Kissik Talks:జబర్దస్త్ కామెడీ షోలో తనదైన కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకున్న బాబు (Jabardasth Babu) గురించి పరిచయం ప్రత్యేకంగా అవసరం లేదు అద్భుతమైన డైలాగ్ డెలివరీతో, కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ఈయన.. ఇటీవల దర్శకుడిగా మారి తొలి ప్రయత్నంలోనే సక్సెస్ అందుకున్నారు. బాబు స్వీయ దర్శకత్వంలో ఓటీటీ యాప్ ఈటీవీ విన్ కోసం నిర్మించిన వెబ్ సిరీస్ లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. ఈ వెబ్ సిరీస్ తో దర్శకుడిగా మంచి పేరు సొంతం చేసుకున్న బాబు తాజాగా బిగ్ టీవీ ఎక్స్ క్లూజివ్ గా నిర్వహిస్తున్న కిస్సిక్ టాక్స్ (Kissik Talks)కార్యక్రమానికి ప్రముఖ ఆర్టిస్టు శ్రీ విద్యా(Sri vidhya)తో కలిసి విచ్చేశారు ఈ సందర్భంగా తన పెళ్లి గురించి ప్రస్తావించారు.
హోస్ట్ గా వ్యవహరిస్తున్న వర్షా మాట్లాడుతూ.. బాబు అన్న మీ పెళ్ళెప్పుడు? అని ప్రశ్నించింది. ఇకపోతే ఇటీవల తన గర్ల్ ఫ్రెండ్ ను బాబు శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో పరిచయం చేసిన విషయం తెలిసిందే .ఈ ఉద్దేశంలోనే ఆమె బాబు పెళ్లి పై ప్రస్తావించింది. బాబు మాట్లాడుతూ.. ఈ పది రోజుల్లోనే నా పెళ్లి అయిపోతుంది. నిజానికి పెళ్లి కూడా ఎవరికీ చెప్పకూడదు అనుకున్నాను. అందరినీ పిలిచి చేసుకునే అంత స్తోమత లేదు. నేను మా అమ్మగారు , మా ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఒక 20 మంది చాలా సింపుల్గా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాము. అంటూ బాబు తెలిపారు.
మరి కట్నం ఎంత తీసుకుంటున్నారు అని వర్షా అడగగా.. లవ్ మ్యారేజ్ కాబట్టి కట్టమేమీ లేదు అయితే వాళ్లు మొహమాటానికి ఇస్తాము అన్నారు. కానీ నేను అంతే మొహమాటంతో వద్దులే అని చెప్పాను అంటూ కట్న కానుకలు తీసుకోవడం లేదు అంటూ క్లారిటీ ఇచ్చారు.
ALSO READ:కామనర్స్ హౌస్లోకి రీ ఎంట్రీ..మిథిలేష్ దెబ్బకు ముఖేష్ గప్ చుప్ ..!
ప్రేమించావు.. పెద్ద డైరెక్టర్ అయ్యావు.. ఇప్పుడు పెళ్లి కొడుకు కూడా కాబోతున్నావు.. ఒకదాని తర్వాత ఒకటి సక్సెస్ వస్తున్న నేపథ్యంలో మీ ఫీలింగ్ ఎలా ఉంది అని వర్షా అడగగా.. ఒక సినిమా చేసిన తర్వాత పెళ్లి చేసుకుందామని చెప్పాను. ఎందుకంటే ఆ అమ్మాయికి కూడా చెప్పుకోవడానికి ఒకటి ఉండాలి కదా. జబర్దస్త్ బాబు అంటే కొంతమందికి మాత్రమే తెలుసు. వాళ్ల ఊరి వాళ్లకు చెప్పుకున్నా పెద్దగా ఉపయోగమేమీ ఉండదు. ఆ ఉద్దేశంతోనే నేను కూడా ఆగాను.అయితే ఇప్పుడు ప్రశాంతంగా తన కాబోయే భర్త లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ డైరెక్టర్ అని చెప్పుకుంటుంది అంటూ తన కాబోయే భార్య వైపు కూడా ఆలోచించి పెళ్లిని వాయిదా వేసినట్లు తెలిపారు బాబు