E-Paper
Advertisement

రాజన్న గుడికి కాంక్రీటా?.. భక్తుల విశ్వాసాలను దెబ్బతీయొద్దు.. కల్వకుంట్ల కవిత ఫైర్

రాజన్న గుడికి కాంక్రీటా?.. భక్తుల విశ్వాసాలను దెబ్బతీయొద్దు.. కల్వకుంట్ల కవిత ఫైర్
Advertisement

Vemulawada Temple: వేములవాడ రాజన్న గుడిని కాంక్రీట్ తో నిర్మిస్తూ భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నారని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఆగమ శాస్త్రం ప్రకారం కృష్ణశిలలతో వెయ్యేళ్లు నిలిచేలా ఆలయాన్ని నిర్మించాలని డిమాండ్ చేశారు. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆమె పర్యటించారు. వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆలస్యమైన సరే భక్తుల మనోభావాలకు అనుగుణంగా ఆగమశాస్త్రం ప్రకారం వేములవాడ రాజన్న గుడిని నిర్మించాలని కోరారు.

రాజన్న కోడెలు చనిపోతున్నప్పటికీ పట్టించుకోవటం లేదని వాటికి సరైన పశుగ్రాసం అందించటం లేదని ఈ సందర్భంగా కవిత వ్యాఖ్యానించారు. కోడె మొక్కులకు ప్రసిద్ధి చెందిన వేములవాడ ఆలయంలో కోడెలకు ఇలాంటి దయనీయ పరిస్థితి మంచిది కాదని చెప్పారు. కోడెలు చనిపోతే శాస్త్ర ప్రకారం అంత్యక్రియలు కూడా జరిపించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. మాట్లాడితే హిందూత్వ అనే బండి సంజయ్ ఈ విషయంలో ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. కేంద్ర మంత్రిగా ఉండి కూడా ప్రసాద్ స్కీమ్ లో దక్షిణ కాశీగా ప్రశస్తి పొందిన వేములవాడ ఆలయాన్ని చేర్చలేదని.. రాజన్న ఆలయానికి ఆయన ఒక్క రూపాయి కూడా తేలేదని దీనిపై సంజయ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

Advertisement

కాళేశ్వరం ప్రాజెక్టుతో సిరిసిల్ల, వేములవాడకు ఎంతో ప్రయోజనం దక్కాలని.. కానీ ఒక్క ఎకరాకు కూడా నీళ్లు రాలేదని చెప్పారు. రుద్రంగిలో 2018లో శంకుస్థాపన చేసిన రిజర్వాయర్ ను పదేళ్లైనా పూర్తి చేయలేదన్నారు. అది పూర్తైతే 63 వేల ఎకరాలకు నీళ్లొస్తాయన్నారు. దూమ్ పేట్ వద్ద రిజర్వాయర్ కట్టి లిప్ట్ చేస్తే కథలాపూర్, మేడిపల్లికి నీళ్లు వస్తాయన్నారు. ఎర్రకుంట, పటేళ్ల చెరువును కలిపి అక్కడ రిజర్వాయర్ కడితే వేములవాడ, చందుర్తి, కోనరావు పేట మండలాలకు నీళ్లు వచ్చే అవకాశం ఉందన్నారు. తెలంగాణ వచ్చి 13 ఏళ్లైనా ఇలాంటి పరిస్థితి ఉండటం అన్యాయమన్నారు. మిడ్ మానేర్, అప్పర్ మానేర్ లింక్ పనులను పూర్తి చేయాలని.. అది పూర్తి చేస్తే లక్షా 10 వేల ఎకరాలకు నీళ్లు ఇవ్వవచ్చని చెప్పారు.

Also Read: రూ15,000 లోపే 6000mAh బ్యాటరీ, డ్యూయల్ స్క్రీన్.. హానర్ కొత్త ఫోన్ లాంచ్!

Advertisement

సిరిసిల్లలోని సెస్ లో జరిగిన రూ.32 కోట్ల అవినీతిపై ప్రభుత్వం విచారణ జరిపించాలని కవిత డిమాండ్ చేశారు. కేటీఆర్ మంత్రిగా ఉన్న సమయంలో ఈ అవినీతి జరిగిందని.. దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు విచారణ జరపటం లేదని ప్రశ్నించారు. సెస్ లో జరిగిన అవినీతి బయట పడకుండా ఉండేందుకు సరిగ్గా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇక్కడ అగ్నిప్రమాదం జరిగిందని గుర్తు చేశారు. ఆ ప్రమాదంలో ఫైల్స్ అన్ని కాలిపోయాయని చెప్పి.. చేసిన అవినీతి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారన్నారు. సహకార విద్యుత్ రంగంలో ప్రతిష్టాత్మకమైన సెస్ ను ఎన్పీడీఎల్ లో కలిపి వినియోగదారులను ఇబ్బంది పెడుతున్నారన్నారు.

Also Read: 7 ఇయర్స్ మిస్సింగ్… పుట్టుకతో గుడ్డిదైన పిల్ల తిరిగొచ్చేసరికి కంటిచూపుతో… మెంటల్ మాస్ సిరీస్ మావా

Tags

Related News

రాహుల్ గాంధీ పిరికి వ్యక్తి.. అప్రజాస్వామికవాది.. కేటీఆర్ ఘాటు విమర్శలు

బీఆర్‌ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ అరెస్ట్!

అంగన్‌వాడీ కేంద్రంలో ఊడిపడ్డ స్లాబ్ పెచ్చులు.. స్పాట్‌లో 5 గురు చిన్నారులు..!

శంషాబాద్‌లో భారీ చోరీ.. ఏటీఎం బద్దలుకొట్టి రూ.32 లక్షలు ఎత్తుకెళ్లిన దొంగలు!

తెలంగాణ బీజేపీ త్రిముఖ వ్యూహం.. 3 జోన్లు.. 3 విభిన్న ప్లాన్లు!

దాండియా ఈవెంట్లపై వివాదం.. ఓవైసీకి గట్టి కౌంటర్ ఇచ్చిన ఎమ్మెల్యే రాజా సింగ్!

అక్టోబర్‌లోగా కరువు నివేదిక సిద్ధం చేయండి.. అధికారులకు సీఎస్ ఆదేశం!

Big Stories

Advertisement
×