E-Paper
Advertisement

నెయ్యి లేకుండా మైసూర్ పాక్! ఇంట్లోనే స్వీట్ షాప్ టేస్ట్‌

నెయ్యి లేకుండా మైసూర్ పాక్! ఇంట్లోనే స్వీట్ షాప్ టేస్ట్‌
Advertisement

Mysore pak recipe: స్వీట్ షాప్‌లోకి వెళ్లగానే.. నోరూరించే వేడి వేడి, గుల్లగా ఉండే మైసూర్ పాక్ చూస్తే ఎవరికైనా తినాలనిపిస్తుంది. కానీ.. మైసూర్ పాక్ అంటే బోలెడంత నెయ్యి పడుతుంది కదా అని చాలా మంది ఇంట్లో చేయడానికి వెను కాడుతుంటారు. మరి నెయ్యి వాడకుండా.. కేవలం కుకింగ్ ఆయిల్‌తోనే పర్ఫెక్ట్ గుల్ల టెక్స్చర్, స్వీట్ షాప్ రుచి వచ్చేలా మైసూర్ పాక్ చేయొచ్చా? ఖచ్చితంగా చేయొచ్చు! తక్కువ.. ఖర్చుతో, సూపర్ ట్రెండీగా ఇంట్లోనే గుల్ల మైసూర్ పాక్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

మన దేశంలో పండగలు, వేడుకలు లేదా అప్పుడప్పుడు స్వీట్ తినాలనిపించినప్పుడు మైసూర్ పాక్ ఎప్పుడూ టాప్ లిస్ట్‌లో.. ఉంటుంది. ముఖ్యంగా మధ్యలో గుల్లగా ఉండి, అంచులు చక్కగా కాలి, నోట్లో వేయగానే.. కరిగిపోయే స్వీట్ షాప్ స్టైల్ మైసూర్ పాక్ అంటే.. అందరికీ ఇష్టం. నెయ్యి ధరలు ఎక్కువగా ఉన్న ఈ రోజుల్లో, నెయ్యి లేకుండా కూడా అచ్చం అలాంటి రుచిని ఇంట్లోనే తీసుకురావడం ఒక స్మార్ట్ కిచెన్ హ్యాక్ లాంటిది.

కావాల్సిన పదార్థాలు:

Advertisement

శనగపిండి –1 కప్పు

పంచదార – 1.5 నుంచి 2 కప్పులు

Advertisement

నీళ్లు – ముప్పావు కప్పు

రిఫైండ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ లేదా గ్రౌండ్‌నట్ ఆయిల్ – 1 కప్పు

యాలకుల పొడి – అర టీస్పూన్

తయారుచేసే విధానం:

1. ముందుగా ఒక ప్లేట్ లేదా కేక్ టిన్‌కు కొద్దిగా నూనె రాసి సిద్ధంగా ఉంచుకోండి. మైసూర్ పాక్ వేసిన వెంటనే సెట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇదంతా ముందుగానే రెడీగా ఉండాలి.

2.ఒక గిన్నెలో జల్లించిన శనగపిండి వేసి, కొద్ది కొద్దిగా నూనె పోస్తూ ఉండలు లేకుండా స్మూత్ బ్యాటర్‌లా కలుపుకోండి. శనగపిండిని జల్లించడం వల్ల పిండిలో గాలి చేరి స్వీట్ గుల్లగా రావడానికి సహాయ పడుతుంది.

3. మందపాటి కడాయిలో పంచదార, నీళ్లు వేసి స్టవ్ మీద పెట్టండి. పంచ దార పూర్తిగా కరిగి, తీగ పాకం వచ్చే వరకూ మరిగించండి. (పాకం మరీ ముదురుగా కాకుండా.. జిగురుగా, లేత తీగ వచ్చేలా చూసుకోవాలి).

4. పాకం సిద్ధమైన తర్వాత మంటను లో-టు-మీడియం ఫ్లేమ్‌లో ఉంచి, కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని వేసి వేగంగా కలపండి. మరో స్టవ్ మీద మిగిలిన నూనెను బాగా వేడి చేయండి.

Also Read: నానబెట్టే పని లేకుండా ఇన్‌స్టంట్ రాగి అట్టు..ఇలా చేస్తే అదిరిపోయే రుచి

5. తర్వాత వేడివేడి నూనెను గరిటెతో కొద్ది కొద్దిగా కడాయిలోని మిశ్రమంలో.. పోస్తూ నిరంతరం కలుపుతూ ఉండాలి. వేడి నూనె పోసినప్పుడల్లా.. మిశ్రమం నురగలా పొంగుతూ, గుల్లగా మారుతుంది. నూనె పూర్తిగా పీల్చుకున్న తర్వాత మరో గరిటె నూనె వేయాలి.

6.మిశ్రమం కడాయి అంచులను వదిలి, రంగు మారి, నురగలా గుల్లగా కనిపించిన వెంటనే స్టవ్ ఆఫ్ చేయండి. వెంటనే.. ముందుగా సిద్ధం చేసుకున్న ప్లేట్‌లోకి పోసి, పైభాగాన్ని సున్నితంగా సమానం చేయండి. పైన గరిటెతో ఎక్కువగా నొక్కకూడద. నొక్కితే గుల్ల తగ్గిపోతుంది.

7. సుమారు 10–15 నిమిషాలు ఆగిన తర్వాత (పూర్తిగా చల్లారకముందే, గోరు వెచ్చగా ఉన్నప్పుడే) మీకు నచ్చిన సైజులో ముక్కలుగా కట్ చేసుకోండి. పూర్తిగా చల్లారిన తర్వాత ముక్కలను విడదీయండి.

నెయ్యి లేకుండానే.. ఇంత ఈజీగా, మైసూర్ పాక్ చేసు కోవచ్చని తెలిస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. ఈ వీకెండ్ లేదా స్పెషల్ రోజున తప్పకుండా ట్రై చేసి, ఇంట్లో వాళ్లందరికీ సర్‌ప్రైజ్ ఇవ్వండి.

Related News

లెమన్ ఫిష్ రెసిపీ..తక్కువ మసాలాలతో అద్భుతమైన రుచి!

బంగాళదుంప వేపుడు కరకరలాడుతూ రావాలా? ఈ సీక్రెట్ టిప్స్ ఫాలో అవ్వండి!

అచ్చం 5 స్టార్ హోటల్ రుచి.. చాలా సింపుల్‌గా ముర్గ్ మలై కోఫ్తా!

ఇంటికి అతిథులు వచ్చినప్పుడు ఈ స్పెషల్ ‘బ్యాంగ్ బ్యాంగ్ చికెన్’ చేసి పెట్టండి.. ఫిదా అయిపోతారు!

పొగమంచులో డ్రైవింగ్ చేస్తున్నారా?ఈ తప్పులు చేస్తే ప్రమాదమే..జాగ్రత్త!

మీ గ్యాస్ సిలిండర్ నెల కూడా రావడం లేదా? కారణాలివే కావొచ్చు!

వాటర్ ట్యాంక్‌లోని.. నీరు ఎన్ని రోజుల వరకూ తాగొచ్చు?

Big Stories

Advertisement
×