Top 5 Diesel SUVs: కుటుంబంతో కలిసి లాంగ్ డ్రైవ్‌కు వెళ్లాలన్నా.. ఇతర పనుల కోసం వందల కిలోమీటర్లు ప్రయాణించాలన్నా మంచి SUV ఉండటం ఎంతో ముఖ్యం. ముఖ్యంగా ఎక్కువ దూరం ప్రయాణించే వారికి డీజిల్ వెహికల్స్ ఇప్పటికీ మంచి ఆప్షన్ గా నిలుస్తున్నాయి. పవర్ ఫుల్ ఇంజిన్, సూపర్ టార్క్ తో హైవేలపై అదిరిపోయే ప్రయాణాన్ని అందిస్తాయి. ప్రస్తుతం భారత మార్కెట్లో ఎన్నో SUVలు అందుబాటులో ఉన్నప్పటికీ, సుదూర ప్రయాణాలు, ఆఫ్‌రోడింగ్‌ను దృష్టిలో పెట్టుకుంటే ఈ ఐదు డీజిల్ SUVలను బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు.
ఆఫ్‌రోడింగ్‌తో పాటు హైవే ప్రయాణాలకు కూడా ఉపయోగపడే SUV కోసం చూస్తున్న వారికి మహీంద్రా థార్ రాక్స్ బెస్ట్ ఆప్షన్. ఇందులో 2.2 లీటర్ నాలుగు సిలిండర్ల టర్బో డీజిల్ mHawk ఇంజిన్ ఉంటుంది. ఇది వేరియంట్‌ను బట్టి 150 bhp నుంచి 172 bhp శక్తిని, 350 Nm నుంచి 370 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 6-స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలు ఉన్నాయి. దీని ప్రారంభ ధర రూ.14.23 లక్షలు.
భారత్ లో అత్యంత ప్రజాదరణ పొందిన ప్రీమియం SUVలలో టయోటా ఫార్చ్యూనర్ ఒకటి. ఇందులో 2.8 లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్ ఉంటుంది. ఇది సుమారు 201 bhp పవర్, 500 Nm టార్క్ ను అందిస్తుంది. 4×2, 4×4 డ్రైవ్ ఆప్షన్లతో లభిస్తుంది. లాంగ్ డ్రైవ్‌లతో పాటు గుంతల రోడ్లపై ప్రయాణించాలనుకునే వారికి ఇది బెస్ట్. దీని ప్రారంభ ధర రూ.35.75 లక్షలు.
భారీ SUVలను ఇష్టపడేవారి కోసం ఎంజీ మెజెస్టర్ మరో క్రేజీ ఆప్షన్. ఇందులో 2.0 లీటర్ ట్విన్ టర్బో డీజిల్ ఇంజిన్ ఉంటుంది. ఇది సుమారు 212.55 bhp పవర్, 478.5 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ తో వస్తుంది. దీని ప్రారంభ ధర రూ.43.49 లక్షలు.
ఆఫ్‌రోడింగ్‌ను ఇష్టపడేవారికి ఫోర్స్ గుర్ఖా ప్రత్యేకంగా నిలుస్తుంది. ఇందులో 2.6 లీటర్ నాలుగు సిలిండర్ల డీజిల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 138.08 bhp పవర్, 320 Nm టార్క్ ను అందిస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ మాత్రమే అందుబాటులో ఉంది. మూడు, ఐదు డోర్ల వెర్షన్లలో లభిస్తుంది. దీని ప్రారంభ ధర రూ.16.68 లక్షలు.
కుటుంబంతో కలిసి సుదూర ప్రయాణాలు చేసేవారికి జీప్ మెరిడియన్ కూడా బాగుంటుంది. ఇందులో 2.0 లీటర్ మల్టీజెట్ II టర్బో డీజిల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 167.67 bhp పవర్, 350 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్, 9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి. దీని ప్రారంభ ధర రూ.23.33 లక్షలు.
Read Also: కళ్లుమూసి తెరిచేలోపే వందల కిలోమీటర్ల వేగం.. ప్రపంచంలో టాప్ 5 ఫాస్టెస్ట్ కార్లు ఇవే!