America: అమెరికాలో అణు పరిశోధన కేంద్రంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటన కారణంగా రేడియేషన్ లీకై ఉండవచ్చని అనే భయాలు నెల కొన్నాయి. ఆ ప్రాంతంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించింది సదరు కంపెనీ. అసలు ఘటన ఎలా జరిగింది? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.
అమెరికాలోని సౌత్ కరోలినాలోని సవన్నా రివర్ నేషనల్ న్యూక్లియర్ ప్లాంట్ ఉంది. అక్కడ లేబరేటరీ గదిలో బుధవారం సాయంత్రం అగ్రి ప్రమాదం జరిగింది. అణ్వాయుధాల కోసం ముడి పదార్థాలను ఉత్పత్తి చేసే ల్యాబ్ అది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అలర్టయిన అధికారులు రెండు గంటల్లో మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదం నేపథ్యంలో రేడియేషన్ బయటకు విడుదల అయ్యే ప్రమాదం ఉందని అనుమానించారు అధికారులు. వెంటనే ఎమర్జెన్సీ విధించారు. ఆ రేడియో ధార్మికత కేవలం ల్యాబ్ ఉన్న ప్రాంతానికి పరిమితం అయ్యిందని అంటున్నారు.
బయట ప్రజలకు దీనివల్ల ఎలాంటి ప్రమాదం లేదని చెబుతున్నారు. అగ్ని ప్రమాదం విషయం బయటకు తెలియగానే ఆ ప్రాంత ప్రజల్లో ఆందోళనలు మొదలయ్యాయి. పరిస్థితి గమనించిన అధికారులు.. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ల్యాబ్ ప్రవేశ మార్గాలను మూసివేశారు. అంతేకాదు సమీపంలో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ఆ ప్రాంతంలో మీదుగా రైలు, నదీ, విమాన మార్గాల రాకపోకలను నియంత్రించినట్లు ఓ వార్తా సంస్థ తెలిపింది. బుధవారం రాత్రి 9.45 గంటలకు అత్యవసర పరిస్థితిని ముగించారు. కార్మికులందరూ షిఫ్ట్‌కు యధావిధిగా హాజరయ్యారని ఆ సంస్థ అధికారులు వెల్లడించారు.
ALSO READ: మార్కెట్‌పై డ్రోన్లతో దాడి.. ఏకంగా 100 మంది మృతి, సుడాన్లో ఘోరం
బుధవారం ఉదయం తాము తీసుకోవలసిన చర్యల గురించిన తాజా సమాచారం కోసం స్థానిక వార్తలను గమనిస్తూ ఉండాలని అధికారులు సూచించారు. ప్రభావిత ప్రాంతాల్లో పని చేస్తున్న ఉద్యోగులను ముందస్తు జాగ్రత్తగా సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు.
సవన్నా రివర్ న్యూక్లియర్ కేంద్రం ఆ దేశ జాతీయ అణు భద్రతా పరిపాలన సంస్థ పర్యవేక్షణలో రెండు ఉన్నాయి. ఈ సైట్‌ను ప్రైవేట్ కాంట్రాక్టర్లు నిర్వహిస్తున్నారు. ప్రయోగశాలను బాటెల్ సవన్నా రివర్ అలయన్స్, రక్షణ కేంద్రాన్ని సవన్నా రివర్ న్యూక్లియర్ సొల్యూషన్స్, LLC నిర్వహిస్తున్నాయి. అక్కడ 13,000 మందికి పైగా కాంట్రాక్టు ఉద్యోగులు పని చేస్తున్నారు.
అమెరికా అణ్వాయుధాల కోసం ట్రిటియం, ప్లూటోనియంలను ఉత్పత్తి చేయడానికి 1950ల్లో వీటిని నిర్మించారు. ఇప్పటికే ఆ కేంద్రం ట్రిటియంను ఉత్పత్తి చేస్తూనే ఉంది. వాడిన అణు ఇంధనాన్ని నిర్వహించడంతోపాటు యురేనియం, ప్లూటోనియంలను నిల్వ చేస్తుంది. అగ్నిప్రమాదం జరిగిన ఈ కేంద్రంలో ల్యాబ్, భారీ స్థాయిలో అణు పదార్థాల ఉత్పత్తి నిల్వపై కాకుండా ప్రధానంగా పరిశోధనపై దృష్టి సారిస్తుందని చెబుతున్నారు.