Hardik Pandya: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ నాయకత్వ బాధ్యతలపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. మరో పదకొండు రోజులలో ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సమీపిస్తుండడం, భారత్ – ఇంగ్లాండ్ మధ్య ప్రస్తుతం జరుగుతున్న 3 వన్డేల సిరీస్ ఛాంపియన్స్ ట్రోఫీకి ఓ విధంగా ప్రాక్టీస్ మ్యాచ్ లుగా భావించబడుతున్నాయి. కానీ ఈ సిరీస్ లోని తొలి వన్డేలో కెప్టెన్ రోహిత్ శర్మ పూర్తిగా నిరాశపరిచాడు.
Also Read: Team India: కుంభమేళాలో అఘోరల క్రికెట్.. రోహిత్, కోహ్లీల మధ్య చిచ్చు ?
నాగపూర్ లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా జరిగిన తొలి వన్డేలో రోహిత్ కేవలం ఏడు బంతులలో రెండు పరుగులు మాత్రమే చేసి నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. ఇప్పటికే కొంతకాలంగా ఫామ్ కోల్పోయి తీవ్ర విమర్శలపాలవుతున్న రోహిత్ శర్మ.. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇలా తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరడంతో త్వరలోనే జట్టులో భారీగా మార్పులు ఉంటాయని క్రీడా వర్గాలు పేర్కొంటున్నాయి.
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టుకు సానుకూల ఫలితాలు రాకపోతే.. రోహిత్ శర్మని కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించబోతున్నారని.. అతడి స్థానంలో హార్దిక్ పాండ్యాని కెప్టెన్ గా నియమించాలని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, బీసీసీఐ యోచిస్తున్నట్లు నేషనల్ మీడియా పేర్కొంది. ఛాంపియన్స్ ట్రోఫీలో హార్దిక్ పాండ్యా బాగా రాణిస్తే కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వచ్చని క్రికెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీలో రోహిత్ శర్మ కెప్టెన్ గా వ్యవహరిస్తూండగా.. గిల్ వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారు.
దీంతో రోహిత్ శర్మ తర్వాత గిల్ ని కెప్టెన్ గా నియమిస్తారని అంతా భావించారు. కానీ ఓ జాతీయ మీడియా కథనం ప్రకారం ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ కి పరాభవం ఎదురైతే.. హార్దిక్ పాండ్యాని వన్డేలకు కెప్టెన్ గానియమిస్తారని తెలుస్తోంది. ఇక టి-20ల్లో సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారు. అతని కెప్టెన్సీలో భారత జట్టు మంచి విజయాలే సాధిస్తున్నప్పటికీ.. సూర్య కుమార్ యాదవ్ మాత్రం వరుసగా ఫెయిల్ అవుతూ వస్తున్నాడు. దీంతో టి-20 నాయకత్వ బాధ్యతలను కూడా హార్థిక్ పాండ్యాకు ఇచ్చే అవకాశం ఉంది.
అయితే చాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు ప్రదర్శన, ఫలితం పైనే కెప్టెన్సీ ఎవరికీ అప్పగించాలనే అంశం ఆధారపడి ఉంటుంది. రోహిత్ శర్మ ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత వన్డేలకు రిటైర్మెంట్ కూడా ప్రకటించవచ్చు. అందువల్ల ఛాంపియన్స్ ట్రోఫీలో హార్దిక్ పాండ్యా మంచి ప్రదర్శన చేస్తే వన్డే కెప్టెన్సీ హార్దిక్ పాండ్యా కు ఇవ్వచ్చు. దీంతో గిల్ వైస్ కెప్టెన్ గా ఉంటాడు. ఇంగ్లాండ్ తో జరుగుతున్న సిరీస్ లో గిల్ కి వైస్ కెప్టెన్ బాధ్యతలు అప్పగించడంతో.. హార్దిక్ పాండ్యా కి అన్యాయం జరిగిందనే భావన బీసీసీఐ లోని పలువురు సభ్యులకు ఉంది.
Also Read: IPL 2025: ఐపీఎల్ ప్రారంభం కంటే ముందే…ప్రమాదంలో RCB, SRH ?
ఈ నేపథ్యంలో పాండ్యాకి వన్డే బాధ్యతలు అప్పగిస్తారని క్రికెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. కెప్టెన్ గా రోహిత్ శర్మ టెస్టుల్లోనే కాదు వన్డే ఫార్మాట్ లో కూడా కొంతకాలంలో దారుణంగా విఫలమవుతున్నాడు. అతడి బ్యాటింగ్ ప్రదర్శన బాగా లేకపోవడంతో అభిమానులలో అతనిపై నమ్మకం తగ్గినట్లు కనిపిస్తుంది. ఇక చాంపియన్స్ ట్రోఫీ అనంతరం రోహిత్ శర్మని కెప్టెన్సీ బాధ్యతల నుంచి తొలగించబోతున్నారనే వార్త క్రీడాభిమానులను ఆందోళనకు గురిచేస్తుంది.