Password Security : కొన్ని పాస్ వర్డ్స్ హ్యాకర్స్ కు బహిరంగ ఆహ్వానమని తెలుసా.. ఎంతో తేలిగ్గా ఉపయోగించే ఈ పాస్వర్డ్స్ హ్యాకర్స్ కు మీరు ఇచ్చే టిప్స్ లాంటివే. నిజానికి ఏ ఖాతాకైనా పట్టిష్టమైన పాస్వర్డ్ ఉండాల్సిందే. అలా కాకుండా తేలిగ్గా ఉండే కొన్ని రకాల పాస్ వర్డ్స్ ని ఉపయోగిస్తే కచ్చితంగా అకౌంట్ హ్యాక్ అవ్వడంతో పాటు డేటా సైతం వారి చేతికి వెళ్లిపోయే అవకాశం ఉంటుంది. మరి అసలు ఆ పాస్వర్డ్స్ ఏంటి.. ఎలాంటివి ఎక్కువ ప్రమాదమో అనే విషయంపై ఓ లుక్కేద్దాం.
NordPass తాజాగా చేసిన పరిశోధనలో ప్రపంచంలో అత్యధికమంది సాధారణంగా ఉపయోగించే పాస్వర్డ్స్ ను ఉపయోగిస్తున్నారని.. దీనివల్లనే అతి తక్కువ కాలంలోనే అకౌంట్స్ హ్యాక్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. భారత్ లో సైతం ఈ సంఖ్య ఎక్కువగానే ఉందని.. అత్యంత తేలికగా గుర్తించగలిగి, హ్యాక్ చేయగలిగే పాస్వర్డ్స్ ను ఉపయోగిస్తున్నారని.. ఇలాంటి విషయంలో కచ్చితంగా అప్రమత్తంగా ఉండాలని చెప్పుకువచ్చింది. ఇక అత్యధికంగా ఉపయోగించే పాస్‌వర్డ్స్ జాబితాలో ‘123456’, తర్వాత ‘123456789’ ఉందని.. ” PASSWORD” కూడా ఉందని తెలిపింది. ఈ సాధారణ పాస్ వర్డ్స్ హ్యాకర్లు సులభంగా ఊహించడం ద్వారా మీ వ్యక్తిగత, కార్యాలయ ఖాతాలను ప్రమాదంలో పడేస్తాయని తెలిపింది.
ఇంకా భారత్ లో INDIA123, Abcd1234, ADMIN లాంటి పాస్ వర్డ్స్ ఉపయోగిస్తున్నారని… ఇవి గుర్తుంచుకోవడం సులభం అయినప్పటికీ, అవి హ్యాకర్స్ బ్రేక్ చెయ్యటానికి సైతం సులభంగా ఉన్నాయని తెలిపింది. ముఖ్యంగా, ” PASSWORD” అనేది భారతదేశంలో అత్యధికంగా ఉపయోగించే రెండవ పాస్‌వర్డ్. ఇది ఇప్పటికీ UK, ఆస్ట్రేలియా సహా ఇతర దేశాలలో ఎక్కువగా కనిపిస్తుంది.
ప్రమాదంలో కార్పొరేట్ అకౌంట్స్ –
‘newmember‘ or ‘admin‘ వంటి డిఫాల్ట్ పాస్‌వర్డ్‌లు సాధారణంగా ఉపయోగించటంతో గణనీయమైన సంఖ్యలో కార్పొరేట్ ఖాతాలు ప్రమాదంలో పడిపోతున్నాయని ఈ అధ్యయనం తెలిపింది. చాలా మంది ఉద్యోగులు వ్యక్తిగత, పని సంబంధిత ఖాతాల కోసం ఒకే పాస్‌వర్డ్‌లను ఉపయోగిస్తున్నారని… దీని వలన వారి మొత్తం డిజిటల్ లైఫ్ సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కుతుందని తెలిపింది. .
పెరుగుతున్న ముప్పు –
ప్రపంచంలోని అత్యంత సాధారణ పాస్‌వర్డ్‌లలో దాదాపు 78 శాతం సెకనులోపు చేధించే విధంగా ఉంటున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది గత సంవత్సరం కంటే ఈ ఏడాది గణనీయంగా పెరిగిందని దాదాపు 70 శాతం చేరిందని తెలిపింది. ఈ ట్రెండ్ పాస్‌వర్డ్ భద్రత ఎంత దీన స్థితిలో ఉందో తెలుపుతుందని NordPass తెలిపింది. మిలియన్ల మంది ఇప్పటికీ సాధారణ పాస్ వర్డ్స్ ఉపయోగిస్తున్నారని.. ఇది హ్యాకర్‌లు ఖాతాలను హ్యాక్ చెయ్యటానికి సహకరిస్తుందని తెలిపింది.
మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవాలంటే –
హ్యాకర్స్ కు లక్ష్యంగా మారకుండా ఉండటానికి, నిపుణులు కనీసం 20 అక్షరాలతో సంఖ్యలు, అక్షరాలు, ప్రత్యేక చిహ్నాలు ఉండే పాస్ వర్డ్స్ ను ఉపయోగించాలని తెలుపుతన్నారు. వివిధ సైట్‌లలో పాస్‌వర్డ్‌లను మళ్లీ మళ్లీ ఉపయోగించడాన్ని ఆపేయాలని.. అదనపు రక్షణ కోసం డిఫరెంట్ పాస్ వర్డ్స్ ఉపయోగించాలని చెప్పుకొస్తున్నారు. డిజిటల్ భద్రతను రిస్క్ చేయవద్దని… పాస్‌వర్డ్‌లను మరింత పటిష్టంగా మార్చుకోవాలని సూచిస్తున్నారు.
ALSO READ : మీ ఆధార్ ను ఎవరైనా ఉపయోగించారని అనుమానమా! హిస్టరీ చెక్ చేసేయండిలా