E-Paper
Advertisement

ఏపీలో తుఫాన్.. కీలక నిర్ణయం తీసుకున్న విశ్వక్ సేన్!

ఏపీలో తుఫాన్.. కీలక నిర్ణయం తీసుకున్న విశ్వక్ సేన్!
Advertisement

Vishwaksen:ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అర్నబ్ తుఫాను సృష్టిస్తున్న విధ్వంసం ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ తుఫాను ప్రభావంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ (Vishwak sen) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన స్వీయ దర్శకత్వంలో వస్తున్న కల్ట్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడమే కాకుండా తుఫాను బాధితులకు అండగా నిలవాలి అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. మరి అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం.

ఏపీలో అర్నబ్ తుఫాను.. హీరో కీలక పిలుపు..

ఇండియన్ సినిమా హిస్టరీ లోనే తొలి ఆర్ రేటెడ్ మూవీ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న కల్ట్ సినిమా అక్టోబర్ 30 తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. దీంతో అక్టోబర్ 29వ తేదీన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించాలని మేకర్స్ ముందుగా ప్రకటించారు.. కానీ ప్రజలు అర్నబ్ తుఫాను ప్రభావంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో..ఈ ఈవెంట్ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ఒక వీడియో విడుదల చేశారు.

ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు..

Advertisement

అందులో విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్లో తుఫాను సృష్టించిన బీభత్సం నన్ను కలచివేసింది. ఎంతోమంది కుటుంబాలు ఈ విపత్తు కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇలాంటి సమయంలో సినిమా వేడుకలు నిర్వహించడం సరైనది కాదు. అందుకే కల్ట్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రద్దు చేస్తున్నాము. ఈ సందర్భంగా “లెట్స్ స్టాండ్ విత్ ఏపీ” అంటూ తుఫాను బాధితులకు అండగా నిలవాలి అని కోరుకుంటున్నాను అంటూ బాధితులకు మీ వంతు సహాయం చేయండి అంటూ ఆయన పిలుపునిచ్చారు. మొత్తానికైతే ఏపీ తుఫాను బాధితుల కోసం తన సినిమా ఈవెంట్ ను రద్దు చేయడమే కాకుండా బాధితులకు అండగా నిలబడదాం అంటూ విశ్వక్ సేన్ పిలుపునివ్వడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

విడుదల తేదీలో ఎలాంటి మార్పు లేదు..

ఇదే సమయంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు చేసినప్పటికీ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలపై ఆయన స్పష్టత ఇచ్చారు. అక్టోబర్ 29న ప్రెస్ మీట్ నిర్వహించి కల్ట్ రిలీజ్ ట్రైలర్ ను విడుదల చేస్తున్నట్లు తెలిపారు. అలాగే విడుదల తేదీలో ఎలాంటి మార్పు లేదని చెప్పిన విశ్వక్ సేన్ ముందుగా ప్రకటించినట్టుగానే అక్టోబర్ 30వ తేదీన ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు విడుదల చేసిన ఈ ట్విట్టర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

also read: హిందూ దేవుళ్ళపై వివాదం.. క్లారిటీ ఇచ్చిన అనసూయ.. వీడియో వైరల్!

విశ్వక్ సేన్ కెరియర్..

గత కొంతకాలంగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న విశ్వక్ సేన్ ఇప్పుడు స్క్విడ్ గేమ్, ఆపరేషన్ x సినిమాల తరహాలో కల్ట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మరి ఈ సినిమాతో ఆయన మంచి సక్సెస్ అందుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ఇకపోతే జెన్జీ యువతను టార్గెట్ గా చేసుకొని సినిమాను విడుదల చేస్తున్నామని చెప్పిన విశ్వక్ సేన్ ఈ సినిమాతో ఎలాంటి విజయం అందుకుంటారో చూడాలి.

Related News

దేత్తడి హారిక నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

సుమను ఇరికించిన ప్రజ్వల్.. ఇంటర్వ్యూలో నవ్వులే నవ్వులు!

పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న వేళ.. చిరంజీవితో ఇద్దరు మాస్టర్లు!

అన్యా సింగ్‌కు ఎల్లే ఇండియా నుంచి స్పెషల్ ట్రీట్.. ఫుల్ ఖుషీలో బ్యూటీ!

ఆ సినిమాను కొనేవాళ్లే లేరా? రిలీజ్‌కు ముందే రూ.15 కోట్ల నష్టం?

సంక్రాంతి వరకు సినిమాల జాతరే.. ప్రతి వారం కొత్త సినిమాల దండయాత్ర!

విశ్వక్ సేన్ కల్ట్‌లో రక్తపాతమే హైలైటా?

Big Stories

Advertisement
×