సృష్టిలో భార్యాభర్తల బంధం అమూల్యమైనది. అదే సృష్టికి మూలం. పెళ్లి ద్వారా ఒకటైన భార్యాభర్తలు తమ ప్రేమకు ప్రతిరూపాలుగా పిల్లలను కంటారు. అందుకే పెళ్లి సృష్టికి కారణమని చెప్పుకుంటారు. అయితే ఒకే ఇంట్లో నివసిస్తున్న భార్యాభర్తలు ఒకే మంచంపై నిద్ర పోతారు. వాస్తు శాస్త్రం ప్రకారం భర్తకు భార్య ఏ వైపు నిద్ర పోవాలో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
వాస్తు శాస్త్రంలో పేర్కొన్న నియమాలను పాటించడం వల్ల జీవితంలో సంపద, ఆనందం పెరుగుతాయి. అలాగే ఆ ఇంట్లో పాజిటివిటీ కూడా పెరుగుతుంది. ప్రతి పనిలో విజయం లభిస్తుంది. పూర్వీకుల ఆశీస్సులు కూడా లభిస్తాయి. భార్యాభర్తల కోసం కూడా వాస్తు శాస్త్రంలో ఎన్నో నియమాలు ఉన్నాయి. వీటిని పాటించడం వల్ల వారి వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. వారి మధ్య ప్రేమ పెరుగుతుంది. భార్యాభర్తల బంధం మరింతగా బలపడుతుంది.
ఏ వైపు నిద్ర పోవాలి
వాస్తు శాస్త్రం ప్రకారం భార్య భర్తకు ఎడమ వైపున నిద్రపోవాలి. అలా నిద్రపోవడం శుభప్రదం. ఇది వైవాహిక జీవితాన్ని సంతోషంగా ఉంచుతుంది. అలాగే శ్రేయస్సు, సంపద పెరిగేలా చేస్తుంది. భర్తకు దీర్ఘాయుష్షును అందిస్తుంది. ఆ ఇంట్లో సంపదను వృద్ధి చేస్తుంది.
పురాణాలు చెబుతున్న ప్రకారం శివుడు అర్ధనారీశ్వరుడుగా అవతరించాడు. ఆ సమయంలో అతను ఎడమవైపు భాగం స్త్రీగా ఉంది. అంటే పార్వతీ మాతగా మారింది. అందుకే హిందూ మతంలో భార్యను వామాంగీ అని పిలుస్తారు. అంటే ఎడమవైపుకు ఆమె అధికారి. కాబట్టి వివాహం తర్వాత ప్రతి శుభకార్యం లో కూడా భార్య భర్తకు ఎడమవైపే కూర్చోవాలి లేదా నిల్చోవాలి. అలాగే నిద్రపోయినప్పుడు కూడా భార్య భర్తకు ఎడమవైపే నిద్రపోవాలి. ఇలా చేయడం వల్ల ఆ ఇల్లు సుఖసంపదలతో, సంతోషాలతో వెల్లివిరుస్తుంది.
Also Read: తులసి ఆకులు తింటే.. ఈ ఆరోగ్య సమస్యలు అస్సలు రావు
ఇంట్లో బెడ్ రూమ్ ఉండే ప్రాంతం కూడా భార్యాభర్తల బంధాన్ని నిర్ణయిస్తుంది. వీరిద్దరి ప్రేమ ప్రదేశం బెడ్ రూమ్. ఇది ఇంటి నైరుతి మూలకు ఉండేలా చూసుకోండి. ఇది వారి మధ్య అనుబంధాన్ని బలంగా మారేలా చేస్తుంది. బెడ్ రూమ్ లో పెట్టే పెయింట్స్ కూడా లేత రంగుల్లో ఉండేలా చూసుకోవాలి. పీచ్, పింక్, లేత నీలం రంగులో ఉండే పెయింటింగ్ లు గదిలో పెట్టుకోవడం మంచిది. బెడ్ రూమ్ లో మంచం కూడా ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు. తలుపు పక్కన, బీమ్స్ కింద మంచం రాకుండా చూసుకోవాలి. గదిలో నైరుతి మూలలో మంచాన్ని పెట్టుకోవాలి. ఇలా పెడితే వాస్తు పరంగా భార్యాభర్తలు అన్యోన్యంగా జీవిస్తారు.