Nani : నేచురల్ స్టార్ నాని (Nani) ఓవైపు హీరోగా, మరోవైపు నిర్మాతగా దూసుకెళ్తున్నారు. ఇటీవల ‘కోర్టు’ (Court Movie) మూవీతో హిట్ అందుకున్న ఈ హీరో ప్రస్తుతం ‘హిట్ 3’ (Hit3), ‘ది ప్యారడైజ్’ (The Paradise) అనే రెండు క్రేజీ ప్రాజెక్టులను లైన్లో పెట్టారు. అయితే ఇటీవల కాలంలో నాని సినిమాలపైనే స్పెషల్ గా నెగెటివ్ ప్రచారం జరుగుతుండడం హాట్ టాపిక్ గా మారింది. నిన్నటికి నిన్న ‘ది ప్యారడైజ్’ ఆగిపోయిందనే ప్రచారం, ఈరోజు ‘హిట్ 3’ లీక్… ఈ నేపథ్యంలోనే అసలు నాని సినిమాలకే ఎందుకిలా జరుగుతుంది? కావాలనే ఎవరైనా నానిని టార్గెట్ చేస్తున్నారా ? అనే చర్చ మొదలైంది. మరి ఇంతకీ నాని సినిమాల విషయంలో ఏం జరుగుతోంది? అనే వివరాల్లోకి వెళితే…
గజరాజు నడిస్తే గజ్జి కుక్కలు అరుస్తాయి…
నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ది ప్యారడైజ్’. అంతేకాకుండా నాని స్క్రిప్ట్ విషయంలో మార్పులు చేర్పులు సూచించడంతో, బడ్జెట్ పెరిగిపోయి సినిమాను ఆపేసారని టాక్ నడిచింది. దీంతో చిత్ర బృందం ఈ విషయంపై స్పందిస్తూ స్ట్రాంగ్ గా రియాక్ట్ అయింది. సోషల్ మీడియాలో ఇలాంటి పుకార్లను ప్రచారం చేస్తున్న వారిని జోకర్లతో పోలుస్తూ “గజరాజు నడుస్తే గజ్జికుక్కలు అరుస్తాయి” అంటూ ఫైర్ అయ్యారు. సినిమా అద్భుతంగా తెరకెక్కుతుందని, తెలుగు సినిమా గర్వపడే రేంజ్ లో ఈ మూవీని రూపొందిస్తామని రూమర్లకి చెక్ పెట్టారు. ఈ వార్త వచ్చి రెండు రోజులు కూడా కాకముందే ‘హిట్ 3’ నుంచి మేజర్ అప్డేట్ లీక్ అయింది.
‘హిట్ 3’ మేజర్ అప్డేట్ లీక్
శైలేష్ కొలను దర్శకత్వంలో నాని హీరోగా రూపొందుతున్న మరో భారీ సినిమా ‘హిట్ 3’. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమాలో నుంచి ఓ కీలక అప్డేట్ ని లీక్ చేశారు. ఇందులో కార్తి గెస్ట్ రోల్ పోషించబోతున్నారనే వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే డైరెక్టర్ శైలేష్ కొలను స్పందిస్తూ “ప్రేక్షకులకు థియేటర్లలో థ్రిల్లింగ్ సినీమాటిక్స్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి, వాళ్లను సర్ప్రైజ్ చేయడానికి చిత్ర బృందం రేయనకా పగలనకా కష్టపడుతోంది. అయితే కొంతమంది మాత్రం తాము చేసేది కరెక్టేనా ? అని ఆలోచించకుండా చిత్ర బృందం కష్టాన్ని లీకుల రూపంలో నీరుగారుస్తున్నారు. ఒకప్పుడు జర్నలిజం ఎథిక్స్ అద్భుతంగా ఉండేవి. సినిమా గురించి అన్ని విషయాలు తెలిసినా లీక్స్ జోలికి వెళ్లేవారు కాదు. కానీ ఇప్పుడున్న మీడియా పరిస్థితి చూస్తుంటే బాధగా ఉంది. చిత్ర బృందం కష్టాన్ని మాత్రమే కాదు ప్రేక్షకుల ఇంట్రెస్ట్ ను కూడా ఇలా దోచుకుంటున్నారు” అని ఆవేదనను వ్యక్తం చేశారు.
అయితే ఈ రెండు సినిమాలు కూడా నానివే కావడం గమనార్హం. గతంలో చెప్పినట్టే తన కష్టంతో ఒక్కో మెట్టు పేర్చుకుంటూ నాని ముందుకు వెళ్తున్నారు. మరి ఆయన కష్టంపై ఎవరికి కనపడిందో తెలియదు గానీ ఇలా వరుస లీకులతో నానిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు అంటూ మండిపడుతున్నారు ఆయన అభిమానులు.