E-Paper
Advertisement

భారీ బేస్,సూపర్ సౌండ్..సినిమా లవర్స్ కోసం టాప్ 5.1 హోమ్ థియేటర్లు!

భారీ బేస్,సూపర్ సౌండ్..సినిమా లవర్స్ కోసం టాప్ 5.1 హోమ్ థియేటర్లు!
Advertisement

5.1 home theatre: సినిమా చూస్తున్నప్పుడు యాక్షన్ సీన్స్‌లో వచ్చే బేస్ సౌండ్ గుండెల్ని తాకితేనే.. ఆ మజా వేరుగా ఉంటుంది. ప్రతి డైలాగ్ క్లియర్‌గా వినిపిస్తూ, చుట్టూ సౌండ్ కమ్ముకుంటే మన లివింగ్ రూమ్ కూడా.. చిన్న ఐమాక్స్ థియేటర్‌లా మారి పోతుంది. 5.1 హోమ్ థియేటర్ సిస్టమ్స్ ఇప్పుడు హోమ్ ఎంటర్‌ టైన్‌మెంట్‌లో పెద్ద ట్రెండ్‌గా మారాయి. బడ్జెట్‌లో దొరికే వాటి నుంచి పవర్‌ఫుల్.. ప్రీమియం మోడల్స్ వరకు ఎన్నో ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. మీ స్పేస్, బడ్జెట్‌కి తగ్గ బెస్ట్ 5.1 హోమ్ థియేటర్లు, వాటి లేటెస్ట్ ధరల గురించి ఇప్పుడు చూద్దాం.

1. GOVO GoSurround 955 Pro:

తక్కువ బడ్జెట్‌లోనే.. సబ్‌వూఫర్, రియర్ స్పీకర్లతో నిజమైన 5.1 సరౌండ్ సౌండ్ ఫీల్ పొందాలనుకుంటే.. ఈ మోడల్ మంచి ఆప్షన్. ఇందులో.. సుమారు 320W సౌండ్ అవుట్‌ పుట్ లభిస్తుంది. సౌండ్‌బార్, సబ్‌ వూఫర్, రెండు రియర్ స్పీకర్లు కలిసి రూమ్‌లో మంచి.. సౌండ్ స్టేజ్ క్రియేట్ చేస్తాయి. టీవీ, స్మార్ట్‌ ఫోన్, ల్యాప్‌ టాప్‌లతో ఈజీగా కనెక్ట్ చేసుకునే అవకాశం ఉండటంతో చిన్న లేదా మీడియం సైజ్ లివింగ్ రూమ్స్‌కి ఇది చక్కగా సరి పోతుంది. రోజువారీ సినిమాలు, వెబ్ సిరీస్‌ల కోసం బడ్జెట్ ఫ్రెండ్లీగా అప్‌గ్రేడ్ అవ్వాలనుకునేవారికి ఇది స్మార్ట్ ఛాయిస్.

Advertisement

అంచనా ధర: సుమారు రూ.5,499 నుంచి రూ.7,999 వరకు ఉంటుంది.

2. boAt Aavante Prime 5.1 5000D:

పార్టీలు, మాస్ యాక్షన్ సినిమాలు, బీట్ ఉన్న పాటలు వినే.. వారికి బేస్ కొంచెం గట్టిగానే ఉండాలి. ఈ మోడల్ సుమారు 500W అవుట్‌ పుట్‌తో డైనమిక్ సౌండ్ అందిస్తుంది. 5.1 ఛానల్ కాన్ఫిగరేషన్.. వల్ల సౌండ్ డైరెక్షన్ స్పష్టంగా అనిపిస్తూ, సబ్‌ వూఫర్ నుంచి వచ్చే లో-ఎండ్ బేస్ రూమ్‌ని నింపేస్తుంది. టీవీతో.. పాటు ఇతర డివైజ్‌లకు కనెక్ట్ చేయడం ఈజీగా ఉంటుంది. మిడ్-బడ్జెట్ రేంజ్‌లో.. స్టైలిష్ లుక్, ఎక్కువ బేస్ కోరుకునే యూత్, ఫ్యామిలీస్‌కి ఇది బాగా సెట్ అవుతుంది.

Advertisement

అంచనా ధర: సుమారు రూ.12,999 నుంచి రూ.16,999 వరకు ఉంటుంది.

3. Sony HT-S20R:

సౌండ్ క్లారిటీ, డైలాగ్స్, నమ్మకమైన బ్రాండ్ క్వాలిటీ కావాలనుకునే వారికి ..ఈ మోడల్ ఒక పాపులర్ ఛాయిస్. ఇందులో.. సుమారు 400W పవర్ అవుట్‌ పుట్‌తో సౌండ్‌ బార్, వైర్డ్ సబ్‌వూఫర్, రెండు రియర్ స్పీకర్లు వస్తాయి. యాక్షన్ సీన్స్‌లో.. చుట్టూ తిరిగే.. సౌండ్ ఎఫెక్ట్‌తో పాటు, మ్యూజిక్ వింటున్నప్పుడు కూడా బ్యాలెన్స్‌డ్ టోన్ కనిపిస్తుంది. ఆప్టికల్, బ్లూటూత్ కనెక్టివిటీ ఉండటం వల్ల టీవీ సెటప్ చాలా సింపుల్‌గా ఉంటుంది. ఓటీటీ కంటెంట్‌ని థియేటర్‌కి దగ్గరగా ఫీల్ అవ్వాలనుకునే వారికి ఇది మంచి మిడ్-రేంజ్ ఆప్షన్.

