E-Paper
Advertisement

SSMB 29: రాజమౌళి మూవీపై కెన్యా మంత్రి బిగ్ అప్డేట్… ఈ ట్విస్ట్ మామూలుగా లేదుగా?

SSMB 29: రాజమౌళి మూవీపై కెన్యా మంత్రి బిగ్ అప్డేట్… ఈ ట్విస్ట్ మామూలుగా లేదుగా?

SSMB 29:టాలీవుడ్ దిగ్గజ దర్శకుడిగా పేరు సొంతం చేసుకున్న రాజమౌళి (Rajamouli ) అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఎస్ఎస్ఎంబి29’. సూపర్ స్టార్ మహేష్ బాబు(Maheshbabu ) హీరోగా, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా(Priyanka Chopra) హీరోయిన్గా నటిస్తున్నారు. వీరితోపాటు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) కీలకపాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో యాక్షన్ అడ్వెంచర్ మూవీగా రాబోతున్న ఈ సినిమా నుంచి అఫీషియల్ అప్డేట్ నవంబర్లో రిలీజ్ చేస్తానని ఇటీవల మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా రాజమౌళి ట్విట్టర్ వేదికగా వెల్లడించిన విషయం తెలిసిందే.

కెన్యా మంత్రిని కలిసిన రాజమౌళి టీమ్..

ఇక దీంతో అప్పటినుంచి ఈ సినిమాకు సంబంధించిన ఏదో ఒక అప్డేట్ అభిమానులలో ఆసక్తిని పెంచుతోంది.. ఇదిలా ఉండగా ఇప్పుడు ఏకంగా కెన్యా మంత్రి ఈ సినిమా గురించి అప్డేట్ ఇవ్వడం మరింత సంచలనంగా మారింది. అసలు విషయంలోకి వెళ్తే.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కెన్యాలో జరుగుతోంది. ఈ సందర్భంగా ఆ దేశ మంత్రి ముసాలియా ముదావాదిని (Musalia w Mudavadi) చిత్ర బృందం మర్యాదపూర్వకంగా కలిసింది. అనంతరం ఆ విషయాలను సోషల్ మీడియా ద్వారా అక్కడి మంత్రి పంచుకున్నారు. మరి కెన్యా మంత్రి ఈ సినిమా గురించి ఏం చెప్పారు అనే విషయానికి వస్తే.. అందుకు సంబంధించిన ట్విట్టర్ కూడా ఇప్పుడు వైరల్ గా మారింది.

రాజమౌళి మూవీపై ప్రశంసలు కురిపించిన కెన్యామంత్రి..

ఆయన తన ట్విట్టర్ ద్వారా..” 20 సంవత్సరాలుగా సినీ ఇండస్ట్రీలో దర్శకుడు రాజమౌళి కొనసాగుతున్నారు. ఆయన ఎంతో శక్తివంతమైన కథనాలను, లోతైన సాంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పడంలో మరింత ప్రసిద్ధి పొందారు. దాదాపు తూర్పు ఆఫ్రికా అంతటా పర్యటించిన తర్వాత 120 మందితో కూడిన రాజమౌళి టీం ఇప్పుడు కెన్యాని ఎంచుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. మరా మైదానాలను మొదలుకొని సుందరమైన నైవాషా , ఐకానిక్ అంబోసెలి వంటి ప్రాంతాలు ఆసియాలోనే అతిపెద్ద చలనచిత్రంగా తెరకెక్కుతున్న సినిమాలో భాగం కాబోతున్నాయని మేము గర్వంగా చెబుతున్నాము. దాదాపు 120 దేశాలలో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. రూ. 100 కోట్ల మందికి పైగానే ఈ సినిమా చేరువయ్యే అవకాశం కూడా ఉంది. ప్రపంచ వేదికపై మా దేశ అందాలను, ఆతిథ్యాన్ని, సుందరమైన దృశ్యాలను చూపడంలో ఈ సినిమా మరింత శక్తివంతంగా పనిచేస్తోంది. ఎస్ఎస్ఎంబి 29 సినిమా ద్వారా కెన్యా తన చరిత్రను ప్రపంచంతో పంచుకోవడానికి సిద్ధంగా ఉండటమే కాకుండా ఈ విషయంలో మేము మరింత గర్వంగా ఉన్నాము” అంటూ కెన్యా మంత్రి తన పోస్ట్ ద్వారా తెలియజేశారు.

విదేశీ నటులు కూడా..

మొత్తానికైతే ప్రపంచ దేశాలను రాజమౌళి చుట్టేయబోతున్నారని గతంలో వచ్చిన వార్తలు ఇప్పుడు నిజం అవుతుండడంతో ఈ సినిమా నుంచి వస్తున్న అప్డేట్స్ కూడా నిజమని అభిమానులు ఎక్సైట్ ఫీలవుతున్నారు.. ఏది ఏమైనా రాజమౌళి చేస్తున్న ఈ అతిపెద్ద సాహసానికి ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు లభిస్తుందని.. రాజమౌళి అభిమానులే కాదు యావత్తు ప్రపంచ సినీ ప్రేక్షకులు కూడా చెబుతున్నారు. అంతేకాదు ఈ సినిమాలో విదేశీ నటులు కూడా భాగం కాబోతున్నారట.

 

https://twitter.com/MusaliaMudavadi/status/1962852401607487920/photo/2

Related News

బాలీవుడ్ ప్రముఖ నిర్మాత, సీబీఎఫ్‌సీ మాజీ చీఫ్ కన్నుమూత.. ఏం జరిగిందంటే?

‘పెద్ది’ రిలీజ్ తర్వాత రామ్ చరణ్‌ను చూసి మురిసిపోతున్న మెగాస్టార్.. ఏం అన్నారంటే?

హీరో అర్జున్ ఇంట్లో త్వరలోనే పెళ్లి బాజాలు.. అల్లుడు ఎవరంటే..?

రామ్ చరణ్ ‘పెద్ది’ చూసిన తర్వాత సెలబ్రిటీల రియాక్షన్ ఇదే!..

ప్రకాష్ రాజ్‌కి బండ్ల గణేష్ ఇచ్చిపడేశాడుగా!.. ఏంటి బాసూ అలా అనేశావ్..

బాబాయ్ రికార్డులకు ఎసరు పెట్టిన అబ్బాయ్.. ప్రీమియర్ ‘షో’ చూపించేశాడు!

మెగాస్టార్‌ను మించిపోయిన రామ్ చరణ్.. అంతగా ‘పెద్ది’తో ఏం చేశాడంటే?

‘పెద్ది’ ఎంట్రీ చూసి ఉపాసన ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు.. అయితే సినిమా..

Big Stories

×