E-Paper
Advertisement

సీనియర్ నటుడు సుధాకర్ కొడుకును చూశారా.. అచ్చం తండ్రి పోలికలే!

సీనియర్ నటుడు సుధాకర్ కొడుకును చూశారా.. అచ్చం తండ్రి పోలికలే!
Advertisement

Sudhakar Son Benny: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో సీనియర్ నటుడు సుధాకర్(Sudhakar) ఒకరు. ఈయన టాలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్ గా ఎన్నోవందల సినిమాలలో నటించి సక్సెస్ అందుకున్నారు. అయితే తమిళ చిత్ర పరిశ్రమలో హీరోగా ఓ వెలుగు వెలిగిన సుధాకర్ కొన్ని కారణాల వల్ల తమిళ చిత్ర పరిశ్రమ నుంచి తెలుగు ఇండస్ట్రీకి వచ్చారు. ఇక తెలుగులో కమెడియన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సుధాకర్ ఇటీవల వయసు పైబడటంతో సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. ఇక సుధాకర్ ఇండస్ట్రీకి దూరమైనప్పటికీ ఆయన కుమారుడు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.

ఆలోచన సినిమాతో బెన్నీ సినీ ఎంట్రీ..

సుధాకర్ కుమారుడు బెన్నీ(Benny) అందరికీ తెలిసిందే. సుధాకర్ గొప్ప నటుడిగా గుర్తింపు పొందినప్పటికీ ఆయన కొడుకును మాత్రం ఇండస్ట్రీకి చాలా ఆలస్యంగానే పరిచయం చేశారని చెప్పాలి. ఇక సుధాకర్ కొడుకు బెన్నీ త్వరలో “ఆలోచన” అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాలో ఈయన హీరోగా కాకపోయినా ఒక కీలక ప్రాధాన్యత ఉన్న పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమా నవంబర్ 27వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఇటీవల చిత్ర బృందం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా బెన్నీ కూడా పాల్గొని సందడి చేశారు.

జూనియర్ సుధాకర్ అంటూ..

Advertisement

ఈ కార్యక్రమంలో బెన్నీ మాట్లాడుతూ ఆలోచన సినిమాలో నా పాత్ర చాలా కీలకంగా ఉండబోతుందని తనకి ఇలాంటి అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.. ఇక బెన్ని ఈ కార్యక్రమంలో పాల్గొనడంతో ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్న నేపథ్యంలో సుధాకర్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సుధాకర్ కొడుకు బెన్నీ అచ్చం సుధాకర్ మాదిరిగానే ఉన్నారని,  జూనియర్ సుధాకర్ అంటూ బెన్నీ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి ఆలోచన సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్న బెన్నీ ఈ సినిమాలో తన నటన ద్వారా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటారనేది తెలియాల్సి ఉంది.

సుధాకర్ నటించిన సూపర్ హిట్ సినిమాలు..

సుధాకర్ తమిళ చిత్ర పరిశ్రమలో హీరోగా పలు సినిమాలలో నటించి సూపర్ సక్సెస్ అందుకున్నారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈయన తమిళ ఇండస్ట్రీకి గుడ్ బై చెబుతూ తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఇక తెలుగులో సుధాకర్ 1980 లో సృష్టి రహస్యాలు అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక తెలుగులో ఈయన భోగి మంటలు, పట్టుకోండి చూద్దాం, రాజా విక్రమార్క, రాజా, పవిత్రబంధం, సూర్యవంశం, పెళ్లి పీటలు,ఖుషీ, ఊరికిచ్చిన మాట, యముడికి మొగుడు, సుస్వాగతం, శుభాకాంక్షలు వంటి తదితర సినిమాలలో నటించి మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు.

Advertisement

Also Read: నోరు జారడం గురించి మళ్లీ మాట్లాడుకుందాం… త్రిగుణ్ కు క్లాస్ పీకిన నాగార్జున!

Related News

సన్నీ డియోల్ ఇంటికి సచిన్ కూతురు కోడలిగా ..పెళ్లి వార్తలు వైరల్!

60 ఏళ్లు దాటితే టికెట్ అక్కర్లేదా? ‘ఆలోచన’ టీమ్ సర్‌ప్రైజ్!

నన్ను క్షమించు.. ఒప్పుకోక తప్పడం లేదు: నభా నటేష్!

స్నానం చేసేటప్పుడు కల్లు ఉప్పు వేసుకొని చేస్తా : సంయుక్త మీనన్!

ఆకాశంలో ఒక తార.. సాత్విక వీరవల్లి రెమ్యూనరేషన్ ఎంతంటే?

2027సంక్రాంతి బరిలో పోటీ పడబోతున్న చిత్రాలివే!

ఎల్లో డ్రెస్సులో సందీపా ధర్ గ్లామర్ ట్రీట్..ఆ ఒక్క లైన్‌తో నెట్టింట ట్రెండింగ్!

Big Stories

Advertisement
×