ముద్దు అనేది ప్రేమకు ఒక రూపం. దీన్ని ప్రేమ వ్యక్తీకరణగా చెప్పుకుంటారు. ఇద్దరు వ్యక్తులు సన్నిహిత సంబంధంలో ఉన్నప్పుడు అవతల వ్యక్తి మీద ఉన్న బాధ్యతను, ప్రేమను ఇలా ఒక ముద్దు రూపంలో చూపిస్తారు. ముఖ్యంగా భార్యాభర్తలు ప్రతిరోజూ ఒకసారి కౌగిలించుకోవడం ముద్దు పెట్టుకోవడం చాలా అవసరమని అధ్యయనాలు చెబుతున్నాయి. నిజానికి అన్యోన్యంగా ఉన్న దంపతులు ప్రతిరోజూ కౌగిలించుకోవడం ముద్దు పెట్టుకోవడం వంటివి చేస్తూనే ఉంటారని అధ్యయనాలు వివరిస్తున్నాయి. అయితే ఒక జంట ప్రతిరోజూ ఒక్కసారి కూడా ముద్దు పెట్టుకోకుండా ఉన్నారంటే వారి మధ్య అనుబంధం దెబ్బతిందని అర్థం చేసుకోవాలి.
కమ్యూనికేషన్ తగ్గిపోతుంది
ముద్దు పెట్టుకోవడం మానేసిన జంటలలో కమ్యూనికేషన్ కూడా దెబ్బతింటుంది. వారు ప్రాథమిక విషయాలను కూడా కమ్యూనిటీ చేసుకోలేరు. కమ్యూనికేషన్ దెబ్బతినడం వల్ల ఎన్నో సమస్యలు వస్తాయి. వారి బంధం విడిపోయే అవకాశం కూడా ఉంది.
ఆత్మీయత తగ్గుతుంది
భార్యాభర్తలు ముద్దు పెట్టుకోవడం ద్వారా ఇలా ప్రేమను వ్యక్తీకరించుకోవడం చాలా అవసరం. ఇది వారి మధ్య సాన్నిహిత్యాన్ని విపరీతంగా పెంచుతుంది. ఎప్పుడైతే కనీసం ఒక ముద్దుకు కూడా ఇద్దరూ నోచుకోరో… అది వారి అనుబంధాన్ని చంపేస్తుంది. ఒకరిపై ఒకరికున్న కోరికను కూడా పూర్తిగా తగ్గించేస్తుంది. ప్రేమించాలనే ఉద్దేశాన్ని కూడా మాయం చేస్తుంది. వారి మధ్య ఉన్న ఆత్మీయత పూర్తిగా దెబ్బతింటుంది.
అభద్రతా భావం
అనుబంధంలో ఉన్న ఇద్దరు వ్యక్తులు ఒకరికొకరు ముద్దు పెట్టుకోవడం మానేస్తే ఆ ఇద్దరికీ కూడా తమ బంధంలో అభద్రతాభావం వచ్చేస్తుంది. ఆ అభద్రత భావం వారి అనుబందాన్ని పూర్తిగా దెబ్బతీస్తుంది. ఒకరి మీద ఒకరు ఆధారపడడం అనేది తగ్గిపోతుంది. దీనివల్ల వారి దారులు వేరయ్యే అవకాశం ఉంది.
ట్రస్ట్ ఇష్యూస్
ముద్దు అనేది ప్రేమతో కమ్యూనికేట్ చేసే పద్ధతి. కేవలం భార్యాభర్తలే కాదు తల్లీ బిడ్డ, తండ్రి కూతురు… ఇలా ఎవరైనా కూడా నుదుటి మీద ఒక ముద్దుతో తమ ప్రేమను, బాధ్యతను గుర్తు చేసుకోవచ్చు. సన్నిహిత సంబంధంలో ఉన్న ఇద్దరు వ్యక్తులు ఒకరికొకరు కనీసం ముద్దు కూడా పెట్టుకోవట్లేదంటే వారి మధ్య ట్రస్ట్ సమస్యలు కూడా పెరిగిపోతాయి. వారు వేరే వారికి ఆకర్షితులు అవుతున్నారేమో అనే అనుమానం ఎదుటివారిలో వస్తుంది. అలాగే వారు అలా ఆకర్షితులయ్యే అవకాశాలు కూడా ఎక్కువే. కాబట్టి ప్రతిరోజూ భార్యాభర్తలు ప్రేమగా కౌగిలించుకోవడం, బాధ్యతగా ముద్దు పెట్టుకోవడం ఎంతో అవసరం.
Also Read: నా భార్యకు అలాంటి బుద్ధి ఉంటుందని అనుకోలేదు.. నా సహోద్యోగులతో అలా చేస్తోంది
భార్యాభర్తల మధ్య ఉండే ముద్దుకు, కౌగిలింతకు ఉండే పవర్ ఇంతా అంతా కాదు. అది ప్రేమను సజీవంగా ఉంచుతుంది. ఒకరిపై ఒకరికి ఉన్న ఆప్యాయతను తెలియజేస్తుంది.
ముద్దు పెట్టినప్పుడు లేదా కౌగిలించుకున్నప్పుడు మెదడులో ఆనంద హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి శరీరం మొత్తానికి సాంత్వన ఇస్తాయి. మీరు ప్రశాంతంగా జీవించేందుకు కావలసిన పరిస్థితులను కల్పిస్తాయి. ఇది కేవలం మానసిక ఆరోగ్యానికే కాదు శారీరక ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. అలాగే ముద్దు శరీరంలో సెరటోనిన్, ఎండార్పిన్ వంటి హార్మోన్లు విడుదలయ్యేలా చేస్తాయి. ఇవన్నీ కూడా మన ఆరోగ్యానికి ఎంతో ముఖ్యం. భార్యాభర్తలు ఇద్దరూ శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి. అంటే ప్రతిరోజూ ప్రేమగా ఒక ముద్దు, ఒక కౌగిలింత ఎంతో ముఖ్యం.