White Hair: ప్రస్తుతం చిన్నా.. పెద్ద అనే తేడా లేకుండా తెల్ల జుట్టు రావడం సర్వసాధారణం అయింది. దీనికి దుమ్మూ, ధూళి, కాలుష్యం, స్ట్రెస్ ఇంకా అనేక కరాణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం బయట మార్కెట్లో వివిధ రకాల హెయిర్ సీరమ్స్, హెయిర్ కలర్స్ వంటివి ఉపయోగిస్తుంటారు. ఇవి టెంపరరీగా పనిచేస్తాయి తప్ప.. శాశ్వతంగా పనిచేయవు. పైగా వాటి వల్ల జుట్టు నిర్జీవంగా, పొడిబారిపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి మన ఇంట్లోనే సహజ పదార్ధాలతో హెయిర్ మాస్క్‌లు తయారు చేసుకున్నారంటే మంచి ఫలితం ఉంటుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. జుట్టు ఆరోగ్యంగా, ఒత్తుగా పెరుగుతుంది. మరి ఆ టిప్స్ ఏంటో ఓసారి తెలుసుకుందాం.
కావాల్సిన పదార్ధాలు
కలబంద
ఉల్లిపాయ
కరివేపాకు
తయారు చేసుకునే విధానం..
ముందుగా కలబంద గుజ్జు, ఉల్లిపాయను ముక్కలు, కరివేపాకు మిక్సీజార్‌లో తీసుకుని మెత్తగా పేస్ట్‌లాగా చేసుకోవాలి. ఆ తర్వాత కాటన్ క్లాత్‌లో వేసి రసాన్ని ఒక గిన్నెలో తీసుకోవాలి. అందులో మూడు టేబుల్ స్పూన్ నిమ్మరసం కలిపి జుట్టు కుదుళ్లకు అప్లై చేసి.. మృదువుగా మసాజ్ చేయండి. గంట తర్వాత సాధారణ షాంపూతో తలస్నానం చెయ్యండి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే.. క్రమంగా తెల్ల జుట్టు అనేది ఆగిపోతుంది. ఇది జుట్టు పొడవుగా, ఒత్తుగా పెరిగేందుకు అద్భుతంగా పనిచేస్తుంది. చుండ్రు సమస్యలను దూరం చేస్తుంది. కాబట్టి మీరు కూడా ఓసారి ఈ హెయిర్ మాస్క్ ట్రై చేయండి.
గోరింటాకు, నిమ్మరసం హెయిర్ మాస్క్
తెల్లజుట్టు నివారణకు గోరింటాకు చక్కగా పనిచేస్తుంది. నిమ్మరసంలో ఉండే విటమిన్ సి హెయిర్ ఫాల్‌ను తగ్గిస్తుంది. ఇందుకోసం గోరింటాకును మెత్తగా పేస్ట్ చేసి అందులో రెండు టేబుల్ స్పూన్ నిమ్మరసం కలిపి తలకు అప్లై చేయండి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే తెల్లజుట్టును నివారిస్తుంది. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.
Also Read: జుట్టు పెరగడంలేదని బాధపడుతున్నారా? ఈ నూనె ట్రై చేసి చూడండి.
కొబ్బరి నూనె, ఉసిరి హెయిర్ మాస్క్..
తెల్ల జుట్టు నివారణకు కొబ్బరి నూనె, ఉసిరి అద్భుతంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో కొబ్బరి నూనె, ఉసిరి పొడిని వేసి, బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మరిగించండి. ఈ తర్వాత ఈ నూనెను వడకట్టి గాజు సీసాలో తీసుకోండి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు అప్లై చేయండి. రాత్రంతా అలానే ఉంచి ఉదయం సాధారణ షాంపుతో తలస్నానం చెయ్యండి. క్రమంగా కొద్దిరోజులకు జుట్టు నల్లగా మారుతుంది.
బ్లాక్ టీ..
తెల్ల జుట్టు నల్లగా మార్చేందుకు బ్లాక్ టీ చక్కగా ఉపయోగపడుతుంది. ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి అందులో ఒక కప్పు వాటర్, బ్లాక్ టీ ఆకులను, లేదా పొడిని వేసి బాగా మరిగించాలి. 20 నిమిషాల తర్వాత స్టవ్ కట్టేసి చల్లారనివ్వండి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేసి మృదువుగా మసాజ్ చేయండి. వారం రోజుల్లోనే మంచి రిజల్ట్ కనిపిస్తుంది. క్రమంగా తెల్లజుట్టు సమస్యలు తొలగిపోతాయి.
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.