BigTV English

Cancer: ప్రపంచంలో 10 శాతం మందికి క్యాన్సర్ రావడానికి కారణం ఇదే, జాగ్రత్తగా ఉండండి

Cancer: ప్రపంచంలో 10 శాతం మందికి క్యాన్సర్ రావడానికి కారణం ఇదే, జాగ్రత్తగా ఉండండి

క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య ప్రతి ఏటా పెరుగుతూ వస్తోంది. మనదేశంలో కూడా క్యాన్సర్ బాధితుల సంఖ్య అధికంగానే ఉంది. క్యాన్సర్ రావడానికి అనేక కారణాలను చెబుతారు. అవి జన్యుపరంగా రావచ్చని, ధూమపానం, మద్యపానం వంటి చెడు జీవనశైలి అలవాట్ల వల్ల కూడా వస్తాయని అంటారు. అలాగే క్యాన్సర్ కు మరొక ప్రధాన ప్రమాద కారకం ఒకటి ఉంది. అదే ఊబకాయం. ప్రపంచవ్యాప్తంగా 10 నుంచి 15 శాతం మంది క్యాన్సర్ రోగుల్లో ఊబకాయం వల్లే వారు ఆ వ్యాధి బారిన పడినట్టు గుర్తించారు. ముఖ్యంగా ఊబకాయం వల్ల రొమ్ము క్యాన్సర్, పేగు క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఊబకాయానికి, క్యాన్సర్ కు మధ్య ఉన్న అనుబంధం గురించి ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు చెప్పాయి.


ఊబకాయం క్యాన్సర్ కు మధ్య సంబంధం

ఊబకాయం, క్యాన్సర్ మధ్య ప్రధాన సంబంధం ఉంది. శరీరంలో సంభవించే జీవక్రియ హార్మోన్ల మార్పుల నుండి ఈ అనుబంధం ఏర్పడుతుంది. ఇన్సులిన్ నిరోధకత కూడా దీనికి ఒక ప్రధాన కారణం. ఇన్సులిన్ సరిగా వినియోగించుకోనప్పుడు ఆ హార్మోను ఎక్కువగా ఉత్పత్తి అయి మిగిలిపోతుంది. అప్పుడు అధిక స్థాయిలో గ్రోత్ హార్మోన్లు పెరుగుతాయి. ఈ గ్రోత్ హార్మోన్లు పేరుకుపోయి క్యాన్సర్ అభివృద్ధిని పెంచే అవకాశం ఉంది. కొవ్వు కణజాలాలు అధికంగా పేరుకుపోవడం వల్ల డిఎన్ఏ కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఇది కూడా క్యాన్సర్ ప్రమాదాన్ని మరింత పెంచుతుంది. ఊబకాయం కారణంగా పొట్టలోని మంచి బ్యాక్టీరియాలో ఎన్నో మార్పులు వస్తాయి. అక్కడ ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది. ఇది కూడా క్యాన్సర్ అభివృద్ధి చెందడానికి అవసరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది.


ఆరోగ్యకరమైన జీవనశైలితో..

ఆరోగ్యకరమైన జీవనశైలి ద్వారా ఊబకాయాన్ని తగ్గించుకొని క్యాన్సర్లు రాకుండా అడ్డుకోవచ్చు. బరువును తగ్గించుకోవడం కోసం సమతుల ఆహారం, పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు వంటివి అధికంగా తినాలి. శరీరానికి అవసరమైన పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారాలను తింటూ క్యాన్సర్ రాకుండా అడ్డుకోవచ్చు. అలాగే ఒత్తిడిని, ఇన్ల్ఫమేషన్ తగ్గించుకోవడం ద్వారా కూడా జాగ్రత్త పడవచ్చు. క్యాన్సర్ ను నివారించడానికి రోజువారీ వ్యాయామం కూడా అవసరం పడుతుంది. ప్రతిరోజూ 30 నిమిషాలు పాటు వ్యాయామం చేయడం వల్ల జీవక్రియ మెరుగుపడుతుంది. దీనివల్ల కొవ్వు తగ్గుతుంది. కాబట్టి క్యాన్సర్ ప్రమాదం కూడా తగ్గుతుంది.

వాకింగ్ లేదా.. వ్యాయామాలతో.. 

ఊబకాయంతో బాధపడుతున్న వారు ఆ బరువును ఎంత వేగంగా అయితే అంత వేగంగా తగ్గించుకోవాలి. అది కూడా ఆరోగ్యకరమైన పద్ధతిలోనే తగ్గించుకోవాలి. ప్రతిరోజూ గంటసేపు వాకింగ్ చేయడం లేదా చిన్న చిన్న వ్యాయామాలు చేయడం ద్వారా ఆ బరువును తగ్గించుకోవాలి. ఆహారాన్ని కూడా మితంగా తీసుకోవడం ద్వారా బరువును త్వరగా తగ్గించుకోవచ్చు. అధిక ఒత్తిడి బారిన పడితే హార్మోన్లు అసమతుల్యత ఎక్కువవుతుంది. ఇది బరువు పెరగడానికి కారణం అవుతుంది. ఇది కూడా క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది.

ఊబకాయం తగ్గితే ఆయుష్షు మీ సొంతం

ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించడం ద్వారా ఎవరైనా కూడా ఊబకాయం బారిన పడకుండా జాగ్రత్త పడొచ్చు. ఊబకాయం లేకుండా ఉంటే క్యాన్సర్ తో పాటు మధుమేహం, హైబీపీ, గుండె జబ్బులు కూడా రాకుండా ఉంటాయి. తగినంత నిద్ర, రోజు వారీ వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం, ఒత్తిడిని తగ్గించుకోవడం ద్వారా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి. అధిక బరువుతో బాధపడుతున్నవారు ప్రతిరోజూ గంటసేపు వాకింగ్ చేయడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.

Also Read: ఇలా చేస్తే.. ఎప్పటికీ బరువు తగ్గరు !

Related News

Non-vegetarian food: ముక్క లేనిదే ముద్ద దిగడం లేదా ? అయితే జాగ్రత్త !

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Big Stories

×