Muscle Growth Natural Supplements| క్రమం తప్పకుండా వ్యాయామం చేసే వారు కండరాల పెరుగుదలను ఆశిస్తారు. కండరాల పెరుగుదల అంటే కండరాల బరువు పెరగడం, కానీ కండరాల ఫైబర్ల సంఖ్య మారకపోవడం. మీ శారీరక లక్ష్యాల ఆధారంగా, కండరాల పెరుగుదలకు సహాయపడే కొన్ని సప్లిమెంట్లను తీసుకోవచ్చు. నిపుణులు సహజమైన సప్లిమెంట్లు తీసుకోవడం మంచిదని సలహా ఇస్తారు. ఈ సప్లిమెంట్లు.. వ్యాయామ రొటీన్, రికవరీ, బలాన్ని మెరుగుపరచడంతో పాటు గాయాల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి. అయిదు సహజ సప్లిమెంట్ల గురించి తెలుసుకుందాం.
1. వే ప్రోటీన్
వే అనేది పాలలో లభించే ప్రోటీన్. ఇందులో కండరాల పెరుగుదలకు అవసరమైన ముఖ్యమైన అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఇది సోయా వంటి ఇతర ప్రోటీన్ ఉత్పత్తుల కంటే త్వరగా జీర్ణమవుతుంది. లూసిన్ అనే అమైనో ఆమ్లం ఎక్కువగా ఉంటుంది. ఇది కండరాల నిర్మాణానికి ఎంతో ఉపయోగపడుతుంది. నిపుణుల ప్రకారం.. వే ప్రోటీన్‌ను వ్యాయామంతో కలిపి స్థిరంగా తీసుకోవడం వల్ల బలం, కండరాల పెరుగుదల మెరుగవుతుంది. సహజంగా వే ప్రోటీన్ పాలు, డైరీ ఉత్పత్తులలో లభిస్తుంది. కానీ దీన్ని పౌడర్లు, బార్లు లేదా షేక్‌ల రూపంలో సప్లిమెంట్‌గా కూడా తీసుకోవచ్చు.
2. బెటైన్
బెటైన్ అనేది మరో నేచురల్ ప్రొటీన్. దీనిని ట్రైమీథైల్‌గ్లైసిన్ అని కూడా పిలుస్తారు. సుగర్ బీట్ జ్యూస్‌లో రసంలో ఉంటుంది. ఇది కండరాల నిర్మాణానికి సహాయపడటమే కాక, శరీరంలో క్రియాటిన్ లెవెల్స్‌ను సహజంగా పెంచి ఎనర్జీని మెరుగుపరుస్తుంది. బాడీబిల్డర్లు, సైక్లిస్టులకు ఇది శక్తివంతమైన పనితీరును అందిస్తుంది. బెటైన్ బీట్‌రూట్, బచ్చలికూర, హోల్ గ్రెయిన్ బ్రెడ్‌లలో సహజంగా లభిస్తుంది. క్యాప్సూల్ లేదా పౌడర్ రూపంలో సప్లిమెంట్‌గా కూడా తీసుకోవచ్చు. సగటున ఆహారం ద్వారా రోజుకు 100-300 మిల్లీగ్రాముల బెటైన్ లభిస్తుంది.
3. క్రియాటిన్
క్రియాటిన్ ఒక అమైనో ఆమ్లం, శరీరంలోని కణాలకు అనేక విధులను నిర్వహిస్తుంది. ఇది కండరాలకు వ్యాయామం సమయంలో ఎనర్జీని అందిస్తుంది. ఈ సప్లిమెంట్లు తీసుకోవడం వల్ల బలం పెరిగి తక్షణ శక్తితో వ్యాయామ సెట్ల సంఖ్యను పెంచే సామర్థ్యానిస్తుంది. మీ లివర్, కిడ్నీలు, ప్యాంక్రియాస్ సహజంగా క్రియాటిన్‌ను ఉత్పత్తి చేస్తాయి. అయితే ఇది మాంసం, చేపలు, సప్లిమెంట్ల ద్వారా కూడా లభిస్తుంది. నిపుణుల ప్రకారం.. వారంలో 20 గ్రాముల క్రియాటిన్ తీసుకోవాలి. ఆ తర్వాత 3-5 గ్రాములు రోజూ రెండు నెలల వరకు తీసుకోవచ్చు.
4. కార్నిటైన్
మీ మెదడు, లివర్, కిడ్నీలు సహజంగా కార్నిటైన్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఇది జీవక్రియలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. వ్యాయామం సమయంలో ఆక్సిజన్ గ్రహణాన్ని, శక్తి ఉత్పత్తిని పెంచుతుంది. కార్నిటైన్ వ్యాయామం తర్వాత కండరాల నొప్పిని తగ్గించి, దెబ్బతిన్న కణాలను రిపేర్ చేస్తూ కండరాల పెరుగుదలను మెరుగుపరుస్తుంది. ఇది మాంసం, చేపలు, కొన్ని మొక్కలలో సహజంగా లభిస్తుంది, కానీ క్యాప్సూల్, టాబ్లెట్, లేదా పౌడర్ సప్లిమెంట్‌గా కూడా తీసుకోవచ్చు. రోజుకు 1-4 గ్రాములు సంవత్సరం వరకు తీసుకోవచ్చు.
5. బ్రాంచ్డ్-చైన్ అమైనో ఆమ్లాలు (BCAAs)
BCAAs అనేవి లూసిన్, ఐసోలూసిన్, మరియు వాలిన్‌ల మిశ్రమం, ఇవి వ్యాయామం సమయంలో శక్తిని అందిస్తాయి మరియు కండరాల పరిమాణం, బలాన్ని పెంచుతాయి. అలాగే వ్యాయామం తర్వాత నష్టం, నొప్పిని తగ్గిస్తాయి. మాంసం, చికెన్, డైరీ ఉత్పత్తులలో ఈ ఆమ్లాలు లభిస్తాయి. అలాగే పౌడర్ సప్లిమెంట్‌గా కూడా తీసుకోవచ్చు. రోజుకు 10-14 గ్రాములు తీసుకోవడం వల్ల కండరాల పెరుగుదలకు ఉపయోగపడుతుంది.
Also Read: పిల్లల్లో షుగర్ వ్యాధి.. ఈ 5 లక్షణాలు కనిపిస్తే డేంజర్
ఈ ఐదు సహజ సప్లిమెంట్లు—వే ప్రోటీన్, బెటైన్, క్రియాటిన్, కార్నిటైన్, BCAAs—కండరాల పెరుగుదల, బలం, వ్యాయామ రికవరీని మెరుగుపరుస్తాయి. వీటిని ఆహారం ద్వారా లేదా సప్లిమెంట్ల రూపంలో తీసుకోవచ్చు. మీ వ్యాయామ లక్ష్యాలను బట్టి, నిపుణుల సలహాతో సరైన మోతాదులో వీటిని ఉపయోగించడం ద్వారా కండరాల ఆరోగ్యాన్ని మెరుగుపరచవచ్చు.