E-Paper
Advertisement

క్లాస్ టాపర్ పక్కన కూర్చుంటే మీ పిల్లలు కూడా బాగా చదువుతారా? సైకాలజీ ఏం చెబుతోందంటే!

క్లాస్ టాపర్ పక్కన కూర్చుంటే మీ పిల్లలు కూడా బాగా చదువుతారా? సైకాలజీ ఏం చెబుతోందంటే!
Advertisement

Parenting Tips: పిల్లలు బాగా చదవాలంటే క్లాస్‌లో టాపర్ పక్కన కూర్చోబెట్టాలని చాలామంది తల్లిదండ్రులు అనుకుంటారు. అలా చేస్తే ఆ పిల్లాడి చదువు అలవాట్లు మన పిల్లలకు కూడా వస్తాయని ఆశిస్తారు. ఈ మాటలో కొంత నిజం ఉంది. అయితే పక్కన కూర్చున్నంత మాత్రాన మార్కులు పెరగవు. ఆ ఇద్దరి మధ్య ఎలాంటి పరిచయం ఉంది, ఒకరి నుంచి మరొకరు ఏం నేర్చుకుంటున్నారు అనేదే ముఖ్యం. మంచి స్నేహం, కలిసి చదివే అలవాటు ఉంటే అది పిల్లల చదువుకు ఉపయోగపడుతుంది.

చూసి నేర్చుకునే అలవాటు..

పిల్లలు పెద్దవాళ్ల మాటలతోనే కాదు.. తమ తోటి పిల్లలను గమనించడం ద్వారా కూడా ఎన్నో విషయాలు నేర్చుకుంటారు. సైకాలజిస్ట్ ఆల్బర్ట్ బండూరా చెప్పిన సోషల్ లెర్నింగ్ థియరీ కూడా ఇదే విషయాన్ని వివరిస్తుంది. టాపర్ హోంవర్క్‌ను సమయానికి పూర్తి చేయడం, అర్థం కానప్పుడు టీచర్‌ను అడగటం, రోజూ కొంతసేపు రివిజన్ చేయడం వంటివి పక్కనున్న పిల్లవాడు గమనించవచ్చు. ఆ అలవాట్లను తానూ ప్రయత్నించే అవకాశం ఉంటుంది. కష్టమైన ప్రశ్నను స్నేహితుడు పరిష్కరించడం చూస్తే, తనకూ సాధ్యమేననే నమ్మకం కలగొచ్చు.

కలిసి చదివితేనే ఉపయోగం..

Advertisement

మరో విద్యావేత్త లెవ్ వైగాట్స్కీ చెప్పిన ఆలోచన ప్రకారం.. సరైన సహాయం దొరికితే పిల్లలు ఒంటరిగా చేయలేని పనిని కూడా చేయగలరు. ఉదా: మ్యాథ్స్‌లో ఒక సమస్య అర్థం కాకపోతే.. తెలిసిన స్నేహితుడు దాన్ని చిన్న చిన్న దశల్లో వివరించవచ్చు. అలా చెప్పడం వల్ల విషయం సులభంగా అర్థమవుతుంది. అయితే ఇద్దరూ పక్కపక్కనే కూర్చుని మాట్లాడకుండా తమ పని తాము చేసుకుంటే పెద్దగా ప్రయోజనం ఉండదు. సందేహాలు అడగటం, ఒకరికొకరు వివరించడం, కలిసి ప్రాక్టీస్ చేయడం ముఖ్యం.

Also Read: జాగ్రత్త.. మీకు తెలియకుండానే ఈ యాప్స్ మిమ్మల్ని గమనిస్తున్నాయి, కెమెరా, మైక్ పర్మిషన్లను ఆపేయండిలా!

పరిశోధన ఏం చెబుతోంది?

Advertisement

2023లో హెలియాన్ జర్నల్‌లో వచ్చిన చైనా మధ్య పాఠశాలల అధ్యయనం కూడా తోటి విద్యార్థుల ప్రభావాన్ని పరిశీలించింది. చదువులో మంచి స్థాయిలో ఉన్న పిల్లలతో ఒకే తరగతిలో ఉన్న విద్యార్థులు గణితం, ఇంగ్లీష్‌లో మెరుగైన ఫలితాలు సాధించినట్టు పరిశోధకులు గుర్తించారు. ఎక్కువసేపు చదవడం, చదువుపై నమ్మకం పెరగడం కూడా దీనికి కారణాలుగా కనిపించాయి. అంటే, మంచి చదువు వాతావరణం పిల్లలకు తోడ్పడుతుంది.

పోలికలు వద్దు, ప్రోత్సాహం ముద్దు..

అయితే టాపర్‌తో పోల్చడం మాత్రం మంచిది కాదు. ‘నీ స్నేహితుడికి ఎక్కువ మార్కులు వచ్చాయి, నీకెందుకు రావు?’ అని అడిగితే పిల్లల్లో ఒత్తిడి, తక్కువ భావన పెరగొచ్చు. ప్రతి పిల్లవాడి నేర్చుకునే వేగం వేరు. అందుకే మార్కులతో పోల్చకుండా.. మంచి అలవాట్లను గుర్తించి ప్రోత్సహించాలి. టాపర్‌లా మారాలని ఒత్తిడి చేయకుండా, అతని నుంచి సమయపాలన, పట్టుదల, సందేహాలు అడిగే ధైర్యం వంటి విషయాలు నేర్చుకోమని చెప్పాలి. మొత్తానికి పిల్లలకు ఉపయోగపడేది టాపర్ పక్కన ఉండటం మాత్రమే కాదు.. కలిసి నేర్చుకునే మంచి స్నేహం, తమపై తమకు ఉండే నమ్మకం.

Also Read: భారతీయులు ఇల్లు క్లీన్ చేసే విషయంలో ఇంత నిర్లక్ష్యమా? డైసన్ సర్వేలో షాకింగ్ విషయాలు!

Tags

Related News

ఓ మధ్యతరగతి ఆలోచించండి.. అప్పుల పాలు కాకండి!

నూనె ఎక్కువ పీల్చకుండా గుల్లగా సన్న కారప్పూస రావాలంటే ఇలా చేసి చూడండి!

చలికాలంలో ఆరోగ్యంతో పాటు చర్మ సౌందర్యం కోసం మునగాకు సూప్.. తయారీ విధానం ఇదే!

బరువు తగ్గాలన్నా, కండలు పెంచుకోవాలన్నా పూర్తి గుడ్డు తినాలా? తెల్లసొన మాత్రమే సరిపోతుందా?

ఆదివారం లంచ్‌కు అదిరిపోయే రెసిపీ.. గోధుమ పిండితో యమ్మీ యమ్మీ మసాలా కుల్చా!

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో జన్మించిన అబ్బాయి అల్లుడిగా దొరికితే అత్తమామలకు అదృష్టం పట్టినట్లే

విదుర నీతి.. ఈ 4 చోట్ల డబ్బు ఖర్చు చేస్తే సంపద మొత్తం హరించుకుపోతుంది

Big Stories

Advertisement
×