Partner online but not replying| మీరు లవర్‌కు మెసేజ్ పంపించారు. కానీ అతను మెసేజ్ చేశాడు.. ఆన్‌లైన్‌లో కనిపిస్తున్నా రిప్లై రావడం లేదా? మొదట బిజీగా ఉన్నారేమో అని మీరు అనుకుంటారు. కాసేపటి తర్వాత మళ్లీ ఫోన్ తీసి స్టేటస్ చూస్తారు. మళ్లీ ఆన్‌లైన్‌లో కనిపించినా సమాధానం రాకపోతే మనసులో ఎన్నో సందేహాలు మొదలవుతాయి. ఎవరితో మాట్లాడుతున్నారు? నన్ను కావాలనే పట్టించుకోవడం లేదా? ఇలాంటి ఆలోచనలు క్రమంగా ఆందోళన, అనుమానాలకు దారితీయవచ్చు. అయితే లవర్ ఆన్‌లైన్ స్టేటస్‌ను పదేపదే చూడటం నిజంగా బంధంపై ప్రభావం చూపుతుందా? అధ్యయనాలు ఏం చెబుతున్నాయో తెలుసుకుందాం.
2021లో ప్రచురితమైన ఒక రివ్యూలో సోషల్ మీడియా వల్ల కలిగే అసూయపై జరిగిన 45 పరిశోధనలను పరిశీలించారు. ఆన్‌లైన్ యాక్టివిటీస్ బంధాల్లో ఎలాంటి భావోద్వేగాలకు కారణమవుతాయో పరిశోధకులు విశ్లేషించారు.
సోషల్ మీడియాలో మీ లవర్ కార్యకలాపాలు కొందరిలో అసూయ, ఆందోళనను పెంచవచ్చని ఈ రివ్యూ వెల్లడించింది. ముఖ్యంగా ఇప్పటికే బంధంపై అభద్రత భావం ఉన్నవారిలో ఈ ప్రభావం ఎక్కువగా కనిపించవచ్చు.
అయితే, ఈ అధ్యయనంలో ఆన్‌లైన్ స్టేటస్‌ను పదేపదే చూడటాన్ని ప్రత్యేకంగా పరిశీలించలేదు. అందువల్ల ఈ అలవాటు నేరుగా బంధాన్ని దెబ్బతీస్తుందని చెప్పలేం.
2017లో ప్రచురితమైన మరో రివ్యూలో సోషల్ మీడియా, ప్రేమ బంధాలపై జరిగిన 26 రీసెర్చ్ డాక్యుమెంట్స్‌ను పరిశీలించారు. సోషల్ మీడియా ప్రభావం ప్రతి బంధంలో ఒకేలా ఉండదని పరిశోధకులు గుర్తించారు. ఇది లవర్స్ మధ్య కమ్యూనికేషన్‌ని పెంచి, ఒకరికొకరు దగ్గరగా ఉండటానికి సహాయపడుతుంది. అదే సమయంలో అసూయ, ఆందోళన, అభద్రత భావాలను కూడా పెంచే అవకాశం ఉంది. సోషల్ మీడియాలో కనిపించే విషయాలను వ్యక్తులు ఎలా అర్థం చేసుకుంటారనేది కూడా ఇందులో కీలకం.
2025లో ప్రచురితమైన ఒక పరిశోధనలో 18 నుంచి 29 ఏళ్ల మధ్య వయసున్న 322 మంది యువత పాల్గొన్నారు. వీరంతా ప్రేమ బంధాల్లో ఉన్నవారే. దాదాపు రెండేళ్లపాటు పరిశోధకులు వారి నుంచి వివిధ సమయాల్లో సమాచారాన్ని సేకరించారు. సోషల్ మీడియా వల్ల కలిగే అసూయ, భాగస్వామి ఆన్‌లైన్ యాక్టివిటీస్‌ని గమనించే అలవాటును పరిశీలించారు.
ఎక్కువ అసూయ ఉన్నవారు లవర్ ఆన్‌లైన్ యాక్టివిటీస్‌ని ఎక్కువగా గమనిస్తున్నట్లు అధ్యయనంలో తేలింది. ఈ అసూయకు తర్వాత బంధంపై తక్కువ సంతృప్తి ఉండటంతోనూ సంబంధం కనిపించింది.
అయితే, ఆన్‌లైన్ కార్యకలాపాలను గమనించడం, తర్వాత బంధంపై సంతృప్తి తగ్గడం మధ్య ప్రత్యక్షమైన ముఖ్యమైన సంబంధం కనిపించలేదు. కాబట్టి స్టేటస్ చూడటం వల్లే రిలేషన్ దెబ్బతింటుందని ఈ పరిశోధన నిరూపించలేదు.
లవర్ ఆన్‌లైన్‌లో ఉన్నంత మాత్రాన మీ మెసేజ్‌కు వెంటనే సమాధానం ఇవ్వగలరని అనుకోకండి. వారు పని నిజంగానే మరో ముఖ్యమైన పని చేస్తుండవచ్చు లేదా మరో మెసేజ్ లేదా కాల్స్ చేస్తూ బిజీగా ఉండవచ్చు.
ఆన్‌లైన్ స్టేటస్ ఆధారంగా వారి ఉద్దేశాలను నిర్ణయించడం సరైన పద్ధతి కాదు. వెంటనే స్పందించలేదని తప్పుడు అర్థాలు తీసుకోవద్దు.
ఒకసారి స్టేటస్ చూసి సమాధానం రాకపోతే మళ్లీ ఫోన్ చెక్ చేయాలనిపించవచ్చు. ఇలా ప్రతిసారీ కొత్త సందేహాలు మొదలవుతాయి. దీంతో ఆందోళన తగ్గడానికి బదులు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ అలవాటు మీ మనశ్శాంతిని ప్రభావితం చేస్తుందో గమనించండి.
Also Read: ప్రేమ పేరుతో అనుమానాలు భరిస్తున్నారా? మీ ఆత్మగౌరవాన్ని ఇలా కాపాడుకోండి
లవర్ రిప్లై ఇవ్వకపోతే మీకు ఎందుకు బాధ కలుగుతుందో ఆలోచించండి. నిర్లక్ష్యం చేస్తారనే భయమా? బంధంపై నమ్మకం తగ్గిందా? అనే విషయాలు గుర్తించండి. ఏదైనా సమస్య ఉంటే సరైన సమయంలో లవర్‌తో ప్రశాంతంగా మాట్లాడండి. ఆందోళన నిద్ర, చదువు, పని లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేస్తే నమ్మకమైన వ్యక్తి లేదా మానసిక ఆరోగ్య నిపుణుడి సహాయం తీసుకోండి.
Also Read: కొండ మీద నుంచి జారిపడిన యువకుడు.. 6 రోజులు ఎండలో కాలిపోతూ ఆకలి తట్టుకోలేక ఎలా బయటపడ్డాడంటే
లవర్ ఎంత త్వరగా రిప్లై ఇచ్చారనే దాంతో బంధం బలాన్ని నిర్ణయించలేం. పరస్పర నమ్మకం, గౌరవం, అవగాహన, మనసు విప్పి మాట్లాడుకోవడం బంధానికి నిజమైన పునాది.
అందుకే ఆన్‌లైన్ స్టేటస్‌ను పదేపదే చూడకుండా, అవసరమైనప్పుడు నేరుగా మాట్లాడండి. కొన్నిసార్లు గంటల తరబడి వెతికితే లభించని సమాధానం ఒక చిన్న సంభాషణతోనే దొరకవచ్చు.