E-Paper
Advertisement

సన్నీ డియోల్ ఇంటికి సచిన్ కూతురు కోడలిగా ..పెళ్లి వార్తలు వైరల్!

సన్నీ డియోల్ ఇంటికి సచిన్ కూతురు కోడలిగా ..పెళ్లి వార్తలు వైరల్!
Advertisement

Rajveer Deol Wedding Rumours:సన్నీ డియోల్ చిన్న కొడుకు రాజ్‌వీర్ డియోల్, సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారనే టాక్ ఇపుడు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. గతంలో గిల్ తో ఈ భామ ప్రేమాయణం నడిపిందన్న వార్తలు రాగా తాజాగా సారా రాజ్ వీర్ డియోల్ ని పెళ్లి చేసుకోబోతుంది అన్న వార్త ఇపుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ వార్తలపై ఇరు వర్గాల నుండి ఎలాంటి అనౌన్స్ మెంట్ రాకపోవడం ఇక్కడ గమనార్హం.

రాజ్‌వీర్ డియోల్ విషయానికి వస్తే సన్నీ డియోల్ చిన్న కొడుకుగా ఇండస్ట్రీలోకి ఇచ్చిన ఈ స్టార్ కిడ్ 2023లో వచ్చిన ‘దోనో’ సినిమాతో హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యాడు. ఈ సినిమాలో పలోమా ధిల్లాన్ హీరోయిన్‌గా నటించగా, రాజశ్రీ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ రొమాంటిక్ డ్రామాకు అవ్నీష్ బర్జాత్య దర్శకత్వం వహించారు. ప్రేమ, స్నేహం, ఫ్యామిలీ ఎమోషన్స్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టినా రాజ్‌వీర్ మాత్రం తన నటనతో అందరిని తన వైపు తిప్పుకున్నాడనే చెప్పాలి.

Advertisement

ఇక సన్నీ డియోల్ గతంలో ‘ఘాయల్’, ‘దామిని’, ‘గదర్’ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న సంగతి తెల్సిందే. రీసెంట్‌గా ‘గదర్ 2’ హిట్‌తో మరోసారి తన సత్తా చాటారు కూడా. అలాంటి స్టార్ ఫ్యామిలీకి చెందిన రాజ్‌వీర్ ఇపుడు సారా తో రియల్ లైఫ్ లో జోడీ కట్టబోతున్నాడన్న వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి.

ఇక సారా టెండూల్కర్ విషయానికి వస్తే సచిన్ కుమార్తెగా అందరికి తెలిసిన ఈ అమ్మడు ప్రస్తుతం స్టడీస్ కంప్లీట్ చేసుకుని బిజినెస్, సోషల్ యాక్టివిటీస్‌పై ఫోకస్ చేసే పనిలో పడింది. ముఖ్యంగా తన ఫ్యాషన్ సెన్స్, లైఫ్‌స్టైల్ పోస్టులతో వార్తల్లో నిలుస్తు ఉంటుంది కూడా.

Advertisement

అయితే గతంలో గిల్ తో ప్రేమాయణం అంటూ వార్తలు సోషల్ ,మీడియాలో తెగ చక్కర్లు కొత్తగా ఇప్పుడు రాజ్‌వీర్ డియోల్‌తో పెళ్లి జరగబోతోందనే వార్తలు కూడా అలాగే వైరల్ అవుతున్నాయి.పైగా వీరిద్దరి పెళ్లి 2027లో అంటూ ఇప్పటికే ముహూర్తాలు పెట్టేస్తున్నారు నెటిజన్లు.

అయితే అప్పుడు ఎలాంటి రియాక్షన్స్ ఇవ్వని సారా తాజాగా కూడా మౌనాన్నే ఆశ్రయించడం విశేషం.చూడాలి మరి సర్క్యులేట్ అవుతున్నట్టుగా వీరి పెళ్లి నిజంగానే జరుగుతుందా లేక కేవలం వార్తలకే పరిమితం అవుతాయా !

ALSO READ:జానపదానికి డీజే టచ్.. మాధురి రాథోడ్ స్టెప్పులు, ఎక్స్‌ప్రెషన్స్ అదిరిపోయాయ్ గా !

Tags

Related News

60 ఏళ్లు దాటితే టికెట్ అక్కర్లేదా? ‘ఆలోచన’ టీమ్ సర్‌ప్రైజ్!

నన్ను క్షమించు.. ఒప్పుకోక తప్పడం లేదు: నభా నటేష్!

స్నానం చేసేటప్పుడు కల్లు ఉప్పు వేసుకొని చేస్తా : సంయుక్త మీనన్!

ఆకాశంలో ఒక తార.. సాత్విక వీరవల్లి రెమ్యూనరేషన్ ఎంతంటే?

2027సంక్రాంతి బరిలో పోటీ పడబోతున్న చిత్రాలివే!

ఎల్లో డ్రెస్సులో సందీపా ధర్ గ్లామర్ ట్రీట్..ఆ ఒక్క లైన్‌తో నెట్టింట ట్రెండింగ్!

కృష్ణతో సినిమా మధ్యలోనే ఆగిపోయింది.. అసలు కారణం చెప్పిన డైరెక్టర్!

Big Stories

Advertisement
×