Ragi dosa: బిజీ లైఫ్‌లో ఉదయం బ్రేక్ ఫాస్ట్‌కైనా, మధ్యాహ్నం లంచ్‌కైనా.. లేదా రాత్రి డిన్నర్‌కైనా త్వరగా అయిపోయే హెల్తీ రెసిపీ కావాలనిపిస్తుంది కదా! పిండి రుబ్బే టెన్షన్, గంటల తరబడి నాన బెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు రాగి పిండితో అట్టు వేసుకుంటే.. ఆ మజానే వేరు. రాగుల్లో.. ఉండే పోషకాల వల్ల ఇది ఫిట్‌నెస్ ఫ్రీక్స్‌కి.. ఇప్పుడు ఫేవరెట్ అయిపోయింది. వేడి వేడిగా, క్రిస్పీగా.. లేదా సాఫ్ట్‌గా ఏ స్టైల్‌లో వేసినా సూపర్‌గా ఉంటుంది. ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
రాగి పిండిలో క్యాల్షియం, ఫైబర్, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఇది వెయిట్ తగ్గాలనుకునే వాళ్లకి, డయాబెటిస్‌ని జాగ్రత్తగా చూసుకునేవాళ్లకి, పిల్లలకి కూడా చాలా మంచిది.
రాగి పిండి: 1 కప్పు
గోధుమ పిండి లేదా బియ్యప్పిండి: 2 టేబుల్ స్పూన్లు
ఉల్లిపాయ: 1 చిన్నది
పచ్చిమిర్చి: 2
అల్లం తురుము: అర టీస్పూన్
కరివేపాకు, కొత్తిమీర: కొద్దిగా
జీలకర్ర: అర టీస్పూన్
ఉప్పు: రుచికి సరిపడా
నీళ్లు: సరిపడా
నూనె లేదా నెయ్యి: అట్టు కాల్చడానికి తగినంత
1.ముందుగా ఒక బౌల్‌లో రాగి పిండి, గోధుమ పిండి లేదా బియ్యప్పిండి, ఉప్పు, జీలకర్ర వేసి కలపాలి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లి పాయ, పచ్చి మిర్చి, అల్లం తురుము, కరి వేపాకు, కొత్తి మీర వేయాలి. ఇందులో కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ దోసె లేదా అట్టు పిండిలా ఉండలు లేకుండా కలపాలి. పిండి మరీ పల్చగా కాకుండా, మరీ చిక్కగా కాకుండా మీడియం కన్సిస్టెన్సీలో ఉంటే అట్టు ఈజీగా వస్తుంది. స్టవ్ మీద పెనం పెట్టి వేడి చేయాలి. పెనం వేడయ్యాక.. కొద్దిగా నూనె లేదా నెయ్యి వేసి, గరిటెతో.. పిండిని తీసుకుని మధ్యలో వేసి గుండ్రంగా అట్టులా వేసుకోవాలి. మీకు క్రిస్పీగా కావాలంటే.. కొంచెం పల్చగా వేసుకోవచ్చు.
Also Read: కరెంట్ పోతే ఇన్వర్టర్‌పై ఫ్యాన్,టీవీ ఎన్ని గంటలు నడుస్తాయి? పూర్తి వివరాలివిగో!
2.సాఫ్ట్‌గా కావాలంటే కొంచెం మందంగా వేసుకోవచ్చు. అట్టు చుట్టూ కొద్దిగా నూనె లేదా నెయ్యి వేసి మీడియం ఫ్లేమ్‌లో కాల్చాలి. ఒక వైపు కాలిన తర్వాత మెల్లగా రెండో వైపు తిప్పి మరో నిమిషం కాల్చుకోవాలి. అంతే, వేడివేడి రాగి అట్టు రెడీ!
దీన్ని బ్రేక్ ఫాస్ట్‌లో పల్లి చట్నీ లేదా కొబ్బరి చట్నీతో తింటే సూపర్‌గా ఉంటుంది. లంచ్‌లో లేదా డిన్నర్‌లో కొంచెం కారం పొడి, నెయ్యి వేసుకుని తిన్నా, లేదా ఏదైనా మసాలా కర్రీతో సర్వ్ చేసినా నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది.
టైమ్ తక్కువగా ఉన్నప్పుడు బయట జంక్ ఫుడ్ ఆర్డర్ చేసే బదులు, ఇలా పది నిమిషాల్లో.. రాగి అట్టు వేసుకుంటే.. హెల్త్‌కి హెల్త్, టైమ్ సేవింగ్ కూడా. మీరు కూడా ఇప్పుడే ట్రై చేసి, మీ రోజు వారీ మెనూలో ఈ హెల్తీ రెసిపీని యాడ్ చేసుకోండి!