Nirmala Sitharaman Hyderabad House:నిర్మలా సీతారామన్… మన దేశానికే ఆర్ధిక శాఖా మంత్రి అయిన ఈవిడ గురించి పెద్దగా పరిచయం అక్కరలేదు.ఇక ఈవిడ భర్త పరకాల ప్రభాకర్ అన్న సంగతి అందరికీ తెల్సిందే.మరి వీరి ఇంటి విశేషాలు ఏంటో,హైదరాబాద్ లో ఉన్న ఈ ఇంటిని ఎలా డిజైన్ చేసుకున్నారో మనమూ ఒకసారి చూసేద్దాం.
మాములుగా పొలిటీషియన్స్ ఇళ్లంటే ఎంత పెద్ద హంగూ ఆర్భాటాలు ఉంటాయో స్పెషల్ గా చెప్పక్కర్లేదు. పైగా దేశ విదేశాల నుండి తెప్పించిన ఇంటీరియర్ థింగ్స్ తో చాలా హడావిడిగా కనిపిస్తుంది.కానీ నిర్మలా సీతారామన్ ఇల్లు అందుకు భిన్నంగా ప్రకృతిగా దగ్గరగా గోదావరి జిల్లాలలో కనిపించే ఒక అందమైన మండువా ఇంటిలా తీర్చిదిద్దడం విశేషం.
ఒక శిల్పారామంలా అనుభూతి
ముఖ్యంగా ఇంటిని బాగా పరిశీలిస్తే బాల్కనీ, స్తంభాలు, ముంగిళ్లు వంటి వాటిని సాంప్రదాయ బద్దంగా ,ఒక శిల్పారామంలా ఉన్నామా అన్నట్టుగా డిజైన్ చేయడం మెచ్చుకోతగ్గ విషయం,పైగా ఇంటి చుట్టూ పచ్చదనం, కొండలలాంటి వాతావరణం ఉండటం వల్ల ప్రశాంతమైన అనుభూతి కలుగుతుందనడం లో సందేహం లేదు.
ఇందిరా గాంధి వంటి ప్రముఖులతో దిగిన ఫోటోలు కూడా
ఇక ఇంటి నిర్మాణంలో భాగంగా పాతకాలపు పెంకుటిళ్ల తీరున అమర్చిన దూలాలు, చెక్క స్తంభాలు, గుమ్మాల ముందు వేసిన ముగ్గులు వంటివి నిర్మలా సీతారామన్ యొక్క అభిరుచిని ప్రతిబింబిస్తుందని చెప్పాలి. ఇక ఇంట్లోని గోడలపై ప్రముఖుల ఫోటోలని కూడా చూడొచ్చు.నిర్మలా సీతారామన్ భర్త పరకాల ప్రభాకర్ తండ్రి MLA గా మినిస్టర్ గా పని చేయడంతో వారు ఇందిరా గాంధి వంటి ప్రముఖులతో దిగిన ఫోటోలు కూడా ఆ గోడలపై దర్శనమిస్తాయి.
ఒక క్రమశిక్షణతో లైఫ్ ని లీడ్
ఇక ఈ ఇంట్లోకి అడుగుపెట్టగానే ఎవరినైనా బాగా ఆకట్టుకునేది ఏదైనా ఉందంటే అది పరకాల ప్రభాకర్ పర్సనల్ లైబ్రరీ అని చెప్పవచ్చు. రాజకీయం, ఆర్థిక శాస్త్రం, అంతర్జాతీయ సంబంధాలు, చరిత్ర, తత్వశాస్త్రం, సాహిత్యం ఇలా అనేక రకాల రంగాలకు చెందిన వేలాది పుస్తకాలు ఇక్కడ ఒక క్రమ పద్దతిలో సర్దటం చూస్తుంటే వీరికి విరివిగా చదివే అలవాటుతో పాటు ఒక క్రమశిక్షణతో లైఫ్ ని ఎలా లీడ్ చేస్తారో అర్థం అవుతుంది.
ప్రతి పుస్తకానికి ఒక స్పెషల్ నంబర్
ఇక అలమారాలో సర్దిన వేల పుసకాల విషయానికి వస్తే ప్రతి పుస్తకానికి ఒక స్పెషల్ నంబర్ కేటాయించి, అవసరమైనప్పుడు సులభంగా వెతికి తీసుకునేలా కేటలాగ్ సిస్టం ని సెట్ చేయడం మెచ్చుకోతగ్గ విషయం. అంటే ఏ బుక్ కావాలన్నా ఇలా నెంబర్ చెబితే ఈజీగా తీసుకోవచ్చన్నమాట.ఇక తనకున్న పెద్ద ఆస్తి ఇదేనని ,తాను ఇల్లు తాళం వేయకుండా ఇలాగే వదిలేసి వెళ్ళినా ఎవరూ కనీసం వీటిని దొంగిలించరని సరదాగా ఈ హోమ్ టూర్ లో చెప్పుకొచ్చారు పరకాల ప్రభాకర్ .
అనుబంధాలకి కూడా అదే స్థాయిలో ఇంపార్టెన్స్
అయితే ఇంట్లో పుస్తకాలకి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో అలాగే తమకి జ్ఞాపకాలుగా మిగిలిన టైప్ రైటర్ లని, టైప్ మిషిన్ లని కూడా జాగ్రత్తగా సర్దడం,అలాగే తమ కుటుంబ జ్ఞాపకాల్ని బందించిన ఫోటోలకి ప్రముఖంగా స్థానం ఇవ్వడం చూస్తే జ్ఞానంతో పాటు అనుబంధాలకి కూడా అదే స్థాయిలో ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు అర్థమవుతుంది.
మొత్తంగా చూస్తే దేశానికి ఒక ఆర్థిక మంత్రి హోదాలో ఉన్నప్పటికీ విలాసవంతమైన లగ్జరీకి పోకుండా సాంప్రదాయ బద్దంగా తన ఇంటిని డిజైన్ చేసుకోవడం నిజంగా మెచ్చుకోతగ్గ విషయం !