BigTV English

Potato Chips Side Effects: చిప్స్ ఎక్కువగా తింటున్నారా..! అయితే మీ పని ఔట్..

Potato Chips Side Effects: చిప్స్  ఎక్కువగా తింటున్నారా..! అయితే మీ పని ఔట్..

Potato Chips Side Effects: ప్రస్తుత కాలంలో చిప్స్ అంటే ఇష్టపడని వారు ఉండరు.. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు అందరు ఎంతో ఇష్టంగా తింటుంటారు. కానీ చిప్స్ వల్ల శరీరానికి ఎంత నష్టం కలుగుతుందో తెలుసుకుంటే అందరూ షాక్ అవుతారు. చిప్స్ ఎక్కువగా తినడం వల్ల అనేక అనారోగ్య సమస్యలను కలిగిస్తుంది. చిప్స్‌లో సాధారణంగా అధిక మొత్తంలో కొవ్వు, ఉప్పు, కేలరీలు మరియు కృత్రిమ అడిటివ్‌లు ఉంటాయి, ఇవి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి.


1. ఊబకాయం, బరువు పెరుగుట
చిప్స్‌లో అధిక కేలరీలు మరియు ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి త్వరగా బరువు పెరగడానికి దారితీస్తాయి. ఎక్కువగా వీటిని తినడం వల్ల కేలరీలు శరీరంలో పేరుకుపోయి ఊబకాయం వస్తుంది. ఇది గుండె జబ్బులు, మధుమేహం, కీళ్ల నొప్పుల వంటి సమస్యలకు దారితీస్తుంది.

2. గుండె సంబంధిత సమస్యలు
చిప్స్‌లో ఉండే సంతృప్త కొవ్వులు, ట్రాన్స్ ఫ్యాట్స్ రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతాయి. ఈ హై కొలెస్ట్రాల్ వల్ల ధమనులు అడ్డుకుంటాయి. దీంతో
గుండెపోటు, హై బ్లడ్ ప్రెషర్, స్ట్రోక్ వంటి గుండె సంబంధిత రోగాల ప్రమాదం పెరుగుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.


3. అధిక రక్తపోటు
చిప్స్‌లో ఉప్పు అధికంగా ఉంటుంది. ఒక చిన్న ప్యాకెట్ చిప్స్‌లో 500-1000 మి.గ్రా సోడియం ఉండవచ్చు. అధిక సోడియం తీసుకోవడం వల్ల రక్తపోటు పెరుగుతుంది, ఇది గుండె మరియు మూత్రపిండాలపై ఒత్తిడిని పెంచుతుంది. రోజుకు 1500-2300 మి.గ్రా సోడియం మాత్రమే తీసుకోవాలని WHO తెలిపింది.

4. మధుమేహం
దీనిలో ఉండే సరళ కార్బోహైడ్రేట్లు, అధిక కేలరీలు రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచుతాయి. దీంతో ఇన్సులిన్ సమస్యలు తలెత్తుతాయి, ఇది టైప్-2 డయాబెటిస్‌కు దారితీస్తుంది. ఎక్కువ కేలరీలు శరీరంలో కొవ్వుగా మారి ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ను పెంచుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

5. జీర్ణ సమస్యలు
చిప్స్‌లో ఫైబర్ లేకపోవడం, అధిక కొవ్వు, కృత్రిమ రుచుల వల్ల జీర్ణ వ్యవస్థపై ఒత్తిడి పడుతుంది. దీని వల్ల గ్యాస్, అసిడిటీ, ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఎక్కువగా చిప్స్ తినడం వల్ల పేగు ఆరోగ్యం దెబ్బతింటుంది, ఇది గట్ మైక్రోబయోమ్‌పై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు.

6. క్యాన్సర్ ప్రమాదం
కొన్ని చిప్స్‌లో ఉండే అక్రిలమైడ్ అనే రసాయనం, బంగాళదుంపలను అధిక ఉష్ణోగ్రతల వద్ద వేయించడం వల్ల ఏర్పడుతుంది. ఈ అక్రిలమైడ్ కొన్ని రకాల క్యాన్సర్‌ల ప్రమాదాన్ని పెంచుతుంది.

7. పోషకాహార లోపం
చిప్స్‌లో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ వంటి అవసరమైన పోషకాలు లేవు. ఇవి “ఖాళీ కేలరీల” ఆహారంగా పరిగణించబడతాయి. ఎక్కువ చిప్స్ తినడం వల్ల అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. దీనివల్ల విటమిన్ లోపాలు, బలహీనమైన రోగనిరోధక శక్తి వస్తుంది. అంతేకాకుండా పిల్లలలో ఎదుగుదల, మానసిక అభివృద్ధి పై ప్రభావం పడవచ్చు.

8. మానసిక ఆరోగ్యంపై ప్రభావం
ఇందులో ఉండే అధిక చక్కెర, ఉప్పు, కృత్రిమ అడిటివ్‌లు మెదడు రసాయనాలను ప్రభావితం చేస్తాయి. మానసిక ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలు పెరగవచ్చని తెలిపారు.

9. దంత సమస్యలు
చిప్స్‌లోని స్టార్చ్, చక్కెరలు దంతాలపై అంటుకుని బ్యాక్టీరియా వృద్ధికి దారితీస్తాయి. దీంతో దంత క్షయం, దంతాల బలహీనత, చిగుళ్ల వ్యాధులు వస్తాయని చెబుతున్నారు.

వీటికి బదులుగా పండ్లు, కూరగాయలు, నట్స్, పెరుగు వంటి ఆరోగ్యకరమైన స్నాక్స్ తినడం మంచిది. దీంతో మీ మొత్తం ఆరోగ్యం బాగుంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Related News

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Weight Loss: ఈ యోగాసనాలతో.. 10 రోజుల్లోనే వెయిట్ లాస్

Sugar: చక్కెర తినడం 30 రోజులు ఆపేస్తే.. ఏం జరుగుతుందో తెలుసా ?

Big Stories

×