E-Paper
Advertisement

తెలంగాణలో బీజేపీ దూకుడు.. వరుసగా 3 రోజులు అగ్రనేతల టూర్లు, షెడ్యూల్ ఇదే!

తెలంగాణలో బీజేపీ దూకుడు.. వరుసగా 3 రోజులు అగ్రనేతల టూర్లు, షెడ్యూల్ ఇదే!
Advertisement

Telangana BJP: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణలో బీజేపీ అగ్రనేతల వరుస పర్యటనలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకోనున్నాయి. పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఈ నెల 23న కరీంనగర్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా నిర్వహించనున్న పాదయాత్రలో ఆయన పాల్గొననున్నారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి సునీల్ బన్సల్ సైతం ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.

అమిత్ షా, జేపీ నడ్డా పర్యటనలు..

Advertisement

ఇదిలా ఉండగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నెల 24న తెలంగాణకు రానున్నారు. ఆయన ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరుకానున్నట్లు సమాచారం. మరోవైపు కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఈనెల 25న తెలంగాణలో పర్యటించే అవకాశాలు ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆయన మెదక్ లేదా సిద్దిపేటలో పాదయాత్రలో పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది. మూడు రోజుల వ్యవధిలో జాతీయ స్థాయి అగ్రనేతలు రాష్ట్రానికి రానుండటంతో తెలంగాణ బీజేపీ రాజకీయ కార్యకలాపాలు మరింత వేగం పుంజుకోనున్నాయి. ముఖ్యంగా కరీంనగర్, మెదక్, సిద్దిపేట ప్రాంతాల్లో పార్టీ కార్యక్రమాల నిర్వహణపై నాయకత్వం దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

లోక్ తంత్ర్ బచావో మహా పాదయాత్ర

Advertisement

బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఈనెల 23న కరీంనగర్ కు వస్తున్నారు. ఎస్ఐఆర్ పేరిట రాజ్యాంగ సంస్థలపై ఇండీ కూటమి పేరుతో విపక్షాలు చేస్తున్న దుష్ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ప్రజలకు వాస్తవాలు వివరించేందుకు లోక్ తంత్ర్ బచావో.. అరాచకత హఠావో పేరిట కరీంనగర్ లో నిర్వహించే మహా పాదయాత్రలో పాల్గొంటారు. అందులో భాగంగా ఈనెల 23న ఉదయం 11 గంటలకు హైదరాబాద్ కు చేరుకుంటారు. అక్కడి నుండి ప్రత్యేక హెలికాప్టర్ లో మధ్యాహ్నం 12 గంటలకు కరీంనగర్ కు చేరుకుంటారు. నేరుగా కరీంనగర్ వైశ్యా భవన్ వద్దకు వెళ్లి మహా పాదయాత్రలో పాల్గొంటారు. కరీంనగర్ వైశ్యా భవన్ నుంచి టవర్ సర్కిల్, శాస్త్రీరోడ్ మీదుగా కమాన్ దాకా దాదాపు 2 కిలోమీటర్ల మేర ఈ మహా పాదయాత్ర కొనసాగనుంది. నితిన్ నబిన్ తో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్, పార్టీ రాష్ట్ర ఇన్ చార్జీ సునీల్ బన్సల్, సహ ఇన్ చార్జీలు రేఖా శర్మ, అభయ్ పాటిల్ తదితరులు ఈ మహాపాద యాత్రలో పాల్గొంటారు.

Also Read: రేవంత్‌పై విమర్శల ఎఫెక్ట్.. రాజగోపాల్ రెడ్డికి అధిష్టానం ఫోన్ కాల్.. 23న కీలక భేటీ!

Tags

Related News

రేవంత్‌పై విమర్శల ఎఫెక్ట్.. రాజగోపాల్ రెడ్డికి అధిష్టానం ఫోన్ కాల్.. 23న కీలక భేటీ!

స్క్రిప్ట్ బీఆర్ఎస్‌ది.. ప్రజెంటేషన్ బీజేపీది.. కిషన్ రెడ్డిపై చామల ఫైర్

కాంగ్రెస్‌లో ప్రజాస్వామ్యం ఎక్కువైంది.. ఆ ఇద్దరు ఎమ్మెల్యేల వ్యాఖ్యలపై అధిష్టానం సీరియస్ ఫోకస్!

బిర్యానీ ప్రియులకు షాక్.. మాదాపూర్ బావర్చి, మెహఫిల్ సహా పలు రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ కొరడా!

తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్.. ఇంటింటికీ రూ.300లకే టీ-ఫైబర్ ఇంటర్‌నెట్!

తెలంగాణ పట్టణాలకు మహర్దశ.. రూ.20 వేల కోట్లతో సీఎం రేవంత్ భారీ ప్లాన్!

హైదరాబాద్‌ సిటీలో ఆ ప్రాంతాలకు బిగ్ అలర్ట్.. రాత్రి నుండి 24 గంటలు నీటి సరఫరా బంద్

Big Stories

Advertisement
×