయాణం ముందుకు సాగేలా లేదు!

ఇప్పుడు ప్రేమలో పడి పెళ్లిళ్లు చేసుకుంటున్న వారు ఎంతోమంది. పిల్లల్లోనే కాదు ప్రేమికుల్లో కూడా చాలా సమస్యలు ఉంటాయి. అలా ఓ ప్రేమికుడికి ఒక సమస్య వచ్చింది. అదేంటో తెలుసుకోండి.


ప్రశ్న: నేను కాలేజీలో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను. ఆ ప్రేమ ఐదేళ్లపాటు కొనసాగింది. మేము ఉద్యోగాల్లో చేరాము. ఉద్యోగాల కోసం మెట్రో నగరాలకు వచ్చాము. మా ఇద్దరికీ వేరువేరు కంపెనీలలో జాబ్స్ వచ్చాయి. అయితే నా స్నేహితురాలు తను ఊర్లో ఉన్నప్పుడు ఎలా ఉందో… మెట్రో నగరంలో కూడా అలాగే ఉంటుంది. కానీ మా ఆఫీసులో ఉండే అమ్మాయిలు చాలా ఫ్యాషన్‌బుల్ గా ఉంటున్నారు. వారు ట్రెండీ డ్రెస్సింగ్ ఫాలో అవుతున్నారు. వారిని చూశాక నా ప్రేమికురాలికి ఫ్యాషన్ సెన్స్ లేదనిపిస్తోంది. ఆమెను ఎన్నోసార్లు ఫ్యాషన్‌బుల్‌గా ఉండమని కోరాను. ఫ్యాషన్ మ్యాగజైన్‌ను తీసుకెళ్లి ఇచ్చాను. ఫ్యాషన్ గురించి నేర్చుకోమని చెప్పాను. ఎన్నిసార్లు చెప్పినా ఆమె దానికి ఇష్టపడడం లేదు. ఆమె సాంప్రదాయకంగా ఉండేందుకే ఇష్టపడుతోంది. నిత్యం కుర్తా, లెగ్గింగ్స్ లోనే కనిపిస్తుంది. కానీ ఆఫీసులో అందరూ రకరకాల డ్రెస్సులు వేసుకుంటారు. నాకు ఆ డ్రెస్సింగ్ చూసినప్పుడు నా లవర్ కూడా ఇప్పటి ఫ్యాషన్ ట్రెండ్‌ను ఫాలో అవ్వాలని కోరకుంటున్నాను. ఆమెను మార్చడం ఎలా?

జవాబు: మీ సమస్య అర్థమైంది. కాలానికి తగ్గట్టు మీరు మారిపోయారు. కానీ మీ లవర్ మారలేదు. మారాల్సింది ఆమె కాదేమో అనిపిస్తుంది. నగరాన్ని బట్టి మీ ఆలోచనలు, ఇష్టాలు మారిపోతున్నాయి అంటే మీ ప్రేమ మారిపోవడానికి ఎన్ని రోజులు పడుతుందో ఆలోచించుకోండి. ఒక వ్యక్తిని ప్రేమించడం అంటే అతడిలో ఉన్న లోపాలను కూడా ప్రేమించడమే. కానీ మీరు కేవలం ఎదుటివారి ఫ్యాషన్ ట్రెండ్స్ ను చూసి మీ ప్రేమికురాలు మారిపోవాలని కోరుకుంటున్నారు. అలాగే ఆమె కూడా మీలో మార్పులు కోరుకొని ఉంటే ఎలా ఉండేది? ఆమె మెట్రో నగరానికి వచ్చినా కూడా మీలో ఎలాంటి లోపాలను ఎత్తి చూపలేదు.


ఆమె ఆఫీసులో కూడా ఎంతోమంది హ్యాండ్సమ్ అబ్బాయిలు ఉండే ఉంటారు. వాళ్ళతో మిమ్మల్ని పోల్చి మాట్లాడితే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి. ఆమె తన సౌకర్యం చూసుకుని డ్రెస్సింగ్ చేసుకుంటుంది. నిజానికి సౌకర్యాన్ని మించిన అందమైన డ్రెస్సింగ్ ఎక్కడా లేదు. మీరు చెప్పినట్టు శరీర భాగాలు కనిపించేలా డ్రెస్సింగ్ వేసుకోవడమే ఫ్యాషన్ అనుకోకండి. మనకి నచ్చినట్టు మనం డ్రెస్సింగ్ చేసుకోవడమే అసలైన ఫ్యాషన్.

ఒకసారి మీ ఇద్దరూ ఫ్యాషన్ ప్రాధాన్యతల గురించి కూర్చుని మాట్లాడుకోండి. ఆ సమయంలో మీరు నిజాయితీగా మాట్లాడండి. మీకు కేవలం మీ ఆఫీసులో అమ్మాయిల ఫ్యాషన్ సెన్స్ నచ్చుతుందా? లేక ఆ అమ్మాయిలే నచ్చుతున్నారో చెప్పండి. మీ మాటలను బట్టి మీకు వారు వేసుకున్న డ్రెస్సులు కన్నా వారే నచ్చుతున్నట్టు అనిపిస్తోంది. ఇది మీ ప్రేమలో కల్మషాన్ని నింపుతుంది. ఆమెది కల్మషం లేని ప్రేమ. కానీ మీది ఎన్నో మార్పులు కోరుకునే ప్రేమ. వీలైనంతవరకు ఆమె ఇష్టాలకు ప్రాధాన్యం ఇవ్వండి. మీరు ఎలా మీకు నచ్చినట్టు ఉంటున్నారో… ఆమె కూడా ఆమెకు నచ్చినట్టు ఉండే అవకాశాన్ని ఇవ్వండి.

Also Read: భార్యభర్తలు ముద్దు పెట్టుకోవడం మానేస్తే? ఓ మై గాడ్.. ఇలా జరుగుతోందా?

మీకు నచ్చిన దుస్తులు ఆమె ధరించాలని కోరుకుంటే… ఆమెకు నచ్చినట్టు మీరు కూడా మారాలని తెలుసుకోండి. ఆమె ఎంపికలను గౌరవించడం ముందుగా అలవాటు చేసుకోండి. ఆమె శైలి ఆమె ఇష్టం. అది ఆమె వ్యక్తిత్వం. మీరు ఆమెలో మార్పును కోరుకుంటున్నారంటే… మీ ప్రేమలోనే మార్పు వస్తుందేమో అని ఆలోచించాలి. మెట్రో నగరంలో కూడా ఆమె తన ఇష్టాలను, అభిప్రాయాలను మార్చుకోకుండా జీవిస్తోందంటే ఆమె నిజమైన మనిషి. ఆమె ప్రేమ కూడా నిజం. ఆమె ఎప్పటికైనా అంతే పద్ధతిగా జీవిస్తుంది అన్నది కూడా నిజం. అలాంటి వ్యక్తి దొరికినందుకు మీరు సంతోషించకుండా… లోపాలు ఎత్తి చూపించడం ఆశ్చర్యంగా ఉంది. మారాల్సింది మీ ప్రేమికురాలు… కాదు మీరే.

Related News

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Tan Removal Tips: ముఖం నల్లగా మారిందా ? ఇలా చేస్తే.. క్షణాల్లోనే గ్లోయింగ్ స్కిన్

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Big Stories

×