అంచనా ధర: సుమారు రూ.17,990 నుంచి రూ.19,990 వరకు ఉంటుంది.

4. Zebronics Juke Bar 9890:

పెద్ద లివింగ్ రూమ్‌లో హెవీ సౌండ్ అవుట్‌ పుట్, డీప్ బేస్, సినిమాటిక్ 3D ఫీల్ కావాలనుకుంటే.. ఈ మోడల్ ప్రత్యేకంగా నిలుస్తుంది. ఇందులో ఏకంగా.. 1030వాట్స్  వరకు భారీ పవర్ అవుట్‌పుట్ లభిస్తుంది. సపోర్ట్‌తో పాటు 5.1.2 సెటప్, సబ్‌ వూఫర్, రియర్ స్పీకర్లు కలిసి రూమ్ థియేటర్ వాతావరణాన్ని.. తీసుకొస్తాయి. దీనిలో ఆప్టికల్, బ్లూటూత్ v5.3 వంటి ఆప్షన్లు ఉండటంతో లేటెస్ట్ స్మార్ట్ టీవీలతో.. అద్భుతంగా సింక్ అవుతుంది. తక్కువ ధరలోనే ..హై-వాటేజ్ సౌండ్ కోరుకునే వారికి ఇది బెస్ట్ డీల్.

Also Read: ఆన్‌లైన్ క్లాసుల నుంచి కాలేజ్ ప్రాజెక్టుల దాకా..ఈ ల్యాప్‌టాప్‌లతో ఏ పనైనా ఈజీ

అంచనా ధర: సుమారు రూ.29,999 నుంచి రూ.34,999 వరకు ఉంటుంది.

5. JBL Bar 800 Pro:

వైర్ల హడా విడి లేకుండా రియల్ సరౌండ్ సౌండ్, ఫ్లెక్సిబుల్ సెటప్ కావాలనుకునే వారికి ఈ మోడల్ ఒక ప్రీమియం ట్రెండ్‌సెట్టర్. ఇందులో 720వాట్స్ వరకు.. పవర్ అవుట్‌ పుట్, 10-ఇంచుల డౌన్-ఫైరింగ్ సబ్‌ వూఫర్ ఉంటాయి. ఈ సబ్‌ వూఫర్ నుంచి వచ్చే బేస్ నేరుగా నేల నుంచి వస్తున్నట్టుగా బలంగా..అనిపిస్తుంది. దీని ప్రత్యేకత ఏమిటంటే.. సౌండ్‌బార్ చివర ఉండే.. డిటాచబుల్ స్పీకర్లను వేరు చేసి రూమ్‌లో అవసరమైన చోట పెట్టుకోవచ్చు. డైలాగ్స్ స్పష్టత కోసం వాయిస్ ఎన్‌హాన్స్‌మెంట్ ఫీచర్, వైఫై, హెచ్డీఎమ్ఐ కనెక్టివిటీతో ఇది లివింగ్ రూమ్‌ని నిజమైన మినీ IMAXలా మార్చేస్తుంది.

అంచనా ధర: సుమారు రూ.69,999 నుంచి రూ. 89,999 వరకు ఉంటుంది.

Related News

కొత్త ఫోన్ కొనడం కంటే రిపేర్ చేసుకోవడమే బెటర్.. ఈ 5 లాభాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఆన్‌లైన్ క్లాసుల నుంచి కాలేజ్ ప్రాజెక్టుల దాకా..ఈ ల్యాప్‌టాప్‌లతో ఏ పనైనా ఈజీ

పక్షిలా కాళ్లపై పైకి గెంతి ఎగిరే డ్రోన్.. చూస్తే భలే ముచ్చటేస్తుంది

గూగుల్ మ్యాప్స్‌కు గట్టి పోటీ..భారత్‌లో ఆపిల్ మ్యాప్స్ బిగ్ అప్‌డేట్

49 ఏళ్ల ప్రయాణం.. భూమి నుంచి ఒక లైట్ డే దూరంలో వాయేజర్ 1.. ఇంతకీ ఏమిటిది?

ఏఐ హెల్త్ అడ్వైస్..డాక్టర్ సలహా లేకుండా ఏఐని నమ్మి మోసపోకండి!

కొత్త హెయిర్ డ్రైయర్ కొనాలా? మీ జుట్టుకు తగిన మోడల్ ఇలా ఎంచుకోండి!

Big Stories

Advertisement
×