BigTV English

Hepatitis: హెపటైటిస్ రిస్క్ నుంచి కాపాడుకోవడానికి ఇలా చేయండి..

Hepatitis: హెపటైటిస్ రిస్క్ నుంచి కాపాడుకోవడానికి ఇలా చేయండి..

Hepatitis: హెపటైటిస్ అనేది లివర్ ఇన్‌ఫెక్షన్ వల్ల వస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అధికంగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కూడా ఈ సమస్య పెరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు. కొన్ని సందర్భాల్లో, శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ కాలేయంపై దాడి చేయడం వల్ల కూడా హెపటైటిస్ వచ్చే ఛాన్స్ ఉందని డాక్టర్లు చెబుతున్నారు. ఇందులో 5 రకాలు ఉంటాయట.


కలుషిత ఆహారం లేదా నీరు తీసుకోవడం వల్ల హెపటైటిస్-A వస్తుందట. రక్తం లేదా సెమెన్ ద్వారా హెపటైటిస్-B వ్యాప్తి చెందుతుందట. ఎక్కువ శాతం రక్తం వల్లనే హెపటైటిస్-B వచ్చే ఛాన్స్ ఉందని డాక్టర్లు చెబుతున్నారు. హెపటైటిస్-Bతో పాటు వచ్చే వైరల్ ఇన్‌ఫెక్షన్‌ను హెపటైటిస్-D అంటారట. కలుషితమైన నీళ్లు తీసుకోవడం వల్ల వచ్చే దాన్ని హెపటైటిస్-E అని పిలుస్తారు.

హెపటైటిస్ లక్షణాలు:
హెపటైటిస్ లక్షణాలు ఇన్ఫెక్షన్ల రకాన్ని బట్టి ఉంటాయట. హెపటైటిస్ ఉంటే అలసిపోయినట్లు లేదా బలహీనంగా అనిపిస్తుందట. కాలేయం బిలిరుబిన్‌ను సరిగ్గా ప్రాసెస్ చేయలేకపోవడం వల్ల చర్మం, కళ్లు పసుపు రంగులోకి మారిపోతాయట. దీంతో కామెర్లు వచ్చే ఛాన్స్ ఉందని డాక్టర్లు చెబుతున్నారు. కొన్ని సార్లు లివర్ ఉండేవైపు ఎక్కువగా కడుపులో నొప్పిగా అనిపిస్తుందట.


మరికొందరిలో హెపటైటిస్ వల్ల తరచుగా వికారంగా అనిపిస్తుందట. కొన్ని సార్లు జీర్ణసమస్యలు కూడా వచ్చే ఛాన్స్ ఉందని డాక్టర్లు చెబుతున్నారు. హెపటైటిస్ వల్ల కడుపు ఉబ్బరం, కండరాల నొప్పులు, మూత్రం నల్లగా రావడం వంటివి జరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు. హెపటైటిస్ ఉన్నవారిలో తరచుగా పొత్తికడుపులో నొప్పిగా ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు.

ALSO READ: ఈ సమస్య వస్తే నిద్రలోనే శ్వాస ఆగిపోతుందట..!

లివర్‌కు చాలా డేంజర్:
దీర్ఘకాలికంగా ఇబ్బంది పెట్టే హెపటైటిస్ వల్ల లివర్ పనితీరుపై చెడు ప్రభావం పడే ఛాన్స్ ఉందని డాక్టర్లు వెల్లడిస్తున్నారు. కొందరిలో లివర్ సిర్రోసిస్ వస్తుంది. దీని వల్ల లివర్ కణజాలంపై మచ్చలు ఏర్పడతాయట. దీర్ఘకాలిక హెపటైటిస్ ముఖ్యంగా హెపటైటిస్-B,C వల్ల లివర్ క్యాన్సర్ రిస్క్ పెరుగుతుందట. కొన్ని సందర్భాల్లో లివర్ ఫెయిల్ అయ్యే అవకాశం కూడా ఉందని వైద్యులు పేర్కొంటున్నారు.

హెపటైటిస్ రావొద్దంటే ఇలా చేయండి:
వ్యక్తిగత శుభ్రత లేనప్పుడు కూడా హెపటైటిస్ వచ్చే ఛాన్స్ ఉందట. కాబట్టి తరచుగా చేతులు కడుక్కోవడం, శానిటైజర్ వాడడం అలవాటు చేసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

హెపటైటిస్-C సాధారణంగా రక్తం నుండి వ్యాపిస్తుంది. అందుకే మడికల్ ఫీల్డ్‌లో కూడా ఒకరు వాడిన సూదిని మరొకరు వాడకూడదు.

హెపటైటిస్ ఉన్న వ్యక్తులు ఆల్కహాల్ తీసుకుంటే లివర్ చెడిపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇప్పటికే ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు అధికంగా మద్యం తీసుకోవద్దని డాక్టర్లు సూచిస్తున్నారు.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు

Tags

Related News

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Tan Removal Tips: ముఖం నల్లగా మారిందా ? ఇలా చేస్తే.. క్షణాల్లోనే గ్లోయింగ్ స్కిన్

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Big Stories

×