E-Paper
Advertisement

ఫిక్స్‌డ్ డిపాజిట్లపై బ్యాంకులు బంపరాఫర్.. ఇక కాసుల పంటే, ఇంకెందుకు ఆలస్యం

ఫిక్స్‌డ్ డిపాజిట్లపై బ్యాంకులు బంపరాఫర్.. ఇక కాసుల పంటే, ఇంకెందుకు ఆలస్యం
Advertisement

Banks Fixed Deposit Rates: ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడా చూసినా వడ్డీ రేట్లు పెరుగుతున్నాయనే సందడి మొదలైంది. అమెరికా మొదలు భారత్ వరకు ఇదే మాట జోరు, బలంగా వినిపిస్తోంది. వడ్డీ రేట్లు తగ్గించాలంటూ సాక్షాత్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రస్తావించారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే ఎప్పుడు పతనం అవుతుందోనన్న భయం వెంటాడుతోంది. తాజాగా బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై బంపరాఫర్ ఇచ్చేశాయి.

ఫిక్స్‌డ్ డిపాజిట్లపై బ్యాంకులు బంపరాఫర్

చిన్న చిన్న పెట్టుబడుదారులు బ్యాంకుల వైపు చూస్తున్నారు. వడ్డీ రేట్లు పెరుగుతుండడంతో అటు వైపు ఫోకస్ చేస్తున్నారు. వారితోపాటు సీనియర్ సిటిజన్లు కూడా ఉన్నారు. రిస్క్ లేకుండా మంచి రాబడి అందించే పథకాల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు ముందు వరుసలో ఉంటాయి. సీనియర్ సిటిజెన్లకు కాసింత అధిక వడ్డీ వస్తుంది. వారం రోజుల వ్యవధి నుంచి గరిష్ఠంగా పదేళ్ల వ్యవధి వరకు ఎప్పుడైనా ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేయవచ్చు. కాకపోతే తక్కువ సమయానికి వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటాయి.  లాంగ్ టర్న్ కాస్త తక్కువగా వడ్డీ ఉంటుంది.

చిన్న బ్యాంకులపై సీనియర్ సిటిజన్ల చూపు

Advertisement

సామాన్యులతో పోలిస్తే సీనియర్ సిటిజెన్లకు వడ్డీ ఎక్కువగా వస్తుంది. ఆ తర్వాత వారికి భరోసా కూడా. అందుకే అటువైపు ఎక్కువగా చూపుతారు. ఇటీవల ఆర్బీఐ 50 బేసిస్ పాయింట్లు పెంచిన నేపథ్యంలో బ్యాంకులు కూడా వడ్డీ పెంచడం మొదలుపెట్టాయి. ప్రభుత్వ బ్యాంకుల కంటే ప్రైవేట్ బ్యాంకుల్లో వడ్డీ కాస్త అధికంగా ఉంటుంది. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో ఇంకా ఎక్కువ వడ్డీ వస్తుంది. సీనియర్ సిటిజెన్లకు అధిక వడ్డీ ఇచ్చే చిన్న ఫైనాన్స్ బ్యాంకుల వడ్డీలను పరిశీలిద్దాం.

ఐదేళ్ల టెన్యూర్‌కు ఎఫ్‌డీ రేట్లు సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో 8.50 శాతంగా ఉంది. రూ. 2 లక్షలు డిపాజిట్ చేస్తేచాలు.. ఐదేళ్లకు వడ్డీ రూపంలో 8.50 శాతంతో దాదాపు రూ. 1,04,559 వడ్డీ రావచ్చు. మెచ్యూరిటీ సమాయానికి అసలు, ప్లస్ వడ్డీ కలిపి దాదాపుగా రూ. 3.04 లక్షలు వస్తాయి. ఆ తర్వాత స్థానంలో జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు ఉంది. ఐదేళ్ల కాలానికి సీనియర్ సిటిజన్లకు 8 శాతం వడ్డీ ఇస్తుంది. రూ. 2 లక్షలు FD చేస్తే రూ. 97189 వడ్డీ రానుంది. మెచ్యూరిటీ సమాచానికి దాదాపు రూ. 2,97,189 అందుతాయి.

Advertisement

ALSO READ: ఓ వైపు బంగారం.. మరోవైపు క్రిప్టో కరెన్సీ, రెండేళ్ల కనిష్టానికి పతనం, ప్రపంచ మార్కెట్లో ఏం జరుగుతోంది?

ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వడ్డీ రేట్లు 7.70 శాతంగా ఉంది. అక్కడ రూ. 2 లక్షలు ఎఫ్‌డీ చేస్తే రూ. 92849 వడ్డీ అందుతుంది. ఈక్విటస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు, స్లైస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో 7.50 శాతంగా వడ్డీ రేట్లు ఉన్నాయి. వాటిలో ఐదేళ్లకు రూ. 89990 వడ్డీ రానుంది. ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో సీనియర్ సిటిజెన్లకు వడ్డీ రేట్లు ఐదేళ్ల కాలానికి 7.40 శాతం, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో సీనియర్ సిటిజెన్లకు 7.25 శాతం వడ్డీ ఉంది. శివాలిక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు 6.50 శాతం, ఈఎస్ఏఎఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 6.25 శాతం వడ్డీ రేట్లు ఇస్తున్నాయి. వాటిలో ఇన్వెస్ట్ పెట్టేముందు ఒక్కసారి బ్యాంకు అధికారులను సంప్రదించి తర్వాత నిర్ణయం తీసుకోండి.

Related News

ఓ వైపు బంగారం.. మరోవైపు క్రిప్టో కరెన్సీ, రెండేళ్ల కనిష్టానికి పతనం, ప్రపంచ మార్కెట్లో ఏం జరుగుతోంది?

మిస్డ్ కాల్స్‌తో రూ.8,300 కోట్ల కంపెనీ.. ఎంఐటీ గ్రాడ్యుయేట్ బిజినెస్ ఐడియా

క్లెయిమ్‌ల తిరస్కరణ, అక్రమ కోతలపై .. స్టార్ హెల్త్‌కు రూ. 2 కోట్ల జరిమానా!

పెట్టుబడిదారుడు చనిపోతే అతని మ్యూచువల్ ఫండ్స్, ఎఫ్‌డి ఎవరికి వర్తిస్తాయి?.. నామినీ, నిబంధనలు ఇవే

నర్సు ఉద్యోగానికి గుడ్ బై.. 7 నెలల్లోనే రూ.1.75 కోట్ల సంపాదన.. కంటెంట్ క్రియేషన్ పవర్ అంటే ఇదీ!

రూ.55 వేలకు బంగారం ఢమాల్.. 11 నెలల్లో ఇంత మార్పా? 1981 మళ్లీ రిపీట్?

భారీగా బంగారం-వెండి ఈటీఎఫ్‌లు పతనం.. ఇన్వెస్టర్లకు తప్పని నష్టాల సెగ!

Big Stories

Advertisement
×