ENE Repeat:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోగా, దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న తరుణ్ భాస్కర్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఒకవైపు హీరోగా నటిస్తూనే.. మరొకవైపు దర్శకుడిగా కూడా సత్తా చాటుతున్నారు. అలాంటి తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో ఈ నగరానికి ఏమైంది? మూవీకి సీక్వెల్ గా ‘ఈ నగరానికి ఏమైంది? రిపీట్’ నేడు థియేటర్లలోకి వచ్చింది. ఇకపోతే నేడు థియేటర్లలోకి రావాల్సి ఉండగా.. ఒకరోజు ముందుగానే ప్రీమియర్స్ వేశారు. పార్ట్ వన్ క్లాసిక్ గా నిలవడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పైగా ప్రీమియర్స్ నుంచే ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ ఫుల్ పాజిటివ్ టాక్ కూడా తెచ్చుకుంది. సినిమా ఎమోషన్, ఫ్రెండ్షిప్ ఎమోషన్ ని బాగా పండించడమే కాకుండా ఫుల్ లెంగ్త్ కామెడీ తో మరోసారి ఆడియన్స్ ను కడుపుబ్బా నవ్వించారు.
ఇకపోతే ప్రీమియర్ చూసిన ఆడియన్స్ మొదటి భాగానికి మించి ఉంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రీమియర్ లో భాగంగా సినిమా చూసిన ఆడియన్స్ ఈ సినిమాలో ఇంతమంది గెస్ట్ అప్పియరెన్స్ ఇస్తారా? అంటూ ఆశ్చర్యపోతున్నారు. మరి ఈ సినిమాలో నటీనటులతో పాటు స్టార్ డైరెక్టర్లు కూడా అలా కనిపించి, మెరవడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా సీక్వెల్ లో క్లైమాక్స్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi), సందీప్ రెడ్డివంగా (Sandeep Reddy Vanga) , నందిని రెడ్డి (Nandini Reddy) ఇలాంటి డైరెక్టర్లు గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చి నవ్వించారు. సినిమా మొదట్లోనే ఓజీ డైరెక్టర్ సుజీత్ గెస్ట్ గా కనిపించి ప్రేక్షకులను మెస్మరైజ్ చేయగా.. ఆ తర్వాత డైరెక్టర్ కరుణ్ కుమార్ ఉపేంద్ర పాత్ర తండ్రి పాత్రలో కనిపించారు. అలాగే డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్ క్లైమాక్స్ లో కనిపించాడు.
also read:హౌస్ నుండి రామకృష్ణ కిడ్నాప్.. అసలేం జరుగుతోంది?
అంతేకాదు డైరెక్టర్ అనుదీప్ కూడా మొదటి భాగంలోనే కనిపించి నవ్వించారు. ఇంతమంది దర్శకులు ఈ సినిమాలో అతిధి పాత్రలు పోషించి.. సినిమాపై మరింత అంచనాలు పెంచేశారు. ఇక వీళ్లే కాకుండా మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్, సింగర్ శ్రీరామచంద్ర కూడా ఎక్స్టెండెడ్ క్యామియో పాత్రలు చేసి మెప్పించారు. అలాగే రాజీవ్ కనకాల కూడా గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చారు. ఇకపోతే చివరిగా విజయ్ దేవరకొండను కూడా గెస్ట్ గా ట్రై చేయాలనుకున్నారు. కానీ కుదరలేదట. అయితే విజయ్ వాయిస్ తో మాత్రం సినిమా ఆరంభంలోనే మెప్పించారు. మొత్తానికైతే ఈ నగరానికి ఏమైంది రిపీట్ సినిమా కంటెంట్ తో ఫ్యాన్స్ ను ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా అటు సెలబ్రిటీ గెస్ట్ లతో కూడా బాగా అలరించింది. ఏది ఏమైనా ఇంతమంది డైరెక్టర్లు, మ్యూజిక్ డైరెక్టర్లు కనిపించి అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చారు.