Chamanthi Serial : సీరియల్ హీరోయిన్లకు సినిమా హీరోయిన్ల కంటే ఎక్కువ డిమాండ్ ఉంటుందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎప్పుడూ ఏడాదికి ఒక సినిమాతో కనిపించే హీరోయిన్ల కన్నా ప్రతిరోజు పలు సీరియల్స్లలో నటిస్తూ తమ క్యారెక్టర్ తో అలరిస్తూ వస్తున్న సీరియల్ ముద్దుగుమ్మలకి మంచి క్రేజ్ కూడా ఉంది. జీ తెలుగులో ప్రసారమవుతున్న చామంతి సీరియల్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఈ సీరియల్లో హీరోయిన్గా మేఘన లోకేష్ నటించారు.. ఇది ఈమె నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు గతంలో అనేక సీరియల్స్లలో నటించి తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అలాంటి ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు సీరియల్ నుంచి తప్పుకుంది అని తెలిసి చాలామంది అభిమానులు ఫీల్ అయిపోతున్నారు. అసలు ఈ హీరోయిన్ ఎందుకు ఈ సీరియల్ నుంచి తప్పుకుంది అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. మరి ఆమె ఎందుకు ఈ సీరియల్ నుంచి తప్పుకుందో ఒక్కసారి మనం ఇక్కడ తెలుసుకుందాం..
చామంతి సీరియల్ లో టైటిల్ రోల్ లో నటించిన హీరోయిన్ మేఘన లోకేష్ ఇప్పుడు ఈ సీరియల్ నుంచి తప్పుకోవడం పై అనేక ప్రశ్నలు వినిపిస్తున్నాయి. నిజానికి ఆమె తప్పుకోడానికి ఒక పెద్ద కారణమే ఉందని తెలుస్తుంది. అసలు ఆ కారణం ఏంటి అన్నది తెలుసుకునేందుకు నెటిజన్లు గూగుల్లో తెగ వెతికిస్తున్నారు. నిజానికి ఆ కారణం మరేంటో కాదు ఆమె గర్భవతిగా ఉండటం వల్లే సీరియల్ నుంచి తప్పుకుంది అని తెలుస్తుంది.. మొత్తానికి ఆమె ప్రెగ్నెంట్ కావడంతో డెలివరీ సమయం దగ్గర పడుతుంది అని సీరియల్ నుంచి తప్పుకుందని తెలుస్తుంది. ఇటీవలే ఈమె సీమంతం కూడా గ్రాండ్ గా జరగడం వీడియో ఒకటి బయటకు రావడంతో అందరూ అదే నిజమని అనుకుంటున్నారు.. ఆ వీడియో మీరు కూడా ఒకసారి చూసేయండి..
మేఘన లోకేష్ గురించి అందరికీ తెలిసి ఉంటుంది ఈమె పది సీరియల్స్ లను నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. నిజానికి ఈమె తెలుగు అమ్మాయి కాకపోయినా అత్యతులకు అమ్మాయిలాగే కనిపించి అందరిని ఆకట్టుకుంది. కర్ణాటకకు చెందిన ఈ ముద్దుగుమ్మ అక్కడ పలు సీరియల్స్లలో నటించి ప్రేక్షకులను తన నటనతో మెప్పించింది. కర్ణాటక కు చెందిన స్వరూప్ భరద్వాజ తో పరిచయం ఏర్పడింది.. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. అయితే తమ ప్రేమ గురించి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడంతో వాళ్ళను ఎదిరించి పెళ్లి చేసుకుంది.. ఇప్పుడు అంత సెట్ అవ్వడంతో ఇరు కుటుంబాల మధ్య సానిత్యం కూడా ఏర్పడిందని తెలుస్తుంది. మరి ఈమె ఇక మీదట సీరియల్స్ చేస్తుందా? చేయదా? అన్నది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది.. మరి ఇకమీదట ఏం జరిగిందో అనేది ముందు ముందు చూడాలి.. ఏది ఏమైనా ఇలాంటి నటిని మిస్ అవ్వడం అభిమానులు ఫీల్ అవుతున్నారు.